ఎల్లారెడ్డిపేట మండలం వీరన్నపల్లిలో గోవిందు అనే వ్యక్తిపై ఈ రోజు తెల్లవారుజామున ఆగంతకులు గొడ్డల్లతో దాడి చేశారు. ఆ ఘటనలో గోవిందు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి గోవిందును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే గోవిందుడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.