కేంద్రమంత్రి కారుపై రాళ్లదాడి | BJD workers allegedly pelt stones at Union Textile Minister Santosh Gangwar's car | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి కారుపై రాళ్లదాడి

Published Fri, Jun 24 2016 4:18 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

కేంద్రమంత్రి కారుపై రాళ్లదాడి

కేంద్రమంత్రి కారుపై రాళ్లదాడి

భువనేశ్వర్: ఒడిశాలో కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రయాణిస్తున్న కారుపై బీజేడీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కేంద్ర మంత్రి స్వల్పంగా గాయపడ్డారు. శుక్రవారం ఒడిశాలోని బర్గాఢ్లో ఈ దాడి జరిగింది.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనను పురస్కరించుకుని బీజేపీ నేతలు ఈ రోజు వికాస్ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ను ఆహ్వానించారు. కాగా కేంద్ర మంత్రి రాకను నిరసిస్తూ బర్గాఢ్ జిల్లా బీజేడీ కార్యకర్తలు గురువారం మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. కేంద్రమంత్రిని బర్గాఢ్కు రాకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. ఈ రోజు బర్గాడ్కు వచ్చిన కేంద్రమంత్రి కారుపై బీజేడీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement