సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు.
ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది.
నాన్ పేయి పేసురేన్ అనే తమిళ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు.
కోలీవుడ్ లో 'గీతాంజలి'
Published Sun, May 29 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM
Advertisement
Advertisement