Govind
-
70 ఏళ్ల వయసులో నటితో డేటింగ్? గోవింద్ ఏమన్నారంటే?
ప్రేమకు వయసుతో పని లేదు, దానికి ఎటువంటి పరిమితులు ఉండవు అని చెప్తోంది నటి శివంగి వర్మ. సీనియర్ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ జోడించింది. ఇంకేముంది, 71 ఏళ్ల నటుడు 31 ఏళ్ల నటితో ప్రేమలో పడ్డాడంటూ ప్రచారం జోరందుకుంది.అవును, ప్రేమించుకుంటున్నాంతాజాగా ఈ పుకారుపై గోవింద్ నామ్‌దేవ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. అవును, ప్రేమించుకుంటున్నాం. కాకపోతే నిజ జీవితంలో కాదు, రీల్ లైఫ్‌లో! మేమిద్దం గౌరీశంకర్ గోహర్‌గంజ్ వాలే సినిమా చేస్తున్నాం. ఇండోర్‌లో షూటింగ్ జరిగింది. ఓ ముసలి వ్యక్తి యంగ్ లేడీతో ప్రేమలో పడతాడు.. అదే సినిమా కథ!అది నా లైఫ్‌లో జరగదునా వ్యక్తిగత విషయానికి వస్తే.. మరో అమ్మాయితో ప్రేమలో పడటమనేది జీవితంలో జరగదు. ఎందుకంటే నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తనే నా ఊపిరి. ఈ జన్మకు తను చాలు. ఆమె ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. ఆమె కోసం దేవుడితోనైనా యుద్ధం చేస్తా.. అని చెప్పుకొచ్చాడు. కాగా గోవింద్ నామ్‌దేవ్.. 1991లో సౌధాగర్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Shivangi Verma (@shivangi2324) చదవండి: ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్! -
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ తదుపరి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్న గోవింద్ మోహన్‌ను అజయ్‌కుమార్ భల్లా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈనెల 22న అజయ్‌కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజు గోవింద్ మోహన్ బాధ్యతలు చేపడతారు. నళిన్ ప్రభాత్ పదవీకాలం కుదింపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా నళిన్ ప్రభాత్ పదవీకాలం 2028 ఆగస్టు 31 ఉండగా కేంద్రం అర్ధంతరంగా కుదించింది. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ను డిప్యుటేషన్‌పై ఏజీఎంయూటీ కేడర్‌కు మార్చింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా లేదా మూడేళ్లపాటు నళిన్ ఏజీఎంయూటీ కేడర్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగుతారని వివరించింది. అరుణాచల్ ప్రదేశ్– గోవా– మిజోరం– కేంద్ర పాలిత ప్రాంతాలను కలిసి ఏజీఎంయూటీ కేడర్‌గా పిలుస్తారు. ఇది కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటుంది. ప్రభాత్‌కు కేంద్రం కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. -
భార్యతో గొడవ పడొద్దని మందలించిన అన్నను దారుణంగా..
నిజామాబాద్: భార్యతో గొడవ పడొద్దని మందలించిన అన్నను తమ్ముడు గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపిన ఘటన కోటగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొతంగల్‌లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాత పొతంగల్‌కు చెందిన దిమ్మెల గోవింద్ (58), విఠల్ అన్నాదమ్ముళ్లు. గోవింద్ మండల కేంద్రంలో క్షౌ రశాల నడుపుతూ జీవిస్తున్నాడు. విఠల్ తన భార్యతో తరచూ గొడవపడుతుండడంతో అన్న గోవింద్ మందిలించేవాడు. ఈ క్రమంలో గోవింద్‌పై విఠల్ కక్షపెంచుకున్నాడు. రోజులాగే గురువారం పనిపూర్తి చేసుకొని రాత్రి ఇంటికి చేరుకున్న గోవింద్‌ను విఠల్ గొడ్డలితో నరికి హతమర్చాడు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ జయేశ్‌రెడ్డి, ఏఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య విఠల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తనను మందలించినందుకు గోవింద్‌ను విఠల్ హతమర్చాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇవి చదవండి: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా.. -
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్‌బై చెప్పిన గౌరవ్
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ వల్లభ్ పార్టీకి రాజీనామా చేశారు. తాను సనాతనానికి వ్యతిరేక నినాదాలు చేయలేనని, ఇకపై పార్టీలో కొనసాగలేనని ప్రకటించారు. గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తాను పంపిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిలో ‘నేడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మార్గంలో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నేను సనాతన వ్యతిరేక నినాదాలు చేయలేను. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. నేను కాంగ్రెస్‌లో చేరినప్పుడు దేశంలోనే ఘన చరిత్ర కలిగిన పార్టీ అని నమ్మాను. యువకులకు, మేధావుల ఆలోచనలకు విలువ ఇస్తారని భావించాను. అయోధ్యలోని నూతన రామాలయం విషయంలో కాంగ్రెస్ వైఖరికి నేను కలత చెందాను. నేను పుట్టుకతో హిందువును. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. ఇండియా కూటమితో సంబంధం కలిగిన పలువురు నేతలు సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడటం నాకు నచ్చలేదని’ ఆ లేఖలో గౌరవ్ వల్లభ్ పేర్కొన్నారు. గౌరవ్ వల్లభ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ తూర్పు నుంచి తొలిసారి పోటీ చేశారు. గౌరవ్ విద్యావంతునిగా పేరొందారు. జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకునిగా పనిచేశారు. క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్లో డాక్టరేట్ అందుకున్నారు. విద్యావేత్తల కుటుంబం నుండి వచ్చిన గౌరవ్ వల్లభ్ 2023లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. कांग्रेस पार्टी आज जिस प्रकार से दिशाहीन होकर आगे बढ़ रही है,उसमें मैं ख़ुद को सहज महसूस नहीं कर पा रहा.मैं ना तो सनातन विरोधी नारे लगा सकता हूं और ना ही सुबह-शाम देश के वेल्थ क्रिएटर्स को गाली दे सकता.इसलिए मैं कांग्रेस पार्टी के सभी पदों व प्राथमिक सदस्यता से इस्तीफ़ा दे रहाहूं pic.twitter.com/Xp9nFO80I6 — Prof. Gourav Vallabh (@GouravVallabh) April 4, 2024 -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్‌కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
World Boxing Championships: నరేందర్ ముందుకు... శివ థాపాకు చుక్కెదురు
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నరేందర్ బెర్వాల్ (ప్లస్ 92 కేజీలు), గోవింద్ సహాని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... దీపక్ కుమార్ (51 కేజీలు) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అయితే స్టార్ బాక్సర్ శివ థాపా పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. తొలి రౌండ్ బౌట్లలో నరేందర్ 4–1తో మొహమ్మద్ అబ్రోరిదినోవ్ (తజికిస్తాన్)పై, గోవింద్ 5–0తో మెహ్రోన్ షఫియెవ్ (తజికిస్తాన్)పై, దీపక్ 5–0తో లూయిస్ డెల్గాడో (ఈక్వెడోర్)పై విజయం సాధించారు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన శివ థాపా ఈసారి మాత్రం నిరాశపరిచాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్లో బరిలోకి దిగిన శివ థాపా 3–4తో డోస్ రెస్ యురీ (బ్రెజిల్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో భారత బాక్సర్లు హుసాముద్దీన్ (57 కేజీలు), ఆశిష్ చౌధరీ (80 కేజీలు), నవీన్ (92 కేజీలు) పోటీపడతారు. -
పర్లలో అధికారక లాంఛనాలతో గోవింద్ అంత్యక్రియలు
-
Strandja Memorial Boxing Tournament 2023: భారత బాక్సర్లకు రజతాలు
సోపియా: స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు అనామిక, అనుపమ, గోవింద్ కుమార్ సహాని రజత పతకాలు సాధించారు. మహిళల 50 కేజీల ఫైనల్లో జాతీయ చాంపియన్ అనామిక 1–4తో చైనాకు చెందిన హు మెయి చేతిలో ఓడింది. పురుషుల 48 కేజీల తుదిపోరులో గోవింద్ కుమార్ 1–4తో షోదియోర్జన్ మెలికుజీవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల 81 కేజీల ఫైనల్లో అనుపమ 0–5తో ఆస్ట్రేలియన్ బాక్సర్ ఎమ్మా సూ గ్రీన్ట్రి చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో భారత్ మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. ఇందులో మూడు రజతాలు కాగా... ఐదు కాంస్య పతకాలున్నాయి. పురుషుల కేటగిరీలో బిశ్వామిత్ర చొంగ్తమ్ (51 కేజీలు), సచిన్ (54 కేజీలు), మహిళల విభాగంలో కలైవాణి (48 కేజీలు), శ్రుతి యాదవ్ (70 కేజీలు), మోనిక (ప్లస్ 81 కేజీలు) కాంస్యాలు గెలిచారు. -
తెలంగాణ సీఐడీ చీఫ్ కారు బోల్తా.. భార్య దుర్మరణం
-
రోడ్డు ప్రమాదానికి గురైన తెలంగాణ సీఐడీ చీఫ్, భార్య మృతి
జైపూర్: రాజస్తాన్‌లో తెలంగాణ సీఐడీ డీజీపీ గోవింద్ సింగ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జైసల్మేర్ జిల్లాలోని తనోత్ మాత ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తుండగా.. రాంఘర్-టానోట్ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న మహీంద్రా కారు బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గోవింద్ సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జవహర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోవింద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. రాజస్థాన్ లోని రాంఘర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐడీ. విభాగం చీఫ్ గోవింద్ సింగ్ సతీమణి మరణించడంపై డీజీపీ మహేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న తమ సహచర సీనియర్ అధికారి గోవింద్ సింగ్ త్వరితగతిన కోలుకోవాలని డీజీపీ ఆకాంక్షించారు. చదవండి: బీజేపీ షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ సమాధానం.. ఏమన్నారంటే! -
Bengaluru: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!
ఇండియా గేమింగ్ మార్కెట్లో వెస్ట్రన్ డెవలపర్స్ టాప్‌లో ఉన్నారు. అయితే అఫ్సర్ అహ్మద్, గోవింద్ అగర్వాల్‌లు వెస్ట్రన్ గేమింగ్ కంపెనీలకు సవాలు విసురుతూ, సత్తా చాటుతున్నారు. అవును. మన ఆట మొదలైంది... లాక్డౌన్ సమయంలో యూట్యూబ్‌లో వీడియోలు చూసీచూసీ విసుగెత్తి పోయాడు ముంబైకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి సంజీవ్ మెహతా. తన మొబైల్ ఫోన్లో ‘లూడోస్టార్’ గేమ్ ఆడడం మొదలుపెట్టడంతో విసుగు మాయమై హషారు ప్రత్యక్షమైంది. తమ ఫోనే లోకంగా ఎవరికి వారు విడిపోయిన ఆ ఇంట్లో కుటుంబసభ్యులందరినీ ఒకచోట చేర్చింది లూడో స్టార్. బాల్యం నాటి తన ఫేవరెట్ ఆటకు ఆన్లైన్ రూపమైన ‘లుడో స్టార్’ 57 సంవత్సరాల మెహతాకు స్ట్రెస్‌బస్టర్‌గా పనిచేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో ఒక హౌజింగ్ సొసైటీలో వాచ్‌మన్‌గా పనిచేసే రాజా సాహు ఇష్టమైన ఆట లుడో స్టార్. ‘లాక్డౌన్ టైమ్‌లో నేను ఇక్కడ ఉంటే, మా ఆవిడ ఊళ్లో ఉండేది. నేను ఊరికి వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో లూడో స్టార్ మమ్మల్ని ఒకటి చేసింది. ఒకరిని ఒకరు ఓడించుకుంటూ, ఆటపట్టించుకుంటూ ఉండేవాళ్లం’ ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు రాజా సాహు. ‘గేమ్ బెర్రీ ల్యాబ్స్’ ఈ లుడో స్టార్ సృష్టికర్త. ఐఐటీ–ఖరగ్‌పూర్ గ్రాడ్యుయెట్స్ అఫ్సర్ అహ్మద్, గోవింద్ అగర్వాల్‌లు బెంగళూరు కేంద్రంగా ఈ కంపెనీ ప్రారంభించారు. ఐఐటీ రోజుల్లోనే రకరకాల గేమ్స్ రూపకల్పన గురించి ఆలోచన చేస్తుండేవారు ఈ ఇద్దరు మిత్రులు. చదువు పూర్తయిన తరువాత ‘మూన్‌ఫ్రాగ్ ల్యాబ్స్’ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తున్న మాటేగానే వారి మనసంతా ఆన్లైన్ ఆటలతోనే నిండిపోయింది. ఇక ఇలా అయితే కుదరదనుకొని ఒక ఫైన్‌మార్నింగ్ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. మొబైల్లో క్లాసిక్ బోర్డ్ గేమ్స్‌ను ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు కనెక్ట్ అయ్యోలా తీర్చిదిద్దడానికి కసరత్తులు ప్రారంభించారు. తమ సేవింగ్స్‌తో బెంగళూరులో ‘గేమ్ బెర్రీ ల్యాబ్స్’ మొదలుపెట్టారు. కంపెనీకి సంబంధించిన ప్రాడక్ట్, యుఎక్స్ వెర్టికల్స్కు సంబంధించిన వ్యవహారాలను అహ్మద్ పర్యవేక్షించేవాడు. ఇక ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలను అగర్వాల్ చూసుకునేవాడు. మొదటి సంవత్సరంలోనే కంపెనీ లాభాల బాట పట్టడం విశేషం. గేమ్ బెర్రీ ల్యాబ్స్‌కు చెందిన రెండు పాపులర్ సోషల్ మల్టీప్లేయర్ గేమ్స్ లుడో స్టార్, పర్చిసి స్టార్ 200 మిలియన్ డౌన్‌లోడ్స్‌తో టాప్‌లో ఉన్నాయి. ఫ్రీ–టు–ప్లే– బిజినెస్ మోడల్లో మొదలైన ‘గేమ్ బెర్రీ ల్యాబ్స్’కు ఇన్ యాప్ పర్చెజెస్(ఐఏపి), యాడ్స్ ప్రధాన ఆదాయ వనరు. ‘గేమ్ అంటే గేమే’ కాన్సెప్ట్నే నమ్ముకుంటే ‘లుడో గేమ్’ అంత పెద్దహిట్టై ఉండేది కాదు. అహ్మద్, అగర్వాల్ మాటల్లో చెప్పాలంటే ఆటకు అనుబంధాలను జోడించారు. ‘సంప్రదాయంగా లూడోను ప్లేయర్స్ చూసే పద్ధతిని గేమ్బెర్రీ ల్యాబ్స్ మార్చేసింది’ అంటారు సగౌరవంగా ఇద్దరు. ‘ఇండియన్ గేమింగ్ మార్కెట్లో వెస్ట్రన్ డెవలపర్స్ అగ్రస్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిని గేమ్బెర్రీ ల్యాబ్స్, గేమ్షన్లాంటి కంపెనీలు మార్చి మన సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాయి’ అంటున్నారు ఆల్ ఇండియన్ గేమింగ్ ఫెడరేషన్ సీయివో రోలాండ్. రాబోయే పన్నెండు నెలల సమయంలో టీమ్ సభ్యులను రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉంది కంపెని. అంతేకాదు టెక్నాలజీ క్రియేషన్‌లో పెట్టుబడులను పెంచాలనుకుంటుంది. చదవండి: Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్ Divya Mittal: ఐ.ఏ.ఎస్ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి -
శివాజీపై కర్ణాటక డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
బెలగావి: ఛత్రపతి శివాజీ మహరాజ్ కన్నడ వ్యక్తి అని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కార్జోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్యపై చాలా రోజులుగా మహా రాష్ట్ర, కర్ణాటక అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటగా బెల్గావ్, కార్వార్ కర్ణాటకలోనివి కాదని, మహారాష్ట్రవని సీఎం ఉద్ధవ్‌ఠాక్రే వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఆ వెంటనే ఆర్థిక రాజధాని ముం బై కర్ణాటకది అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం లక్ష్మణ్ వివాదాన్ని మరింత పెద్దది చేశారు. దీంతో ఎన్సీపీ నేతలు రంగంలోకి దిగి లక్ష్మణ్‌పై విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తుది తీర్పువచ్చే వరకు కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర భూభాగంగా ప్రకటించాలని ఉద్ధవ్ ఇటీవల డిమాండ్ చేశారు. దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు ఉప ముఖ్య మంత్రులు ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. కరువు వస్తే మహారాష్ట్రకు వచ్చారు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ’కన్నడిగ’ అని డిప్యూటీ సీఎం గోవిద్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు చరిత్ర తెలియదని, శివాజీ పూర్వీకుడు బెల్లియప్ప కర్ణాటకలోని గడగ్ జిల్లా సోరటూర్‌కు చెందినవాడని పేర్కొన్నారు. గడగ్‌లో కరువు వచ్చినపుడు బెల్లియప్ప మహారాష్ట్రకు బయలుదేరాడని డిప్యూటీ సీఎం తెలిపారు. శివాజీ నాల్గవ తరానికి చెందిన వ్యక్తి అని గోవింద్ వ్యాఖ్యానించారు. శివసేన గుర్తుగా, పార్టీ పేరుగా పెట్టుకున్నది ఒక కన్నడ వ్యక్తి శివాజీది అని పేర్కొన్నారు. ఉద్ధవ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో గొడవలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి బెల్గావ్ సమస్యను లేవనెత్తాడని కార్జోల్ ఆరోపణలు గుప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో విఫలమైందని ఉద్ధవ్ ప్రజాధరణ కోల్పోతున్నాడని మరో డిప్యూటీ సీఎం లక్ష్మణ్ ఆరోపించారు. ముంబై కర్ణాటకలో భాగం కావాలని, లేదా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లక్ష్మణ్ డిమాండ్‌చేశారు. స్వేచ్ఛ కోసం కిట్టూర్ రాణి చెన్నమ్మ బ్రిటిష్ వారిపై సాయుధ తిరుగుబాటుకు దారితీసిన భూమి బెల్గావి అని బెలగావి జిల్లాకు చెందిన మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశికళ జోల్లె వ్యాఖ్యానించారు. -
కోట్లకు పడగెత్తిన ‘గోవిందు’డు!
నర్సీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. అవినీతి జరుగుతుందని ఫిర్యాదు చేస్తేచాలు సంబంధిత అధికారుల అక్రమాస్తులను పెకిలించి, వారి నిజస్వరూపాలను బయటపెడుతోంది. నర్సీపట్నం నియోజకవర్గంలో మంగళవారం అదే జరిగింది. మాకవరపాలెం పీఏసీఎస్‌లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు రైతుల నుంచి లంచాలు తీసుకొని కోట్ల రూపాయల ఆస్తులను కూటబెట్టినట్టు ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు చేశారు. ఈ సందర్భంగా గోవిందు ఆదాయానికి మించి 1.75 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఏసీబీ అడిషనల్ఎస్పీ షకీలాభాను కథనం మేరకు.. మాకవరపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్)లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు పలు అక్రమాలకు పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు అదే మండలానికి చెందిన గవిరెడ్డి చక్రవర్తి, తమరాన ఎర్రనాయుడు, బంగారు ఎర్రినాయుడుల ఆరోపణ. గోవిందు రుణ మాఫీలో రైతులను మోసం చేసి అక్రమాస్తులు కూడబెట్టారని, రైతులకు రుణాలు ఇవ్వకుండా తనే తీసుకుని మోసం చేసినట్టు ఇటీవల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలాభాను, డీఎస్పీ రంగరాజుల ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. నర్సీపట్నం, మాకవరపాలెం, బలిఘట్టం, గిడుతూరు, రామన్నపాలెంలలో గోవిందుకు సంబంధించిన ఆస్తులను సోదా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు కొనసాగాయి. అనంతరం ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలాభాను విలేకరులతో మాట్లాడారు. స్టాఫ్ అసిస్టెంట్ శీరంరెడ్డి గోవిందు వద్ద ఆదాయానికి మించి కోటి 75 లక్షల రూపాయల విలువైన అక్రమాస్తులున్నట్టు గుర్తించామన్నారు. వీటిలో 2019లో బలిఘట్టంలో కొనుగోలు చేసిన 323, 295 చదరపు అడుగుల ఇంటి స్థలాలు, మాకవరపాలెం మండలం రామన్నపాలెంలో వ్యవసాయ భూమి 8.44 ఎకరాలు, 87 సెంట్ల ఇంటి స్థలం, భార్య కృష్ణవేణి పేరుతో బలిఘట్టంలో 2014లో 39 సెంట్లు, 2019లో 30 సెంట్ల ఇంటిస్థలాలు ఉన్నాయన్నారు. అలాగే రూ. 55.88 లక్షల విలువైన వందకు పైగా ప్రాంసరీనోట్లు, రూ. లక్ష విలువైన మార్ట్గేజ్ డీడ్, 45,288 రూపాయల బ్యాంక్ బ్యాలన్స్, రూ. 87 వేలు విలువ గల గృహోపకరణాలు, 347 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇంట్లో రూ. 28 వేల నగ దు, హీరో హోండా మోటారు సైకిల్ ఉన్నట్టు గుర్తించామని వివరించారు. దీనికి సంబంధించి ఆస్తులను సీజ్ చేసి, గోవిందును అరెస్టు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సోదాల్లో సీఐలు గఫూర్, అప్పారావు, రమేష్, లక్ష్మణమూర్తిలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన గోవిందు నివాసం ఉంటున్న ఇల్లు మాకవరపాలెంలో కలకలం మాకవరపాలెం(నర్సీపట్నం): స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ స్టాఫ్ అసిస్టెంట్ శీరంరెడ్డి గోవింద ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టడంతో స్థానికంగా కలకలం రేగింది. పీఏసీఎస్ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. గోవిందపై రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు నర్సీపట్నంతోపాటు తన స్వగ్రామమైన గిడుతూరులోని సోదరులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మండలంలో ఉదయం ఏడు గంటలకు ముందే ప్రారంభమైన ఈ సోదాల్లో భాగంగా మండల కేంద్రంలోని పీఏసీఎస్ సీఈవో శెట్టి గోవింద ఇంటిలో డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. అనంతరం 8.30 గంటలకు పీఏసీఎస్ తాళాలు తీయించిన డీఎస్పీ.. పర్సన్ ఇన్చార్జి పాశపు నాగేశ్వరరావు సమక్షంలో స్టాఫ్ అసిస్టెంట్ గోవిందకు చెందిన వివరాలను పరిశీలించారు. గోవింద ఎప్పుడు విధుల్లో చేరాడు, ఏఏ కేటగిరీల్లో పని చేశారో ఆరా తీశారు. 1994లో నైట్ వాచ్‌మన్‌గా చేరిన గోవింద 1999 నుంచి 2009 వరకు క్లర్క్‌గా, ప్రస్తుతం స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టు ఏసీబీ సీఐ శ్రీనివాస్ వివరాలు సేకరించి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే గోవింద విధులు, రుణాల మంజూరు ఎలా చేశారనే విషయాన్ని సోదాల సమయంలో పీఏసీఎస్‌కు వచ్చిన రైతులను కూడా అడిగితెలుసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు అధికారులు ఈ సోదాలను కొనసాగించారు. అంతకు ముందు పీఏసీఎస్‌కు పక్కనే ఉన్న గ్రామ సచివాలయంలో గోవిందపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో ఒక్కడైన కొండలఅగ్రహారం గ్రామానికి చెందిన సుర్ల కన్నబాబును సీఐ విచారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. -
మనసులు దోసేశాడు
ఒక్క నిముషం కూడా తీరిక లేకుండా (ఇంటర్వ్యూ చేసే సమయంలో సాక్షితో మాట్లాడేంత సమయం కూడా ఇవ్వలేదు) ఇడ్లీ–దోశల తయారీలో బిజీగా ఉన్నారు గోవింద్. మీ దోసెలో ప్రత్యేకత ఏంటి?’ అని అడిగితే, ‘మీరే తిని చూడండి! అర్థమవుతుంది’ అంటూ నవ్వుతూ తల తిప్పకుండా, అవలీలగా దోసె వేసేసి, దాని మీద పల్చగా ఉండే ఉప్మా వేసి, ఆ పైన, ఉల్లి తరుగు, బటర్ వేస్తారు, చివరగా మసాలా కారం జల్లి. బటర్‌ను బాగా కరిగిస్తూ, ఉప్మా కారం మసాలాలు దోసె అంతా పట్టేలా చేస్తారు. ఆ తరవాత మళ్లీ ఉల్లి తరుగు, టొమాటో తరుగు, కొత్తిమీర చల్లుతాడు. చివరగా చీజ్ వేస్తారు. దానిని కూడా కరిగించి, బాగా కరకరలాడే దోసె తయారుచేసి, వేడివేడిగా అందిస్తారు గోవింద్.ఈ రుచి కోసం ఉదయాన్నే పెద్ద క్యూ సిద్ధమవుతుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌజ్ దగ్గర గత 30 ఏళ్లుగా వినియోగదారులకు వివిధ రకాల రుచులను అందిస్తున్నారు. ప్రధాన రోడ్డులోని చౌరస్తా దగ్గర రోడ్డు పక్కన బండిపై తన కుటుంబ సభ్యులతో కలిసి గోవింద్ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడి పరిచయం ఉన్న వాళ్లు గోవింద్‌ను ఆప్యాయంగా భాయ్..భాయ్ అంటూ పలకరిస్తుండడంతో...గోవింద్ కాస్తా...గోవింద్ భాయ్‌గా మారిపోయారు. ఈ ఘుమఘుమల ప్రక్రియ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా సాగుతూనే ఉంటుంది. దోసెలు మాత్రమే కాదు, ఆ పక్కనే తాజాగా ఇడ్లీ కూడా సిద్ధమవుతూ ఉంటుంది. గోవింద్ వేసే దోసె ఆహారప్రియుల నోరూరిస్తుంది. తన చుట్టూ నిరీక్షిస్తున్న కస్టమర్ల విన్నపాలు వింటూ, వాటికి అనుగుణంగా ఫలహారాలు తయారు చేయడంలో తలమునకలైనా, ఆ ముఖంలో ఒత్తిడి కనపడదు. దోసె, ఇడ్లీ, వడ, ఫ్రైడ్ ఇడ్లీలతోపాటు అక్కడ ప్రత్యేకంగా లభించే చట్నీ కోసం ఎంతసేపైనా వేచి చూస్తారు కస్టమర్లు. అందరికీ గోవింద్ భాయ్ దోసె వేసిన తరవాత, పైన వేసే చీజ్, బటర్, ఉల్లి తరుగు, ఆలుగడ్డ, టొమాటో, రహస్యంగా తయారుచేసుకున్న మసాలాలు, చీజ్... ఇవన్నీ దోసెను కమ్మేస్తుంటే, ఆ దోసెలు రంగురంగుల సీతాకోకచిలుకల్లా ప్లేట్లలోకి ఎగిరి వస్తుంటాయి. కరిగించిన బటర్ వేయడం వల్ల, టొమాటో ముక్కలు మెత్తబడి, రుచికరంగా తయారవుతుంది దోసె. ఇలా తయారైన దోసెను ఆకు మీదకు తీసి, ఆ ఆకును పేపర్ మీద ఉంచి అందిస్తారు. అది నోట్లో పెట్టుకోగానే అమృతం సేవించినట్లు అనుభూతి చెంది ‘జై గోవిందా!’ అనకుండా ఉండలేరు. ఒకేసారి ఎనిమిది దోసెలు వేస్తారు గోవింద్ భాయ్. – పిల్లి రాంచందర్, సాక్షి చార్మినార్, హైదరాబాద్ స్వయం కృషితో.... మా నాన్న పేరు రాఘవులు. మాది పేద కుటుంబం. మేం ముగ్గురం అన్నదమ్ములం. పెద్దన్న నర్సింహం గుల్జార్‌హౌజ్ ఆగ్రా హోటల్ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్ మీద బండి పెట్టి, ఇడ్లీ–దోసె తయారు చేయడం ప్రారంభించారు. ఆయన దగ్గర మేమందరం పని చేసాం. ఆయన స్ఫూర్తితో 1990లో సొంతంగా ఇడ్లీ బండి పెట్టి, వ్యాపారం మొదలుపెట్టాను. వెయ్యి రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన నా వ్యాపారం బాగా ఎదిగింది. నాకు మంచి ఆదాయం వస్తుండటంతో, మా పిల్లలను చదివించుకుంటున్నాను. కష్టపడి పని చేస్తే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడితే నలుగురికీ ఆదర్శంగా ఉంటారు. – గోవింద్ భాయ్ -
వైఎస్ జగన్ చేయగలిగిందే చెప్తున్నారు
-
సత్తా చాటిన గోవింద్
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ స్కూల్ గేమ్స్ టెన్నిస్ ఎంపిక పోటీల్లో ఎస్. యశస్వీ సాయి గోవింద్ సత్తా చాటాడు. హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్ ఆర్ఆర్సీ మైదానంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్‌లో సరోజిని అకాడమీ విద్యార్థి సాయి గోవింద్ 6–0తో అదిత్‌పై, 6–1తో ధీరజ్‌పై, 6–4తో కృష్ణ సంతోష్‌పై విజయం సాధించాడు. వచ్చే నెల గుంటూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో గోవింద్ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా గోవింద్‌ను సరోజిని అకాడమీ కార్యదర్శి కిరణ్ అభినందించారు. -
బీజేపీ ‘దళిత గోవిందం’ రసాభాసా...!
లక్నో: దేశంలోని దళితవర్గాలకు చేరువయ్యేందుకు రాజకీయపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యధిక ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ వర్గాల ఓట్లు కీలకంగా మారాయి. కొన్ని దశాబ్దాలుగా అగ్రవర్ణాల పార్టీగా పడిన ముద్రను తొలగించే ప్రయత్నంలోనూ ఆ పార్టీ నిమగ్నమైంది. దళితుల ఆదరాభిమానాలు పొందడంలో వెనకబడిందన్న పలు విశ్లేషణలు, నివేదికల నేపథ్యంలో ఈ వర్గాల మనసు గెలుచుకోవడంపై అధికార బీజేపీ దృష్టిపెట్టింది. దీనికోసం దళితుల ఇళ్లల్లో భోజనం, బస వంటి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని సైతం ప్రారంభించింది. అయితే వివిధ రాష్ట్రాల్లో నేతలు అనుసరిస్తున్న తీరుతో ఇది ఒకింత రసాభాసాగాను తయారైంది. యూపీలో ఓ దళితవాడలోని ఇంటికి చెప్పా పెట్టకుండానే ఓ మంత్రివర్యుడు మందీ మార్భలంతో వాలిపోయాడు. వచ్చిన చిక్కల్లా ఆ ఇంట్లో వండిన భోజనం కాకుండా మినరల్ వాటర్ సహా వడ్డించే వస్తువులు, ఆహారం ఇలా మొత్తం హోటల్ నుంచే తెప్పించి అక్కడ ఆరగించడమే. ఎంపీలు, మంత్రులతో సహా పార్టీ నేతలంతా కనీసం ఒక్కనాడైనా దళితవాడల్లో గడపాలన్న అధినాయకత్వం హుకుంను ఆ మంత్రి ఆ విధంగా అర్థం చేసుకున్నాడన్న మాట. సురేష్ రానా అనే ఈ మంత్రి హఠాత్తుగా రాత్రి 11 గంటల సమయంలో అలీఘర్‌లోని ఓ దళితుడి ఇంట్లో ప్రత్యక్షమై ఇలా ఆభాసుపాలయ్యారు. తమ ప్రమేయం ఏమాత్రం లేకుండానే జరిగిన ఈ తంతును గురించి సదరు గృహస్థు రజనీష్ కుమార్ మీడియా ఎదుట వివరించడంతో ఈ ఉదంతం బయటకొచ్చింది. ఆ ఇంట్లో వండిన పదార్థాలూ తిన్నాననీ, ఆ కుటుంబంతో కలిసి ఉదయం టిఫెన్ కూడా చేశానని చివరకు ఆ మంత్రి సంజాయిషీ ఇచ్చుకోక తప్పలేదు. ఈ ఒక్క ఘటనతోనే దళిత నివాసాల్లో భోజనం అంకం ముగిసిపోలేదు. దళితులతో మమేకమవ్వడంలో భాగంగా మంత్రులు ‘దోమకాట్ల’కు సైతం గురవుతున్నారంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్ తాజాగా సెలవిచ్చేశారు. దీని నుంచి రాజకీయంగా ఆశించిన ఫలితాలు పొందేందుకు దళితుల ఇళ్లలో రాత్రంతా దోమలతో కుట్టించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ అనుభవం మంచిదనే భావనలో కూడా ఉన్నారని, ఈ పనిలో సంతృప్తి ఉన్నందున ఇది తమను పరిపుష్టం చేస్తుందని వెల్లడించారు. గత నెలలో కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ కొందరు దళితులతో కలిసి అయిదునక్షత్రాల హోటల్లో విందు ఆరగించిన ఫోటోలు సోషల్‌మీడియాలో విస్తృతంగా షేర్ కావడం, దానిపై విమర్శలు రావడం తెలిసిందే. యూపీకే చెందిన మరోమంత్రి రాజేందర్ ప్రతాప్‌సింగ్ దళితులతో కలిసి తినడం ద్వారా వారి ఉద్ధరణకు కృషి చేస్తున్న బీజేపీ నాయకులు శ్రీరాముడితో పోల్చతగినవారంటూ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు దళితవర్గాలను కించపరిచేందుకు దోహదపడుతున్నాయంటూ కాషాయపక్ష ఎంపీ ఉదిత్‌రాజ్ తప్పబట్టారు. తాము ఉచ్ఛస్థాయిలో ఉంటే దళితులు అథమస్థాయిలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఉపయోగపడుతోందని ఓ దళితుడిగా తానీ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు స్పష్టంచేశాడు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి, ఫైర్‌బ్రాండ్ నాయకురాలు ఉమాభారతి మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన దళితులతో భోజనం కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రజలతో భోజనం చేసి వారిని పరిశుద్ధులుగా చేయడానికి తానేమి శ్రీరామ భగవాన్ను కానంటూ మరో వివాదానికి తెరలేపారు. విమర్శలు వెళ్లువెత్తడంతో ఆమె క్షమాపణలు చెప్పక తప్పలేదు. దళితులే ఢిల్లీలోని తన ఇంటికి వస్తే, వారికి భోజనం పెట్టడంతో తమ ఇంటి వాళ్లు వారి ప్లేట్లు కూడా కడుగుతారంటూ వ్యాఖ్యానించారు. అయితే దళితుల హృదయాలను గెలుచుకోవడానికి బదులు నాయకులు చేష్టలతో ఈ కార్యక్రమం కొన్ని చోట్ల ‘ఫార్స్’గా మారడం పట్ల చివరకు ఆరెస్సెస్ నుంచి కూడా హెచ్చరికలు ఎదుర్కోక తప్పలేదు. కేవలం దళితుల ఇళ్లకు వెళ్లడంతోనే ప్రయోజనం ఉండదని, వారిని బీజేపీ నాయకుల ఇళ్లల్లోకి ఆహ్వానిస్తేనే ఉభయతారకంగా ఉంటుందని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ కూడా సూచించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కమల్, రజనీకాంత్ సినిమాలను నిషేధించాలి
యశవంతపుర: కావేరి జలా వివాదాలకు సంబంధించి కర్ణాటకకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్న తమిళ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలను నిషేధించాలని కన్నడ సంఘల నాయకులు తీర్మానించారు. బుధవారం కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు బెంగళూరులో ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలను స్థాపించిన కమల్, రజనీలు తమిళనాడుకు మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారన్నారు. అయితే కన్నడిగుడైన రజనీకాంత్ కర్ణాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం మంచిదికాదన్నారు. ఆ ఇద్దరు నటులు నటించిన సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు సారా గోవిందు పేర్కొన్నారు. ఇప్పుటికే కన్నడ చళవళి వాటాల్ నాగరాజు వీరిద్దరి సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేసిన్నట్లు గోవిందు గుర్తు చేశారు. -
రెండు బైక్‌లు ఢీ... ఇద్దరి మృతి
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పాతపాడు సమీపంలో ఒంగోలు-గిద్దలూరు రహదారిపై సోమవారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పాతపాడు నుంచి చిరుపల్లి గోవింద్ (18), కిట్టయ్య బైక్‌పై వెళుతుండగా...ఇంకో బైక్‌పై శివనరేంద్ర వర్మ(20) ఎదురుగా వచ్చి ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో గోవింద్, శివనరేంద్ర వర్మలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారు మృతి చెందారు. శివనరేంద్ర వర్మది విశాఖ గాజువాక ప్రాంతం కాగా కంభంలో కెనాల్ పనుల్లో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మరో ఘటనలో ఇదే రహదారిలో బచ్చలకూరపాడు వద్ద రెండు బైక్‌లు ఢీకొనగా నలుగురికి గాయాలు అయ్యాయి. కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావుతోపాటు మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
విద్యుధ్ఘాతానికి వ్యక్తి బలి
వరికోత యంత్రానికి విద్యుత్ తీగలు తాకిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి గోవింద్(24) వరికోత యంత్రం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు పొలం కోస్తున్న క్రమంలో పైన ఉన్న హైటెన్షన్ తీగలకు వాహనం తాకడంతో.. విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వీడు సామాన్యుడు కాదు..!
అంతర్రాష్ట్ర గొలుసు దొంగ అరెస్టు 25 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం యూపీ నుంచి వచ్చి చోరీలు నలుగురితో ముఠా ఏర్పాటు పరారీలో మరో ముగ్గురు నిందితులు అత్తాపూర్: వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతరాష్ట్ర చైన్స్నాచర్ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతని నుంచి 25తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు ముఠా సభ్యులకోసం ప్రత్యేక బలగాలు గాలిస్తున్నాయి. శనివారం శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గత కొన్నినెలలుగా శంషాబాద్ డివిజన్ పరిధిలో చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం కిస్మత్పూర్లో వాహన త నిఖీలు నిర్వహిస్తుండగా చైన్‌స్నాచర్లు గోవింద్(23), సంజయ్(25) తారసపడడంతో పోలీసులు వారిని వెంబడించగా సంజయ్ పారిపోయాడు. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ యాదయ్య గోవింద్‌ను పట్టుకున్నాడు. అతడిని విచారించగా చేసిన నేరాలను అంగీకరించడంతో ఇతని వద్ద నుంచి 25తులాల బంగారు ఆభరణాలు, పల్సర్‌బైక్(యూపి11జెడ్6289)ను స్వాధీనం చేసుకున్నారు. అతని ముఠా సభ్యులైన హబీర్, మన్‌ప్రీత్, సంజయ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి పట్టుకున్న క్రైం కానిస్టేబుల్ యాదయ్యకు రూ.50వేల రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, ఇన్ ్సస్పెక్టర్ ఉమేందర్, డీఐ వేణుగోపాల స్వామీ ఎస్పై వెంకట్‌రెడ్డి, నర్సింహ్మ, రవీందర్ నాయక్‌లు పాల్గొన్నారు. యూపీ నుంచి వచ్చి ..... ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామిలిజిల్లా ఖాన్పూర్ గ్రామాని కి చెందిన గోవింద్ మరో ముగ్గురితో కలిసి కొన్ని నెలల క్రితం రాజేంద్రనగర్‌కు వచ్చాడు. దుస్తుల విక్రేతలుగా పరిచయం చేసుకుని శాస్త్రీపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఉదయం రెక్కి నిర్వహించి మహిళలు ఒంటరిగా తిరుగుతున్న ప్రాంతా ల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవారు. ఇప్పటి వరకు 27 స్నాచింగ్‌లు చేశాడని అందులో 17 చోరీలు శంషాబాద్ డివిజన్‌లోనే చేసినట్లు సమాచారం.రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8, మైలార్‌దేవ్‌పల్లిలో 5, శంషాబాద్‌లో 4, లంగర్‌హౌస్‌లో 4, కులుసుంపురాలో 2, టప్పచపుత్రలో 1, చత్రినాకాలో 1, మీర్‌చౌక్ 1, కామటిపురాలో 1 స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. పట్టుబడింది ఇలా.. గొలుసు దొంగలపై నిఘా వేసిన రాజేంద్రనగర్ పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా సేకరించిన నిందితుల ఫోటోలతో గాలింపులు చేపట్టారు. ఇం దులో భాగంగా శనివారం కిస్మత్పూర్ గ్రామంలో ఇన్స్‌స్పెక్టర్ ఉమేందర్, డీఐ వేణుగోపాల్,క్రైం ఎస్సై వెంకట్‌రెడ్డి తనిఖీలు నిర్వహిస్తుండగా బండ్లగూడ వైపు నుంచి పల్సర్‌బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన కానిస్టేబుల్ యాదయ్య వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్ వెనుక కూర్చున సంజయ్ పారిపోయాడు. బైక్ నడుపుతున్న గోవింద్‌ను పట్టుకున్నాడు. నలురుగు ముఠాగా ఏర్పడి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. -
కూతుళ్లను వ్యభిచార కూపంలోకి నెట్టిన తండ్రి
కీచక తండ్రి అరెస్టు కూతుళ్లను వ్యభిచార కూపంలోకి నెట్టిన మారుతండ్రి నిందితుడు గోవింద్ బంజారాహిల్స్: పెంపుడు కూతుళ్లను వ్యభిచార కూపంలోకి నెట్టిన మారుతండ్రిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.10 లోని జహిరానగర్‌లో నివసించే పద్మకు ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పద్మ స్థానిక క్యాన్సర్ ఆస్పత్రిలో పని చేసేది. కల్లుకు బానిసైన ఆమె గోవిందు అనే స్థానిక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పద్మ కూతుళ్లను తాము పెంచుకుంటామని గోవిందు భార్య లక్ష్మి అనడంతో వారికి ఇచ్చేసింది. పద్మ కొన్నాళ్లకు మతిస్థిమితం కోల్పోయి అదృశ్యమైంది. పిల్లలిద్దరూ (ప్రస్తుతం 19, 13 ఏళ్లు) గోవిందు, లక్ష్మిల వద్ద పెరిగారు. పెద్ద కుమార్తెతో గోవిందు దంపతులు ఆరేళ్లుగా వ్యభిచారం చేయిస్తున్నారు. విటుల వద్ద డబ్బు తీసుకొని వారి వెంట పంపుతున్నా రు. పెంపుడు తల్లిదండ్రుల వేధింపులు తాళలేక ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో గోవిందు తన కూతురు అదృశ్యమైందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనిపెట్టిన పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. తనతో పాటు తన చెల్లెల్ని పెంపుడు తల్లిదండ్రులు వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని ఆరోపించింది. దీంతో పోలీసులు నిందితుడు గోవిందును అరెస్టు చేశారు. లక్ష్మిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డల స్వార్థానికి తల్లి ‘బలి’
ప్రపంచం వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధిస్తున్నప్పటికీ మూఢనమ్మకాలు ఇంకా విజృంభిస్తూనే ఉన్నాయి. కొందరు మంత్రగాళ్లుగా అవతారమెత్తి ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్నారు. సొంత లాభం కోసం కన్నతల్లిని బలిచ్చిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. సాక్షి, ముంబై: ఇద్దరు కొడుకులు తమ సొంత ప్రయోజనాలకోసం కన్నతల్లినే బలిచ్చారు. ఆలస్యంగా వెలుగులోకివచ్చిన ఈ ఘటన నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ సమీపంలోని టాకే హర్ష్ గ్రామంలో గత అక్టోబర్ నెలలో దీపావళి పండుగ సమయంలో జరిగింది.ఈ ఘటనలో తల్లి బుధిబాయితోపాటు మరో మహిళ కాశిబాయిని కూడా దుండగులు బలిచ్చారు.‘శ్రమజీవి సంఘటన’ చొరవతో మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘోరంపై ఘోటి పోలీసులు కేసు నమోదు చేసుకుని పదిమందిని అరెస్టు చేశారు. పోలీసులు అందించిన వివరాల మేరకు.. ఠాణే జిల్లా మోకాడా తాలూకాలోని దాండవల్ గ్రామానికి చెందిన బుధిబాయికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, కొంతకాలంగా తమ కుటుంబాల్లో సుఖశాంతులు కరువయ్యాయని కుమారులైన కుమారులైన కాశినాథ్ దోరే (31), గోవింద్ దోరే (28) తమ సోదరి రాహిబాయితో చెప్పుకుని తరచూ బాధపడేవారు దీంతో టాకే హర్షే గ్రామంలో బచ్చుబాయి అనే మంత్రగత్తె ఉందని, ఆమెను కలిస్తే వారి సమస్యలు తొలగిపోతాయని రాహిబాయి తన సోదరులకు సలహా ఇచ్చింది. ఆమె సలహా మేరకు కాశినాథ్ (31), గోవింద్‌లు మంత్రగత్తెను కలిశారు. కాగా, అన్నదమ్ముల కుటుంబాల్లో కలతలకు నష్టజాతకులైన తల్లి, సోదరిలే కారణమని ఆమె చెప్పింది. వారిద్దరినీ బలిస్తే సదరు అన్నదమ్ముల కుటుంబాలకు కలిసి వస్తుందని నమ్మబలికింది. ఆమె మాటలను విశ్వసించిన అన్నదమ్ములిద్దరూ దీపావళి పండుగ సమయంలో తల్లి బుధిబాయి, సోదరి రాహిబాయిని మంత్రగత్తె దగ్గరకు వెంటతీసుకువెళ్లారు. అక్కడ మంత్రగత్తె అనుచరులు మహిళలిద్దరినీ పూజ చేయాలని చెప్పి, నగ్నంగా చేసి హింసించారు. అనంతరం బలి ఇచ్చేందుకు వారిని సిద్ధం చేశారు. అయితే అదునుచూసుకుని రాహిబాయి తప్పించుకున్నప్పటికీ , తల్లి బుధిబాయి మాత్రం వారి చేతిలో బలయిపోయింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న ‘శ్రమజీవి సంఘటన’ వాస్తవాలను బయటపెట్టేందుకు కృషిచేసింది. అయితే మంత్రగత్తె తన మంత్రశక్తులతో తమను ఏం చేస్తుందోననే భయంతో గ్రామస్తులెవరూ ఆమె గురించి మాట్లాడేందుకు ముందుకు రాలేదు. అయితే ఎంతో కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత రాహిబాయి పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఒప్పుకోవడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మంగళవారం ఉదయం పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పదిమందిని అరెస్టు చేశారు. వీరిలో నిందితులు కాశినాథ్, గోవింద్‌తోపాటు మంత్రగత్తె బచ్చుబాయి, ఆమె అనుచరులుగా భావిస్తున్న ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బుధిబాయితో పాటు కాశిబాయి అనే మహిళను కూడా బలిఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రగత్తె బచ్చుబాయి మాట్లాడుతూ.. ఏడుగురు వ్యక్తులను బలిస్తే తనకు అతీంద్రియ శక్తులు పొందుతాననే నమ్మకంతో ఇప్పటికి ఇద్దరిని బలిచ్చానని తెలిపింది. కాగా, వారు ఇచ్చిన సమాచారం మేరకు మహిళలను బలిచ్చిన ప్రదేశంలో మృతదేహాలను బయటికి తీశామని, పోస్ట్‌మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఏపీఐ మనోరే తెలిపారు. -
గోవింద్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
మర్డర్ కేసులో ప్రధాన కుట్రదారుపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న పోలీసులు విజయవాడ సిటీ : జిల్లాలోని ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన గంధం నాగేశ్వరరావు, ఆయన కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్య హత్య కేసులో ప్రధాన కుట్రదారుడైన భూతం గోవింద్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశాల్లో తలదాచుకున్న గోవింద్‌ను రప్పించేందుకు ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గోవింద్ ఆచూకీ కోసం ‘రెడ్‌కార్నర్’ నోటీసు జారీ చేసి విదేశీ మీడియా ద్వారా ఫొటోలను విస్తృత ప్రచారం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, పగిడి మారయ్య, గుంజుడు మారయ్య గత నెల 24న ఏలూరు కోర్టు వాయిదాకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనంలో వెళుతుండగా పెదఅవుటుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కిరాయి హంతకులు కాల్చి చంపారు. ఈ ఘటనపై నమోదైన కేసులో 20 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏడుగురు సభ్యుల ఢిల్లీ గ్యాంగ్ సహా 10 మందిని అరెస్టు చేశారు. మరో 10మందిని అరెస్టు చేయాల్సి ఉంది. వీరిలో భూతం గోవింద్‌ను ప్రధాన కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. తన సోదరుడు భూతం దుర్గారావు హత్య కేసులో నిందితులను చంపాలని గోవింద్ నిర్ణయించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం విదేశంలోనే కుట్ర రూపొందించాడని వారు పేర్కొంటున్నారు. అక్కడి నుంచి తన అనుచరుల ద్వారా ఢిల్లీ కిల్లర్ గ్యాంగ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుని హత్యలు చేయించినట్లు వారు నిర్ధారించుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా గోవిందు పాత్ర కీలకమని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న గోవింద్‌ను రప్పించేందుకు సీఐడీ విభాగం ద్వారా సీబీఐకి లేఖ రాయనున్నారు. తద్వారా సీబీఐ వర్గాలు ఇంటర్‌పోల్ సాయంతో నిందితున్ని విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు చేపడతాయి. విదేశాల్లో సాధారణ జీవితం గడుపుతున్న గోవింద్‌ను పట్టుకోవడం ఇంటర్‌పోల్‌కు అసాధ్యమేమీ కాదు. అతడిని దేశానికి రప్పించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంటర్‌పోల్ సాయంతో త్వరలోనే పట్టుకుంటామని వారు చెబుతున్నారు. -
ప్రియమణి ప్రియుడు ఆయనేనా?
నటి ప్రియమణి ప్రేమలో జోగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆమె అంతగా వలచిన ప్రియుడెవరన్న రహస్యం మాత్రం కోలీవుడ్ చెవులను తొలిచేస్తోంది. కోలీవుడ్‌లో పరుత్తివీరన్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ప్రియ తొలి చిత్రంతోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకున్నారు. ఆ తరువాత గ్లామర్‌కు మారి ఆపై తమిళ చిత్రాలకే దూరం అయ్యారు. అయితే తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో పలు చిత్రాలు చేశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో సింగిల్ సాంగ్ చేసి బాలీవుడ్ కూడా చుట్టొచ్చాననిపించుకున్న ప్రియమణి దృష్టి పెళ్లిపై పడినట్లు ఉంది. ప్రస్తుతం ప్రియుడితో ప్రేమలో మునిగి తెలుతున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. తన రహస్య ప్రియుడితో తరచు చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతున్నట్లు వదంతులు ప్రచారం అవుతున్నాయి. అయితే ప్రియమణి మాత్రం ఈ విషయంలో తనకు దాపరికం ఏమీ లేదు. ఏమీ మరచాలనుకోవడంలేదు. సమయం వచ్చినప్పుడు స్పష్టంగా వెల్లడించేస్తాను అని చెబుతూ పోతున్నారు. ఇటీవల శాండిల్‌వుడ్ నటుడు గోవింద్, ప్రియమణితోసన్నిహితంగా తిరిగిన ఫొటోగ్రాఫ్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి కలకలం పుట్టించారు. అంతేకాదు ప్రియమణితో దిగిన ఫొటోలు చాలా విలువయినవని, ఇలా పలు మార్లు ఆమెతో ఫొటోలు తీసుకుని పదిలపరచుకుంటున్నా అని పేర్కొన్నారు. దీంతో ప్రియమణి రహస్య ప్రియుడీయనేనా? అంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ముందు అలాంటిదేమి లేదంటూ ఆ తరువాత ఔను మేము ప్రేమించుకుంటున్నాం అనడం మన హీరోయిన్లకు అలవాటే కదా. మరి ఈ జంట అలా అనే రోజు ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.