
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడోటెస్టు ఆసక్తికరంగా మారింది. 351 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మొదట్లో దాటిగా ఆడినప్పటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో కాస్త నెమ్మదిగా ఆడుతోంది. టీ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మరి ఆస్ట్రేలియా గెలవాలంటే మరో 5 వికెట్లు అవసరం ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండడంతో చివరి సెషన్ ఆటకు కీలకం. మరి పాకిస్తాన్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంటుందో లేదో చూడాలి.
ఈ విషయం పక్కనబెడితే.. పాకిస్తాన్ బ్యాటర్ అజహర్ అలీ ఔటైన తీరు వైరల్‌గా మారింది. కనిపించి కనిపించకుండా.. కనబడిన చిన్న స్పైక్ అతని ఔట్‌కు కారణమైంది. పాపం తాను ఔటయ్యానని నమ్మలేక అజహర్ చాలాసేపు షాక్‌లో ఉండిపోయాడు. ఇన్నింగ్స్ 46వ ఓవర్‌ను నాథన్ లియాన్ వేశాడు. ఓవర్ రెండో బంతిని అజహర్ అలీ డిఫెన్స్ ఆడాడు. అయితే బంతి స్లిప్‌లో ఉన్న స్మిత్ చేతిలో పడింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంపైర్‌కు అప్పీల్ చేయగా.. అతని నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.
దీంతో స్మిత్ కాన్ఫిడెంట్‌గా ఉండడంతో కమిన్స్ డీఆర్‌ఎస్‌కె వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో మొదట ఎక్కడ బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించలేదు. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలినట్లు చిన్న స్పైక్ కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. అంతే క్రీజులో ఉన్న అజహర్ లేదు.. నేను ఔట్ కాదు అంటూ తల అడ్డంగా ఊపాడు. కానీ థర్డ్‌అంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. వెళ్తూ వెళ్తూ.. చేతులు పైకెత్తి ఏంటో ఇది అనుకుంటూ వెళ్లడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియోను పీసీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
చదవండి: ENG vs WI: చరిత్రలో రెండోసారి మాత్రమే.. 145 ఏళ్ల రికార్డు బద్దలు
PAK VS AUS 3rd Test: తిప్పేసిన లియోన్.. పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన ఆసీస్
Mood ... pic.twitter.com/NXbUioRrbO
— Taimoor Zaman (@taimoorze) March 25, 2022