ప్రతీకాత్మక చిత్రం
కర్ణాటక (శివాజీనగర) : భార్య శీలాన్ని శంకించి హత్య చేసిన భర్త ఉదంతం హెచ్‌ఏఎల్ కాళప్ప లేఔట్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. రాయచూరుకు చెందిన నీలకంఠ, నాగమ్మ దంపతులకు ఇద్దరు బాలికలు ఉన్నారు. నీలకంఠ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. భార్య కూడా ఇంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేది. భార్య శీలాన్ని శంకించిన నీలకంఠ తరచూ గొడవపడేవాడు. సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో విడాకులు తీసుకోవాలని భార్య సూచించింది. ఆవేశానికి గురైన నీలకంఠ బెల్ట్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment