ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ గడ్డపై 24 సంవత్సరాల తర్వాత పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 1998లో చివరిసారిగా పర్యటించిన ఆసీస్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పాక్ గడ్డపై మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20లు ఆడేందుకు వచ్చింది. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తవ్వగా.. సోమవారం నుంచి చివరి టెస్టు జరగనుంది.
ఇక విషయంలోకి వెళితే.. పాకిస్తాన్ ఆటగాళ్లలాగే అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ అనిశ్చితికి మారుపేరు. ఆటగాళ్ల వైఖరి నచ్చలేదో సొంత దేశ క్రికెట్‌ర్ అని చూడకుండా దుమ్మెత్తిపోస్తారు. అంతేకాదు వారి ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. తాజాగా ఒక ఆస్ట్రేలియన్ అభిమానితో సెల్ఫీ కోసం పాక్ అభిమానులు ఎగబడుతున్నారు. అతనే ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ వీరాభిమాని లూక్ గిల్లియన్.
ఇదే ఆస్ట్రేలియన్ అభిమానిపై 24 ఏళ్ల క్రితం పాక్‌కు చెందిన కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు.. మా దేశం నుంచి వెళ్లిపో అంటూ అరిచారు. ఇప్పుడు మాత్రం నాతో ఫోటోలు దిగేందుకు ఇష్టపడుతున్నారని గిల్లియన్ పేర్కొన్నాడు. ''1998లో ఆస్ట్రేలియా పాక్ పర్యటనకు వచ్చినప్పుడు ఒక అభిమానిగా అక్కడికి వెళ్లాను. అప్పటి పరిస్థితులు దారుణంగా ఉండేవి. బయటికి వెళ్లాలంటేనే భయపడేవాళ్లం. అయినా ధైర్యం తెచ్చుకొని బయటికి వెళ్లాను. అప్పటికే రోడ్లపై గుంపులుగా తిరుగుతూ అడ్డు వచ్చిన వాళ్లపై రాళ్లు రువ్వుతున్నారు. అలా నాపై కూడా రాళ్ల వర్షం కురిపించారు. ఇక లాభం లేదనుకొని వెంటనే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాను.
ఆ తర్వాత మళ్లీ పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అయితే 24 ఏళ్ల తర్వాత మళ్లీ మా జట్టు పాక్ పర్యటనకు వెళుతుందని తెలుసుకున్నా. ఇప్పుడు వెళ్తే చంపేస్తారేమో అని మొదట వద్దనుకున్నా. కానీ ఆటపై నాకున్న అభిమానం పాక్ గడ్డపై అడుగుపెట్టేలా చేసింది. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు మునుపటిలా లేవు. రావల్పిండిలో దిగగానే నాకు పాక్ అభిమానుల నుంచి మంచి స్వాగతం లభించింది. ఎవరైతే నాపై రాళ్లు రువ్వారో వాళ్లే నాతో ఫోటోలు దిగుతూ క్షమాపణ కోరారు. అలా ఐదు రోజుల పాటు నాతో 500 మంది ఫోటోలు దిగేవారు.. ఇది నాకు చాలా సంతోషంగా అనిపించేది. అంతేకాదు వారితో కలిసి కప్పు టీలు ఎన్నిసార్లు తాగానో గుర్తులేదు. ఇక లెక్కలేనన్ని కేక్‌లు.. పెప్సీ బాటిళ్లు, ఫ్రీ హెయిర్‌కట్, ఫ్రీ లాండ్రీ వెరసి వారి అభిమానానికి ఫిదా అయిపోయా'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: Ravichanran Ashwin: ‘‘రెండో ఆలోచన వద్దు.. రనౌట్ చేసేయండి’ ’
PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్
Comments
Please login to add a commentAdd a comment