అవును.. మేం విడిపోయాం: నటి | Actors Manini De And Mihir Misra Separate After 16 Years Of Marriage | Sakshi
Sakshi News home page

అవును.. ఆ వార్తలు నిజమే: నటి

Published Wed, Jul 8 2020 1:53 PM | Last Updated on Wed, Jul 8 2020 2:01 PM

Actors Manini De And Mihir Misra Separate After 16 Years Of Marriage - Sakshi

ముంబై: కొన్నాళ్లుగా తాను, తన భర్త విడివిడిగా ఉంటున్నామని బాలీవుడ్‌ నటి మానిని డే వెల్లడించారు. భర్త మిహిర్‌ మిశ్రా నుంచి శాశ్వతంగా విడిపోనున్నట్లు తెలిపారు. పదహారేళ్ల వైవాహిక జీవితం ఆనందంగా గడిచిందని.. అయితే ప్రతీ బంధంలోనూ విభేదాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. మనస్పర్థలతో కలిసి ఉండే బదులు.. విడిపోవడమే ఉత్తతమని అభిప్రాయపడ్డారు. కాగా టీవీ నటులు మానిని, మిహిర్‌ మిశ్రా 2004లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అయితే గత ఆరు నెలలుగా దంపతుల మధ్య సఖ్యత చెడిందని, విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వినిపించాయి.(అది సరైందే.. కానీ: నటి)

ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మానిని.. తమ బంధంలో కలతలు రేగిన మాట వాస్తవేమనని పేర్కొన్నారు. ‘‘ప్రతీ బంధంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. వైవాహిక బంధం కూడా అలాంటిదే. అవును.. నిజమే గత ఆర్నెళ్లుగా నేను, మిహిర్‌ వేర్వేరుగా ఉంటున్నాం. ఇందుకు గల కారణాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. నిజానికి నేను మా బంధాన్ని, దానికున్న పవిత్రతను గౌరవిస్తాను. బంధాన్ని నిలబెట్టుకోవడానికి మేం అన్ని రకాలుగా ప్రయత్నించాం. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం మన చేతుల్లో ఉండదు’’ అని చెప్పుకొచ్చారు.

తమ మధ్య ప్రేమానురాగాలకు కొదవ లేదని.. అయితే గత జన్మలో చేసిన పాపమేదో ఇప్పుడు శాపంగా పరిణమించిందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం మిహిర్‌ తన తల్లిదండ్రులతో పుణెలో నివసిస్తుండగా.. మానిని తన కూతురు(మొదటి భర్త వల్ల కలిగిన సంతానం)తో కలిసి ముంబైలో ఉంటున్నారు. ఇక పలు టీవీ సీరియళ్లతో పాటు క్రిష్‌, స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ వంటి సినిమాల్లోనూ మానిని నటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement