ప్రియమణి ప్రియుడు ఆయనేనా? | Who is Priyamani's lover? | Sakshi
Sakshi News home page

ప్రియమణి ప్రియుడు ఆయనేనా?

Published Sun, Jun 29 2014 11:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రియమణి ప్రియుడు ఆయనేనా? - Sakshi

ప్రియమణి ప్రియుడు ఆయనేనా?

 నటి ప్రియమణి ప్రేమలో జోగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆమె అంతగా వలచిన ప్రియుడెవరన్న రహస్యం మాత్రం కోలీవుడ్ చెవులను తొలిచేస్తోంది. కోలీవుడ్‌లో పరుత్తివీరన్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ప్రియ తొలి చిత్రంతోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకున్నారు. ఆ తరువాత గ్లామర్‌కు మారి ఆపై తమిళ చిత్రాలకే దూరం అయ్యారు. అయితే తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో పలు చిత్రాలు చేశారు.
 
 చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో సింగిల్ సాంగ్ చేసి బాలీవుడ్ కూడా చుట్టొచ్చాననిపించుకున్న ప్రియమణి దృష్టి పెళ్లిపై పడినట్లు ఉంది. ప్రస్తుతం ప్రియుడితో ప్రేమలో మునిగి తెలుతున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. తన రహస్య ప్రియుడితో తరచు చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతున్నట్లు వదంతులు ప్రచారం అవుతున్నాయి. అయితే ప్రియమణి మాత్రం ఈ విషయంలో తనకు దాపరికం ఏమీ లేదు. ఏమీ మరచాలనుకోవడంలేదు. సమయం వచ్చినప్పుడు స్పష్టంగా వెల్లడించేస్తాను అని చెబుతూ పోతున్నారు.
 
 ఇటీవల శాండిల్‌వుడ్ నటుడు గోవింద్, ప్రియమణితోసన్నిహితంగా తిరిగిన ఫొటోగ్రాఫ్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కలకలం పుట్టించారు. అంతేకాదు ప్రియమణితో దిగిన ఫొటోలు చాలా విలువయినవని, ఇలా పలు మార్లు ఆమెతో ఫొటోలు తీసుకుని పదిలపరచుకుంటున్నా అని పేర్కొన్నారు. దీంతో ప్రియమణి రహస్య ప్రియుడీయనేనా? అంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ముందు అలాంటిదేమి లేదంటూ ఆ తరువాత ఔను మేము ప్రేమించుకుంటున్నాం అనడం మన హీరోయిన్లకు అలవాటే కదా. మరి ఈ జంట అలా అనే రోజు ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement