బెంగుళూరు: కరోనా బారినపడ్డ 15 మందిని ఆస్పత్రికి తీసుకె్ళ్లడానికి వచ్చిన వైద్య సిబ్బందిపై గ్రామస్థులు రాళ్లు రువ్వారు. ఈ సంఘటన కర్ణాటకలోని కమలాపూర్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కొందరు వలస కూలీలు ఇటీవల ముంబై నుంచి గ్రామానికి చేరుకున్నారు. కరోనా పరీక్షలో కొందరికి పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వారిని ఆసుపత్రికి తరలించడానికి వెళ్లిన మెడికల్ సిబ్బందిపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ‘మాలో ఎవరికీ కరోనా సోకలేదు వెళ్లిపోండి’ అంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వైద్య సిబ్బందిపై దాడిచేశారు. అంబులెన్సుపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. (కేంద్రం, ఐఆర్‌డీఏలకు సుప్రీం నోటీసులు )
ఈ ఘటన హింసాత్మకంగా మారడంతో అక్కడికి వచ్చిన పోలీసు వాహనాలపై సైతం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో సమాచారం అందుకున్నఅధికారులు బాధ్యులపై కేసు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 10,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 380 మంది మరణించారు. కరోనాను జయించి ఇప్పటివరకు 1,80,013 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 1,53,178 యాక్టివ్ కేసులు నమోదయైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. (డ్రాగన్ కవ్వింపు చర్యలు : ముగ్గురు సైనికులు మృతి )
Comments
Please login to add a commentAdd a comment