ప్రేమకు వయసుతో పని లేదు, దానికి ఎటువంటి పరిమితులు ఉండవు అని చెప్తోంది నటి శివంగి వర్మ. సీనియర్ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ జోడించింది. ఇంకేముంది, 71 ఏళ్ల నటుడు 31 ఏళ్ల నటితో ప్రేమలో పడ్డాడంటూ ప్రచారం జోరందుకుంది.
అవును, ప్రేమించుకుంటున్నాం
తాజాగా ఈ పుకారుపై గోవింద్ నామ్‌దేవ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. అవును, ప్రేమించుకుంటున్నాం. కాకపోతే నిజ జీవితంలో కాదు, రీల్ లైఫ్‌లో! మేమిద్దం గౌరీశంకర్ గోహర్‌గంజ్ వాలే సినిమా చేస్తున్నాం. ఇండోర్‌లో షూటింగ్ జరిగింది. ఓ ముసలి వ్యక్తి యంగ్ లేడీతో ప్రేమలో పడతాడు.. అదే సినిమా కథ!
అది నా లైఫ్‌లో జరగదు
నా వ్యక్తిగత విషయానికి వస్తే.. మరో అమ్మాయితో ప్రేమలో పడటమనేది జీవితంలో జరగదు. ఎందుకంటే నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తనే నా ఊపిరి. ఈ జన్మకు తను చాలు. ఆమె ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. ఆమె కోసం దేవుడితోనైనా యుద్ధం చేస్తా.. అని చెప్పుకొచ్చాడు. కాగా గోవింద్ నామ్‌దేవ్.. 1991లో సౌధాగర్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్!
Comments
Please login to add a commentAdd a comment