వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్ష | IS militants stone woman to death for adultery | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్ష

Published Tue, Oct 21 2014 5:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్ష

వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్ష

బీరుట్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళకు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సన్నీ రాడికల్ గ్రూపు ఉగ్రవాదులు మరణశిక్ష విధించారు. రాళ్లతో కొట్టి చంపాల్సిందిగా హుకుం జారీ చేశారు. కన్న తండ్రి అంగీకారంతో అతని కళ్లేదుటే ఆమెను చంపేశారు. ఈ దుశ్చర్యను చిత్రీకరించి వీడియోను విడుదల చేశారు. ఈ ఆటవిక చర్యను సిరియాలో అమలు చేశారు.

బాధితురాలు క్షమించాల్సిందిగా తన తండ్రిని వేడుకొనగా, ఆయన నిరాకరించాడు. సెంట్రల్ సిరియా ప్రావిన్స్లో వివాహేతర సంబంధం కారణంగా తొలిసారి ఓ మహిళకు మరణశిక్ష విధిస్తున్నట్టు ఐఎస్ ఉగ్రవాద నాయకుడు ప్రకటించాడు. ఆమె చనిపోయేవరకు రాళ్లతో కొట్టాల్సిందిగా ఆదేశించాడు.  అక్కడ గుమికూడిన జనం అందరూ చూస్తుండగా ఆమెను రాళ్లతో కొట్టారు. కాగా ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అన్న విషయం నిర్ధారణ కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement