జీవీతో మరోసారి ఆనంది రొమాన్స్ | G.V.Prakash Kumar romance with Anandhi | Sakshi
Sakshi News home page

జీవీతో మరోసారి ఆనంది రొమాన్స్

Published Sun, Jan 17 2016 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

జీవీతో మరోసారి ఆనంది రొమాన్స్

జీవీతో మరోసారి ఆనంది రొమాన్స్

 యువ కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో నటి ఆనంది మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోంది. వీరిద్దరూ ఇంతకు ముందు త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో నటించారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతే కాదు శ్రుతిమించిన గ్లామర్ సన్నివేశాలతో కూడుకున్న చిత్రంగా విమర్శలను బాగాను మూటగట్టుకుంది. మరో విషయం ఏమిటంటే అందులో నన్ను అశ్లీల సన్నివేశాల్లో నటింపజేశారంటూ నటి ఆనంది దర్శకుడిపై ఆరోపణలు గుప్పించింది.
 
 దీంతో ఆమెకు కోలీవుడ్‌లో అవకాశాలు రావడం కష్టమే అనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆనందికి మరోసారి జీవీతో రొమాన్స్ చేసే అవకాశం రావడం విశేషమే అవుతుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రానికి ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది బాషా చిత్రంలో రజినీకాంతో ఒక సన్నివేశంలో చెప్పే డైలాగ్ అన్నది గమనార్హం.
 
 ఇక పోతే ఇంతకు ముందు జీవీతో డార్లింగ్ వంటి హిట్ చిత్రాన్నిచ్చిన దర్శకుడు శ్యామ్ ఆంటోన్ ఈ చిత్రానికి మోగాఫోన్ పట్టారు. రజినీకాంత్ హీరోగా ఎందిరన్-2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం ఇటీవలే సెట్‌పైకి వెళ్లింది. ఇందులో నటి ఆనందికి అభినయానికి అవకాశం ఉన్న పాత్ర అట. చిత్రాన్ని అధిక భాగాన్ని పాండిచ్చేరి, చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement