బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. సెప్టెంబరు 16న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో మహాసముంద్‌లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతోంది. రాళ్ల దాడిలో సీ2-10, సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. బాగ్‌బహ్రా రైల్వే స్టేషన్‌లో ఈ రాళ్ల దాడి జరిగింది.
ఈ దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బాగ్‌బహ్రాకు చెందినవారు. వీరిపై పోలీసులు రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేశారు. 16 నుంచి నడవనున్న వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ జరుగుతుండగా, రాళ్ల దాడి చోటుచేసుకున్నదని ఆర్‌పీఎఫ్ అధికారి పర్వీన్ సింగ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు.
ఇది కూడా చదవండి: పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య
Comments
Please login to add a commentAdd a comment