కూతుళ్లను వ్యభిచార కూపంలోకి నెట్టిన తండ్రి | Daughters shaft pushed the father of prostitution | Sakshi
Sakshi News home page

కూతుళ్లను వ్యభిచార కూపంలోకి నెట్టిన తండ్రి

Published Sat, Feb 13 2016 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

కూతుళ్లను వ్యభిచార కూపంలోకి  నెట్టిన తండ్రి

కూతుళ్లను వ్యభిచార కూపంలోకి నెట్టిన తండ్రి

కీచక తండ్రి అరెస్టు
కూతుళ్లను వ్యభిచార కూపంలోకి నెట్టిన మారుతండ్రి
నిందితుడు గోవింద్

 
బంజారాహిల్స్: పెంపుడు కూతుళ్లను వ్యభిచార కూపంలోకి నెట్టిన మారుతండ్రిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.10 లోని జహిరానగర్‌లో నివసించే పద్మకు ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పద్మ స్థానిక క్యాన్సర్ ఆస్పత్రిలో పని చేసేది. కల్లుకు బానిసైన ఆమె గోవిందు అనే స్థానిక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పద్మ కూతుళ్లను తాము పెంచుకుంటామని గోవిందు భార్య లక్ష్మి అనడంతో వారికి ఇచ్చేసింది. పద్మ కొన్నాళ్లకు మతిస్థిమితం కోల్పోయి అదృశ్యమైంది. పిల్లలిద్దరూ (ప్రస్తుతం 19, 13 ఏళ్లు) గోవిందు, లక్ష్మిల వద్ద పెరిగారు.

పెద్ద కుమార్తెతో గోవిందు దంపతులు ఆరేళ్లుగా వ్యభిచారం చేయిస్తున్నారు. విటుల వద్ద డబ్బు తీసుకొని వారి వెంట పంపుతున్నా రు. పెంపుడు తల్లిదండ్రుల వేధింపులు తాళలేక  ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో గోవిందు తన కూతురు అదృశ్యమైందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.  ఆమె ఆచూకీ కనిపెట్టిన పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. తనతో పాటు తన చెల్లెల్ని పెంపుడు తల్లిదండ్రులు వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని ఆరోపించింది. దీంతో పోలీసులు నిందితుడు గోవిందును అరెస్టు చేశారు. లక్ష్మిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement