
యశవంతపుర: కావేరి జలా వివాదాలకు సంబంధించి కర్ణాటకకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్న తమిళ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలను నిషేధించాలని కన్నడ సంఘల నాయకులు తీర్మానించారు. బుధవారం కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు బెంగళూరులో ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలను స్థాపించిన కమల్, రజనీలు తమిళనాడుకు మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారన్నారు. అయితే కన్నడిగుడైన రజనీకాంత్ కర్ణాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం మంచిదికాదన్నారు. ఆ ఇద్దరు నటులు నటించిన సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు సారా గోవిందు పేర్కొన్నారు. ఇప్పుటికే కన్నడ చళవళి వాటాల్ నాగరాజు వీరిద్దరి సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేసిన్నట్లు గోవిందు గుర్తు చేశారు.