ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: స్నానం చేసిన తరువాత అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణం బాలాఘాట్ జిల్లా కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపుర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన ఉద్యోగి రాజ్‌కుమార్ బాహే శనివారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత. భార్య పుష్పా బాయ్ (45)ను టవల్ అడిగాడు.
చదవండి: స్నేహితుడి భార్యపై కన్నేసిన దుర్మార్గుడు.. అత్యాచారం, వీడియోలు తీసి!
అయితే ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని తువ్వాలు కోసం కాసేపు ఆగాలని భార్య చెప్పింది. ఆ సమయంలో ఆమె వంట పాత్రలు శుభ్రం చేస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై అక్కడే ఉన్న పారతో పదే పదే కొట్టాడని కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. భర్త దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది.
చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. కూతురుపై తల్లి ప్రియుడు లైంగిక దాడి..
కాగా తండ్రి ఘాతుకాన్ని 23 ఏళ్ల కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను కూడా అడ్డొస్తే చంపేస్తాడని ఆమెను కూడా ఆ రాక్షసుడు బెదిరించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment