
ఏంజెలినా ఫ్లోటింగ్ ప్యాలెస్!
వైవాహిక జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించాలని డిసైడ్ అయినట్టున్నారు హాలీవుడ్ స్టార్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ. దాదాపు 250 మిలియన్ పౌండ్లు వెచ్చించి విలాసవంతమైన నావను కొనుగోలు చేశారు. అలలపై అలాఅలా తేలిపోయే ఈ ఫ్లోటింగ్ ప్యాలెస్‌ను తమ అభిరుచికి అనుగుణంగా తయారు చేయించుకొంటున్నారు. అంతేకాదు... దీన్ని మరింత ఆధునీకరించేందుకు అక్షరాలా మరో రెండు లక్షల పౌండ్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట ఈ కొత్త జంట. ఇటాలియన్ బోట్ మేకింగ్ సంస్థ రిజర్డీ దీన్ని రూపొందిస్తోందని ‘ది మిర్రర్’ కథనం.