
నాకు ఇంకో పేరుంది..!
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ హీరోగా బిజీ అయిపోతున్నారు. ఆయన హీరోగా ‘నాకు ఇంకో పేరుంది’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఆనంది కథానాయిక. ‘రోబో-2’ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ శ్యామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇది యాక్షన్‌తో కూడిన చక్కని కుటుంబ కథాచిత్రమని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రాన్ని బుధవారం ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. ప్రేమ్.