ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పాతపాడు సమీపంలో ఒంగోలు-గిద్దలూరు రహదారిపై సోమవారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పాతపాడు నుంచి చిరుపల్లి గోవింద్ (18), కిట్టయ్య బైక్‌పై వెళుతుండగా...ఇంకో బైక్‌పై శివనరేంద్ర వర్మ(20) ఎదురుగా వచ్చి ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో గోవింద్, శివనరేంద్ర వర్మలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారు మృతి చెందారు.
శివనరేంద్ర వర్మది విశాఖ గాజువాక ప్రాంతం కాగా కంభంలో కెనాల్ పనుల్లో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మరో ఘటనలో ఇదే రహదారిలో బచ్చలకూరపాడు వద్ద రెండు బైక్‌లు ఢీకొనగా నలుగురికి గాయాలు అయ్యాయి. కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావుతోపాటు మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండు బైక్‌లు ఢీ... ఇద్దరి మృతి
Published Mon, Apr 11 2016 6:10 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM
Advertisement
Advertisement