వరికోత యంత్రానికి విద్యుత్ తీగలు తాకిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి గోవింద్(24) వరికోత యంత్రం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు పొలం కోస్తున్న క్రమంలో పైన ఉన్న హైటెన్షన్ తీగలకు వాహనం తాకడంతో.. విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుధ్ఘాతానికి వ్యక్తి బలి
Published Mon, Apr 4 2016 12:27 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement