సాక్షి, అమరావతి: దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వైవాహిక జీవితం, బంధాలు, బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఇందుకు నిదర్శనం.. పెళ్లయిన వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రం దేశవ్యాప్తంగా ఏపీ కావడమే. దేశంలో వివాహ వయస్సు దాటిన వారిలో పెళ్లయిన వారు 45.2% ఉండగా.. ఏపీలోనే అత్యధికంగా 52.4 % మంది ఉండగా, పెళ్లి కాని వారు మాత్రం 42.9 % ఉన్నారు.
ఈ వివరాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన శ్యాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ం (ఎస్‌ఆర్‌ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్–2020 తెలియజేస్తోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా పెళ్లయిన వారు 45.2 శాతం, పెళ్లి కాని వారు 51.6, పెళ్లయి కూడా వివిధ కారణాలతో ఒంటరిగా ఉంటున్న వారు 3.2 % మంది ఉన్నారు. తెలంగాణలో పెళ్లయిన వారు 48.6, పెళ్లి కాని వారు 47.4 శాతం ఉన్నారు.
పెళ్లి కాని ప్రసాద్‌ల నెలవు బిహార్!
పెళ్లి కాని వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా బిహార్ నిలిచింది. ఈ రాష్ట్రంలో పెళ్లికాని వారు 59.3, పెళ్లయిన వారు 39.1, విడాకులు తీసుకోవడం, భాగస్వామి మరణించడం, ఇతర కారణాలతో ఒంటరిగా ఉన్న వారు 1.6 %గా ఉన్నారు. బిహార్ తర్వాత అత్యధికంగా పెళ్లి కాని వారు ఉత్తరప్రదేశ్ (57.2 %)లో ఉన్నారు. దేశంతో పాటు, రాష్ట్రంలోను పెళ్లి కాని వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు.
దేశంలో పెళ్లి కాని పురుషులు 56.7, స్త్రీలు 46.2 %గా ఉన్నారు. రాష్ట్రంలో పురుషులు 48.3, స్త్రీలు 37.5 % మంది ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా బిహార్‌లో పెళ్లికాని పురుషులు 63.5 శాతం ఉన్నారు. అత్యధికంగా పెళ్లి కాని స్త్రీలు ఉన్న రాష్ట్రంగా కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ నిలిచింది. ఇక్కడ పెళ్లి కాని స్త్రీలు 54.5 % ఉన్నారు. తెలంగాణలో పెళ్లి కాని వారు 47.4 % ఉండగా.. వీరిలో పురుషుల వాటా 53.1 %గా ఉంది.
మన బంధం.. గట్టిదే!
Published Mon, Oct 3 2022 4:13 AM | Last Updated on Mon, Oct 3 2022 12:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment