సంక్రాంతి తర్వాత అన్ని సినీ ఇండస్ట్రీల్లో డల్ ఫేజ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం, జనాల‍్ని మెప్పించే చిత్రాలు సరిగా రావట్లేదు. కానీ మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. అన్ సీజన్ ఫిబ్రవరిలోనే ఏకంగా నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటే 'ప్రేమలు'. మలయాళంతో పాటు తెలుగులోనూ యువతని ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేశారు.
(ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!)
అవును మీరు విన్నది నిజమే. పెద్దగా కథ కాకరకాయ లాంటిది ఏం లేకపోయినా స్క్రీన్ ప్లేలో ఫన్ ఎలిమెంట్స్ జోడించడంతో 'ప్రేమలు'.. మలయాళంలో పెద్ద హిట్టయిపోయింది. తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.17 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. సినిమాలో కథంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కావడం ప్లస్ ట్రెండ్‌కి తగ్గ డైలాగ్స్ అన్నీ ఉండటం మనోళ్లకు నచ్చేసింది. అయితే కొందరు తెలుగు ఆడియెన్స్‌కి మాత్రం ఇది పెద్దగా నచ్చలేదు.
మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2025లో రిలీజ్ ఉంటుందని కూడా చెప్పేసింది. తొలి భాగంలా కాకుండా ఈసారి తెలుగు, తమిళ, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. పోస్టర్స్ తో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే తొలి భాగం.. హీరో పాత్రధారి యూకే వెళ్లడంతో ముగుస్తుంది. మరి సీక్వెల్ స్టోరీ యూకేలో ఉంటుందా? మళ్లీ హైదరాబాద్ లోనే ఉంటుందా అనేది చూాడాలి. అలానే ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా అని త్వరగా సీక్వెల్ తీసేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి?
(ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!)
Comments
Please login to add a commentAdd a comment