సుకుమార్ నిర్మాణంలో తమిళ సినిమా
లెక్కల మాస్టారు సుకుమార్ తీసిన రొమాంటిక్ డ్రామా... 100% లవ్. నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. కేవలం చదువు తప్ప మరేమీ తెలియని బాలు, అతడి మరదలి పాత్రలో తమన్నా చేసిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలోకి రీమేక్ అవుతోంది. మరి తమిళ సినిమాలో సుకుమార్ పాత్ర ఏంటా అని చూస్తున్నారా.. పక్కా కాకినాడ కుర్రోడయిన ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించట్లేదు.. నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. చంద్రమౌళి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ సినిమాలో లీడ్‌రోల్ పోషిస్తున్నాడు. ఈ వివరాలన్నింటినీ ప్రకాషే ట్వీట్ చేశాడు.
తెలుగు దర్శకుడు సుకుమార్ తన తదుపరి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పాడు. 100% లవ్ సినిమాను రీమేక్ చేస్తున్నారని, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలే లాంటి సినిమాలకు పనిచేసిన డూడ్లీ.. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా ఉంటారని కూడా చెప్పాడు. మొత్తానికి ఇన్నాళ్లూ మెగాఫోన్ పట్టుకుని యాక్షన్.. కట్ చెప్పిన మన లెక్కల మాస్టారు నిర్మాతగానూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే కుమార్ 21ఎఫ్ సినిమాతో నిర్మాతగానూ సూపర్ హిట్ కొట్టిన సుక్కు, త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న దర్శకుడు సినిమాకు నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ లోనూ నిర్మాతగా తొలి అడుగు వేస్తున్నాడు.
Yes telugu director Sukumar is producing my next . 100% love remake . Dir chandramouli . Dop dudely (chennai express , dilwale ) #100%love pic.twitter.com/nh87ToN5L0
— G.V.Prakash Kumar (@gvprakash) 5 May 2017