pelt stones
-
వందేభారత్‌పై రాళ్ల దాడి.. ఐదుగురు నిందితుల అరెస్ట్
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. సెప్టెంబరు 16న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో మహాసముంద్లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతోంది. రాళ్ల దాడిలో సీ2-10, సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. బాగ్బహ్రా రైల్వే స్టేషన్లో ఈ రాళ్ల దాడి జరిగింది.ఈ దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బాగ్బహ్రాకు చెందినవారు. వీరిపై పోలీసులు రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేశారు. 16 నుంచి నడవనున్న వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ జరుగుతుండగా, రాళ్ల దాడి చోటుచేసుకున్నదని ఆర్పీఎఫ్ అధికారి పర్వీన్ సింగ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు. ఇది కూడా చదవండి: పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య -
24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే
ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ గడ్డపై 24 సంవత్సరాల తర్వాత పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 1998లో చివరిసారిగా పర్యటించిన ఆసీస్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పాక్ గడ్డపై మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20లు ఆడేందుకు వచ్చింది. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తవ్వగా.. సోమవారం నుంచి చివరి టెస్టు జరగనుంది. ఇక విషయంలోకి వెళితే.. పాకిస్తాన్ ఆటగాళ్లలాగే అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ అనిశ్చితికి మారుపేరు. ఆటగాళ్ల వైఖరి నచ్చలేదో సొంత దేశ క్రికెట్ర్ అని చూడకుండా దుమ్మెత్తిపోస్తారు. అంతేకాదు వారి ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. తాజాగా ఒక ఆస్ట్రేలియన్ అభిమానితో సెల్ఫీ కోసం పాక్ అభిమానులు ఎగబడుతున్నారు. అతనే ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ వీరాభిమాని లూక్ గిల్లియన్. ఇదే ఆస్ట్రేలియన్ అభిమానిపై 24 ఏళ్ల క్రితం పాక్‌కు చెందిన కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు.. మా దేశం నుంచి వెళ్లిపో అంటూ అరిచారు. ఇప్పుడు మాత్రం నాతో ఫోటోలు దిగేందుకు ఇష్టపడుతున్నారని గిల్లియన్ పేర్కొన్నాడు. ''1998లో ఆస్ట్రేలియా పాక్ పర్యటనకు వచ్చినప్పుడు ఒక అభిమానిగా అక్కడికి వెళ్లాను. అప్పటి పరిస్థితులు దారుణంగా ఉండేవి. బయటికి వెళ్లాలంటేనే భయపడేవాళ్లం. అయినా ధైర్యం తెచ్చుకొని బయటికి వెళ్లాను. అప్పటికే రోడ్లపై గుంపులుగా తిరుగుతూ అడ్డు వచ్చిన వాళ్లపై రాళ్లు రువ్వుతున్నారు. అలా నాపై కూడా రాళ్ల వర్షం కురిపించారు. ఇక లాభం లేదనుకొని వెంటనే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాను. ఆ తర్వాత మళ్లీ పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అయితే 24 ఏళ్ల తర్వాత మళ్లీ మా జట్టు పాక్ పర్యటనకు వెళుతుందని తెలుసుకున్నా. ఇప్పుడు వెళ్తే చంపేస్తారేమో అని మొదట వద్దనుకున్నా. కానీ ఆటపై నాకున్న అభిమానం పాక్ గడ్డపై అడుగుపెట్టేలా చేసింది. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు మునుపటిలా లేవు. రావల్పిండిలో దిగగానే నాకు పాక్ అభిమానుల నుంచి మంచి స్వాగతం లభించింది. ఎవరైతే నాపై రాళ్లు రువ్వారో వాళ్లే నాతో ఫోటోలు దిగుతూ క్షమాపణ కోరారు. అలా ఐదు రోజుల పాటు నాతో 500 మంది ఫోటోలు దిగేవారు.. ఇది నాకు చాలా సంతోషంగా అనిపించేది. అంతేకాదు వారితో కలిసి కప్పు టీలు ఎన్నిసార్లు తాగానో గుర్తులేదు. ఇక లెక్కలేనన్ని కేక్‌లు.. పెప్సీ బాటిళ్లు, ఫ్రీ హెయిర్‌కట్, ఫ్రీ లాండ్రీ వెరసి వారి అభిమానానికి ఫిదా అయిపోయా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ravichanran Ashwin: ‘‘రెండో ఆలోచన వద్దు.. రనౌట్ చేసేయండి’ ’ PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
అంబులెన్స్ ధ్వంసం.. సిబ్బందిపై రాళ్లదాడి
బెంగుళూరు: కరోనా బారినపడ్డ 15 మందిని ఆస్పత్రికి తీసుకె్ళ్లడానికి వచ్చిన వైద్య సిబ్బందిపై గ్రామస్థులు రాళ్లు రువ్వారు. ఈ సంఘటన కర్ణాటకలోని కమలాపూర్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కొందరు వలస కూలీలు ఇటీవల ముంబై నుంచి గ్రామానికి చేరుకున్నారు. కరోనా పరీక్షలో కొందరికి పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వారిని ఆసుపత్రికి తరలించడానికి వెళ్లిన మెడికల్ సిబ్బందిపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ‘మాలో ఎవరికీ కరోనా సోకలేదు వెళ్లిపోండి’ అంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వైద్య సిబ్బందిపై దాడిచేశారు. అంబులెన్సుపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. (కేంద్రం, ఐఆర్‌డీఏలకు సుప్రీం నోటీసులు ) ఈ ఘటన హింసాత్మకంగా మారడంతో అక్కడికి వచ్చిన పోలీసు వాహనాలపై సైతం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో సమాచారం అందుకున్నఅధికారులు బాధ్యులపై కేసు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 10,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 380 మంది మరణించారు. కరోనాను జయించి ఇప్పటివరకు 1,80,013 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 1,53,178 యాక్టివ్ కేసులు నమోదయైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. (డ్రాగన్ కవ్వింపు చర్యలు : ముగ్గురు సైనికులు మృతి ) -
వైద్య సిబ్బందిపై గ్రామస్థుల దాడి
యశవంతపుర: కలబురిగి జిల్లా కమలాపుర తాలూకా మరమంచి గ్రామంలో సోమవారం కరోనా సోకిన వ్యక్తులను ఆస్పత్రికి తీసుకెళ్లటానికి వెళ్లిన ఆశా కార్యకర్తల వాహనంపై గ్రామస్థులు రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వసం చేశారు. మరమంచి తాండాలో 15 మందికి కరోనా లక్షణాలు పాజిటివ్‌గా వచ్చాయి. వీరందరూ ముంబై నుంచి వచ్చినవారుగా గుర్తించి ఆస్పత్రికి తరలించటానికి తాండాకు అధికారులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌తో కలిసి వెళ్లారు. ఎవరెవరు ముంబై నుంచి వచ్చారో వివరాలను సేకరిస్తూ ఊరులో తిరిగారు. (పోలీస్ స్టేషన్లో పేకాట..!) అందరూ ఆస్పత్రికి వెళ్లి క్వారంటైన్లో ఉండాలను సూచించారు. అయితే తమలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అనవసరంగా తీసుకేళ్తారా అని బాధితుల బంధువులు గొడవకు దిగారు. ముంబై నుండి వచ్చినవారు అంబులెన్స్‌లో ఎక్కాలని వైద్యులు డిమాండ్ చేశారు. తమవారికి కరోనా లేదని గ్రామస్తులు మొండికేశారు. చివరకు కోపం పట్టలేక అంబులెన్స్‌తో పాటు వైద్యులు, పోలీసుల వాహనాలపై రాళ్లు విసిరారు. రాళ్ల దాడిని తట్టుకోలేక అధికారులు తలోదిక్కుకు పరుగులు తీశారు. వాహనాలపై రాళ్లు విసరడంతో అద్దాలు పగిలాయి. గ్రామంలో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. (చెన్నైలో మళ్లీ లాక్డౌన్) పోలీసులే కొట్టారు పోలీసులే తమపై దాడి చేసి దౌర్జన్యాలకు పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు. పోలీసులు తమను కొట్టడంతో కాలు, వీపుపై గాయాలైన చిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం అదనపు ఎస్పీ ప్రసన్న దేశాయి, సీఐ రాఘవేంద్ర భజంత్రి, తహశీల్దార్ అంజుమ్ తబసుమ్‌లు తాండాలో పర్యటించి గ్రామస్థులకు కరోనాపై వివరించి శాంతపరిచారు. ముంబై నుండి వచ్చినవారు క్వారంటైన్‌కు వెళ్లకంటే ప్రమాదం తలెత్తుతుందని చాటింపు వేయించారు. (వర్క్ ఫ్రం హోంకే జై!) -
కేంద్రమంత్రి కారుపై రాళ్లదాడి
భువనేశ్వర్: ఒడిశాలో కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రయాణిస్తున్న కారుపై బీజేడీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కేంద్ర మంత్రి స్వల్పంగా గాయపడ్డారు. శుక్రవారం ఒడిశాలోని బర్గాఢ్లో ఈ దాడి జరిగింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనను పురస్కరించుకుని బీజేపీ నేతలు ఈ రోజు వికాస్ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్‌ను ఆహ్వానించారు. కాగా కేంద్ర మంత్రి రాకను నిరసిస్తూ బర్గాఢ్ జిల్లా బీజేడీ కార్యకర్తలు గురువారం మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. కేంద్రమంత్రిని బర్గాఢ్కు రాకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. ఈ రోజు బర్గాడ్కు వచ్చిన కేంద్రమంత్రి కారుపై బీజేడీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు.