కాలేజీ నేపథ్యంలో టాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. త్వరలోనే మరో కాలేజీ ప్రేమ కథ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెరకెక్కించిన తాజా చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హపెనింగ్ సింగర్ మంగ్లీ పాడిన డూడుం డుక్కుడుం సాంగ్ ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా రిలీజ్ చేశారు. కాలేజీ జంట మధ్య డూడుం డుక్కుడుం అంటూ సాగుతున్న ఈ సాంగ్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్జ్ అందించిన బాణీలు అందించగా.. శ్రీ సాయి కిరణ్ అర్థవంతమైన లిరిక్స్ రాశాడు. మంగ్లీ అద్భుతంగా ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment