సత్తా చాటిన గోవింద్‌ | Govind shines in ICSE School Games | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన గోవింద్‌

Published Mon, Jul 30 2018 10:16 AM | Last Updated on Mon, Jul 30 2018 10:16 AM

Govind shines in ICSE School Games - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐసీఎస్‌ఈ స్కూల్‌ గేమ్స్‌ టెన్నిస్‌ ఎంపిక పోటీల్లో ఎస్‌. యశస్వీ సాయి గోవింద్‌ సత్తా చాటాడు. హబ్సిగూడలోని జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ ఆర్‌ఆర్‌సీ మైదానంలో నిర్వహించిన ఈ సెలక్షన్స్‌లో సరోజిని అకాడమీ విద్యార్థి సాయి గోవింద్‌ 6–0తో అదిత్‌పై, 6–1తో ధీరజ్‌పై, 6–4తో కృష్ణ సంతోష్‌పై విజయం సాధించాడు. వచ్చే నెల గుంటూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో గోవింద్‌ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా గోవింద్‌ను సరోజిని అకాడమీ కార్యదర్శి కిరణ్‌ అభినందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement