Towel
-
ఇదేం స్టయిలిష్ కాస్ట్యూమ్! కానీ ధర వింటే షాకవ్వడం ఖాయం!
చాలా విభన్నమైన స్టయిలిష్ కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేస్తుంటారు డిజైనర్లు. ఒక్కొక్కరిది ఒక్కో తరహా స్టయిల్. వెస్ట్రన్ స్టయిల్ కొందరూ దేశీ సంస్కృతిని మిళితం చేసేలా ఇంకొకరు ఎంచుకుని మరి కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్‌ని తయారు చేస్తారు. వాటి ధరలు కూడా ఎక్కువే. ప్రముఖ సెలబ్రెటీలకు మంచి బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ అందించేది వారే. రాను రాను ఎలా డిజైన చేయాలో తెలియాక ఒక్కొసారి ఇలా పిచ్చిగా డిజైన్ చేస్తారో లేక ఏం తోచక ఇలా చేస్తారో గానీ ఇదే వెర్రీ అనిపించేలా ఉంటాయి ఆ కాస్ట్యూమ్‌లు. అది కూడా మంచి పేరుగాంచిన ఓ ప్రముఖ కంపెనీ యే ఇలాంటి డిజైన్ని తీసుకొస్తే..ఛీ ఏంటీ ఇవి కూడా ఇలా దిగజారిపోతున్నాయా? లేక బ్రాండ్ పడిపోయిందా? అనిపిస్తాయి. అలాంటి పిచ్చి కాస్ట్యూమ్‌నే ఓ ప్రముఖ కంపెనీ విడుదల చేసి అందర్నీ కంగుతినేలా చేసింది. వివరాల్లోకెళ్తే..ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ బాలెన్సియగా ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ అత్యంత వెరైటీగా ఓ టవల్ స్కర్ట్ డిజైన్వేర్ని పరిచయం చేసింది. అది మన ఇళ్లలోని పెద్ద చిన్న మగవాళ్లంతా ప్రతి రోజు కనిపించే తీరు తరహా స్టయిలే అది. అది ఎవర్నీ ఆకర్షించకపోగా దాని ధర చూసి ఒక్కసారిగా భగ్గమంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈ టవల్ స్కర్ట్ డిజైన్ వేర్ ఏంటంటే ఏం లేదు జస్ట్ ఫ్యాంట్‌పై టవల్ కట్టుకునేలా స్టయిల్. నిజానికి ఇది స్టయిల్ కాదు. మన ఇంట్లో మగవాళ్లు ఫ్యాంటు తీసే ముందు ఇదే తరహాలో టవల్ చుట్టుకుని ఉంటారు. దీన్నే గ్రేట్ డిజైన్ అంటూ విడుదల చేయడం ఒక ఎత్తు అయితే, ధర ఏకంగా రూ 76,000 వేలు అని ప్రకటించడం మరింత విడ్డూరం. దీంతో ప్రముఖ గృహోపకరణాల కంపెనీ ఐకియా ఈ డిజైన్‌కి అయ్యే ఖర్చు జస్ట్ రూ. 1700/- కంటే ఎక్కవ అవ్వదంటూ అందుకు సంబంధించిన సేమ్ మోడల్ని నెట్టింట షేర్ చేసింది. పలువులురు నెటిజన్లు కూడా ఐకియాకు మద్దతు ఇస్తూ అవును అంతకంటే ఎక్కువ ధరేమి ఉండదు. పోనీ ఆ టవల్ జస్ట్ కాటన్ టర్కీ టవల్. దాని ధర కూడా అంత ఉండదు. కానీ ఏకంగా ఫ్యాంట్ విత్ టవల్ కలిపి అంత ధర ప్రకటించారని మండిపడ్డారు. మరో నెటిజన్ ప్రతి కుటుంబంలోని డాడీలు ఉండే స్టయిలే అది బాస్ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by IKEA UK (@ikeauk) (చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!) -
Khushi Pandey: మండే ఎండలు కాస్త జాగ్రత్త
‘అబ్బబ్బా! ఎండలు మండిపోతున్నాయి’ అని ఇంట్లో కూర్చొనే అపసోపాలు పడుతుంటారు చాలామంది. అలాంటిది ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడడం సామాన్య విషయం కాదు. కాని సామాన్యులకు తప్పదు. తనను తాను సామాజిక కార్యకర్తగా పరిచయం చేసుకునే లక్నోకు చెందిన ఖుషీ పాండే వీధి వీధి తిరుగుతూ పండ్లు, కూరగాయలు అమ్ముకునేవాళ్లకు, రిక్షా కార్మికులకు కాటన్ టవల్స్ ఇవ్వడంతో పాటు ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది. ‘నో నీడ్ టు వర్రీ ఎబౌట్ ది హీట్’ కాప్షన్‌తో కూడిన ఖుషీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొద్ది సమయంలోనే 5.15 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మీ వీడియో నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నేను టోపీలు పంచాలనుకున్నాను. ఈ వీడియో చూసిన తరువాత కాటన్ టవల్స్ బెటర్ అనిపించింది. తలతోపాటు మెడను కూడా కవర్ చేస్తాయి’ అని ఒక యూజర్ స్పందించాడు. -
దారుణం: డాక్టర్ నిర్వాకం.. మహిళ కడుపులో టవల్ ఉంచేసి..
ప్రసవ వేదనతో ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేశాడో వైద్యుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లే... నజరానా అనే మహిళ ప్రసవ వేదనతో సైఫీ నర్సింగ్ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఐతే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఆమె కడుపులో టవల్ ఉంచేసి ఆపరేషన్ చేశారు డాక్టర్ మత్లూబ్. కానీ ఆ తర్వాత మహిళకు కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో తాళలేక సదరు డాక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఐతే బయట చలి ఎక్కువగా ఉండటం వల్లే అలా అనిపిస్తుందని చెప్పి మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచేశారు సదరు మహిళని. కానీ ఆమెకు ఇంటికి వచ్చినా..ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో.. భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రెహాలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ అసలు విషయం తెలుసుకుని బాధితురాలి భర్త ఆలీ తెల్లబోయాడు. బాధితురాలి కడుపులో టవల్ ఉందని, ఆపరేషన్ చేసి తీసేసినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు అలీకి తెలిపారు. దీంతో అలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ)కు సదరు ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) రాజీవ్ సింఘాల్ ఈ విషయంపై సమగ్ర విచారణ చేయమని నోడల్ అధికారి డాక్టర్ శరద్‌ను ఆదేశించారు. ఐతే అలీ ఈ విషయమై లిఖితపూర్వకంగా తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. విచారణ నివేదిక రాగనే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తారని సీఎంవో అధికారి సింఘాల్ చెప్పడం గమనార్హం. విచారణలో..వైద్యుడు మత్లూబ్ అమ్రోహాలో సైఫీ నర్సింగ్ హోమ్‌ని ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నట్లు తేలింది. (చదవండి: షాకింగ్ ఘటన: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ) -
Best Gifts: మరీ టవల్‌ను కానుకగా ఇవ్వడం ఏంటని అనుకోకండి!
Best Gifts For Friends Different Seasons: పండగలు, వేడుకల సందర్భాలలో బంధుమిత్రుల ఇంటికి వెళ్లినప్పుడు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయేలా కానుక ఏదైనా తీసుకెళ్లాలనుకుంటారు ఎవరైనా. అయితే, ఆ ఎంపికలో ఎక్కువ శాతం వాల్ ఫ్రేమ్స్ లేదా గడియారాలు, కొన్ని షో పీసులు ఉంటాయన్నది చాలా మంది ఒప్పుకోవాల్సిందే. కానీ, కొద్దిగా ఆలోచిస్తే మనం ఇచ్చే కానుక ఆ ఇంట్లో అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ఎంపిక చేయచ్చు. చలికాలానికి రగ్గులు, వేసవి కాలానికి మగ్గులు, వర్షాకాలానికి గొడుగులు.. కానుకలుగా కాలానుగుణంగానూ ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే, అన్ని వేళల్లోనూ ఉపయోగపడేవాటిని ఎంచుకోవచ్చు. ఆలోచనకు కొన్ని ఎంపికలు.. 1. బ్లాంకెట్ : చలిని తట్టుకునేలా వెచ్చని ఆశీర్వచనంగా ప్రతి వింటర్లో ఉపయోగపడేవిధంగా బ్లాంకెట్‌ను ఎంపిక చేయచ్చు. వీటిలో అత్యంత ఖరీదైనవీ, బడ్జెట్‌కు తగినవీ ఉంటాయి. మార్కెట్లో అరుదుగా లభించేవి, నాణ్యమైనవీ, రంగులూ, డిజైన్లూ.. ఇలా మన ఎంపికలో ఓ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తపడవచ్చు. కొన్ని చలికాలాల పాటు మీ ఆప్తులకు మీరిచ్చిన రగ్గు వెచ్చదనాన్ని పంచుతుంది. ఆత్మీయతను పదిలం చేస్తుంది. 2. టీ పాట్: ప్రతి ఇంట్లోనూ తేనీరూ ఓ తప్పనిసరి అవసరం. కాలాలకు అతీతంగా వాడే ఈ పానీయాన్ని అతిథులకు అందించడానికి చూడచక్కని టీ కెటిల్ మంచి ఎంపిక అవుతుంది. అలాగే తేనీటికి సంబంధించి కప్పులు, ట్రే, టీ కెటిల్.. ఇలాంటివి అవసరంగా ఉంటాయి. వీటిలో ఏదైనా మంచి అందమైన సెట్‌ను కానుకగా అందిస్తే ప్రతిరోజూ మీ అతిథులను పలకరించినట్టుగానే ఉంటుంది. 3. వాటర్ జగ్స్ /బాటిల్స్: నీటిని నింపి టేబుల్ మీద పెట్టుకునే వాటర్ జగ్ లేదా బాటిల్స్ ఎంపిక మీ అభిరుచిని తెలియజేస్తుంది. అవసరం అంతగాలేని కానుకల కోసం ఎక్కువ ఖర్చు పెట్టే బదులు ఇలాంటి నిత్యావసరంగా ఉండేవాటిని కానుకలుగా ఇవ్వడానికి ఎంపిక చేసుకోవచ్చు. 4. టవల్: ‘మరీ టవల్‌ను కానుకగా ఇవ్వడం ఏంటి?!’ అనే ఆలోచనే చేయనక్కర్లేదు. నాణ్యమైన టవల్‌ను లేదా టవల్స్ సెట్‌ను కానుకగా ఇస్తే ఆ ఇంటి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 5. టేబుల్ నాప్కిన్స్–హోల్డర్స్: అతిథి మర్యాదలు చేసే సమయంలో డైనింగ్ టేబుల్ వద్ద ఉంచే నాప్కిన్స్ మంచి డిజైన్‌తో ఉన్న ఎంపికల గురించి చాలా తక్కువే ఆలోచిస్తారు. ‘ఎప్పుడో గానీ ఉపయోగించం కదా! ఖరీదు ఎందుకు’ అనుకునేవారు ఉంటారు. మీ బంధుమిత్రుల ఆలోచన కొద్దిగానైనా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి, అందమైన నాప్కిన్, వాటికి అలంకారంగా ఉండే హోల్డ్ర్స్ని గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ఇదే విధంగా గ్లాస్ హోల్డర్, స్పూన్లు, టేబుల్మ్యాట్స్.. ఇలా కానుకల ఎంపికలో చేర్చుకోవచ్చు. 6. ఫ్లోర్/కార్నర్ బాస్కెట్: పిల్లలు ఆడుకున్న బొమ్మలు లేదా ఇతరత్రా అవసరాలకు ఉపయోగించడానికి ప్లాస్టిక్ బుట్టలు లాంటివి వాడుతుంటారు. పర్యావరణ హితమైనవి, మంచి డిజైన్‌తో ఉన్న బుట్టలను కానుకగా ఇవ్వచ్చు. 7. గ్లాస్ సెట్: పానీయాలు సేవించడానికి ఉపయోగించే గ్లాస్ సెట్స్ ఎన్ని ఉన్నా భిన్నమైన ఆకృతిగల గ్లాసుల కోసం శోధిస్తూనే ఉంటారు. అందుకని, కానుకల విభాగంలో అందమైన గ్లాస్ సెట్ మంచి ఎంపిక అవుతుంది. 8. ఇండోర్ బోర్డ్ గేమ్స్: అతిథులు నలుగురు కలసిన వేళ కాలక్షేపానికి ఏం చేయాలో కొంత సమయం తర్వాత అర్థంకాదు. అలాంటప్పుడు ఇండోర్ బోర్డ్ గేమ్స్ బాగా ఉపయోగపడతాయి. ఆసక్తిగా అనిపించే పజిల్ గేమ్స్‌ను కానుకగా ఇవ్వచ్చు. 9. పండ్ల బుట్ట: పువ్వులు, పండ్లు పెట్టుకోవడానికి అందమైన డిజైన్లు గల రకరకాల బుట్టలు మార్కెట్లో లభిస్తున్నాయి. వెదురు నుంచి అన్ని రకరకాల లోహాల్లోనూ ఇవి లభిస్తుంటాయి. మన అభిరుచి అతిథులకు తెలిపేలా అందమైన పండ్ల బుట్టను కానుకగా ఇవ్వచ్చు. 10. పింగాణీ పాత్రలు/డిన్నర్‌సెట్: అతిథులకు భోజనాలు వడ్డించే సమయంలో ఉపయోగించే పింగాణీ పాత్రలు, ట్రే .. వంటివి తప్పనిసరి అవసరాలుగా ఉంటాయి. వీటినే కానుకగా అందిస్తే ఆతిథ్యం ఇచ్చేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కానుకల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మార్కెట్లో అనవసర వస్తువుల కోసం ఖర్చు పెట్టే విధానం కూడా తగ్గుతుంది. కానుకను తీసుకునే బంధుమిత్రుల స్థోమతను కూడా అంచనా వేసుకొని, దానికి తగినట్టు మన ఎంపిక ఉండటం ముఖ్యం అని భావించాలి. చదవండి: Mallappa Gate Story: అసలు ఎవరీమె? మనిషా.. దయ్యమా?.. అవును నేనే! -
స్నానం పూర్తి చేసుకున్న భర్త.. టవల్ త్వరగా ఇవ్వలేదని భార్య తలపై...
భోపాల్: స్నానం చేసిన తరువాత అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణం బాలాఘాట్ జిల్లా కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపుర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన ఉద్యోగి రాజ్‌కుమార్ బాహే శనివారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత. భార్య పుష్పా బాయ్ (45)ను టవల్ అడిగాడు. చదవండి: స్నేహితుడి భార్యపై కన్నేసిన దుర్మార్గుడు.. అత్యాచారం, వీడియోలు తీసి! అయితే ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని తువ్వాలు కోసం కాసేపు ఆగాలని భార్య చెప్పింది. ఆ సమయంలో ఆమె వంట పాత్రలు శుభ్రం చేస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై అక్కడే ఉన్న పారతో పదే పదే కొట్టాడని కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. భర్త దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. కూతురుపై తల్లి ప్రియుడు లైంగిక దాడి.. కాగా తండ్రి ఘాతుకాన్ని 23 ఏళ్ల కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను కూడా అడ్డొస్తే చంపేస్తాడని ఆమెను కూడా ఆ రాక్షసుడు బెదిరించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. -
ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తే.. ఫ్రై చేసిన టవల్
మనీలా: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అనేది ఈరోజుల్లో చాలా సాధారణ విషయం అయ్యింది. వంట చేసుకునే తీరిక లేని వారు, అసలు వంటే రాని వారు, వేరే ఇతర కారణాలతోనో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారు విపరీతంగా పెరిగారు. అయితే అప్పుడప్పుడు మనం ఆర్డర్ చేసిన దానికి బదులు వేరే ఐటంలు వచ్చి షాక్ ఇస్తాయి. తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళకు ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆన్లైన్లో ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తే.. దాని స్థానంలో డీప్ ప్రై చేసిన టవల్ వచ్చింది. దాన్ని చూసి సదరు మహిళ షాక్ అయ్యింది. ఆ వివరాలు.. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆలిక్ పెరెజ్ అనే మహిళ తన కుమారుడి కోసం ఆన్లైన్లో ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది. జొల్లిబీ అనే రెస్టారెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ తెరిచి ఆతృతగా కత్తితో ఓ ముక్క కత్తిరించాలని ప్రయత్నించింది. చాలా బలంగా ఉండడంతో ఏంటని పూర్తిగా తెరిచి చూసి షాక్ అయ్యింది. ఎందుకంటే ఆమె ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా డీప్ ఫ్రై చేసిన టవల్ వచ్చింది. దానితో పాటు నిమ్మకాయ, ఉల్లిపాయాలు కూడా వచ్చాయి. ఈ సందర్భంగా ఆలిక్ మాట్లాడుతూ.. ‘‘అప్పటికే ఆర్డర్ చాలా ఆలస్యమైందనే అసంతృప్తిలో ఉన్నాను. తీరా ఆర్డర్ వచ్చాక తీవ్ర కోపం కలిగింది. మా అబ్బాయి కోసం చికెన్ ఆర్డర్ చేశాను. తనకు ఓ పీస్ కట్ చేసి ఇద్దామని ప్రయత్నించాను. కానీ కట్ అవ్వడం లేదు. దాంతో అనుమానం వచ్చి మా ఆయన్ని పిలిచి దీని సంగతేంటే చూడమన్నాను. ఆయన ప్యాకెట్ మొత్తం తెరిచి చూస్తే బాగా ఫ్రై చేసిన టవల్ కనిపించింది. చాలా ఆశ్చర్యం కలిగింది. తీవ్రమైన కోపం వచ్చింది. ఇలా తరుచూ జరుగుతుంటాయని తెలుసు. కానీ జొల్లిబీ రెస్టారెంట్ చేసిన పనికి నాకు చాలా అసహ్యమేసింది. ఇంకో రెస్టారెంట్లో చికెన్ ఆర్డర్ పెట్టాను. కానీ ఈ టవల్ ప్రభావం ఆ ఫుడ్‌పై కూడా ఉంటుంది’’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇక ఈ ఘటనపై జొల్లిబీ రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘బొనిఫసియో గ్లోబల్ సిటీలోని మా రెస్టారెంట్‌ను మూడు రోజుల పాటు మూసివేస్తున్నాం. జరిగిన దానికి మేము చాలా చింతిస్తున్నాం. దీనిపై దర్యాప్తు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొంది. చదవండి: బ్లాక్‌ఫంగస్ దానివల్ల రాదు.. ఇది అసలు విషయం! -
లాక్డౌన్: ఈ చాలెంజ్ ట్రై చేశారా?
లాక్డౌన్ సమయంలో ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు జనాలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. వంటింటి మొహం కూడా చూడనివారు గరిటె పడుతుండగా, అందాన్ని నిగారింపు చేసేందుకు దొరికిన సమయాన్ని కాస్తా కొత్త కొత్త టిప్స్‌తో సద్వినియోగం చేసుకుంటున్నారు. వీలు దొరికితే పజిల్స్ అంటూ, కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ కాలాన్ని గడిపేస్తున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మరో కొత్త ఛాలెంజ్ వచ్చింది. అదే గమ్చా చాలెంజ్. నెటిజన్లు అధికంగా ఇష్టపడుతున్న ఈ చాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. (కరోనా ఎఫెక్ట్; వీడియో కాల్‌తో విషెస్) ఎప్పుడూ నెట్టింట్లో గడుపుతూ ఉండేవారికి ఈపాటికే దీనిగురించి తెలిసే ఉంటుంది. గమ్చా అంటే హిందీలో టవల్ లేదా వస్త్రం అని అర్థం. దీని సహాయంతో ముఖాన్ని కప్పుకోవాలి. అది కూడా ఊడిపోకుండా పర్ఫెక్టుగా కట్టుకోవాలి. ఈ క్రమంలో కళ్లు మాత్రమే కనిపించాలి కానీ, ముక్కు కొంచెం కూడా కన్పించకూడదు. అలా ముఖాన్ని రుమాలుతో కట్టుకుని ఫొటో దిగాలి. అనంతరం దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఉదాహరణకు కింద ఫొటోలు చూసేయండి. నచ్చితే ఓ సారి ట్రై చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్‌కు కూడా ఈ చాలెంజ్ విసరడం మర్చిపోకండి. (ఎక్కడా చోటు లేదని ఇక్కడ దాక్కున్నావా..) View this post on Instagram Can anyone define ... What is Gamchha??? So answer is :- Gamchha is youngest sister of bath towels 😂😉 ... ये सुपरहिट innovative definition मिली आज बनारस से ... हमारे पापा जी से...😁😂😉 ... वो क्या है कि मेरे सारे सवाल पहले घर पर पहुँचते है उसके बाद ज़वाब मिलते हैं ... और उन जवाबों की analysis सहित synopsis तैयार होती है... और फ़िर उसपर theory के theorum😁... अजी वो क्या है कि ... गमछा हम बनारसियों के कंधों पर ज़रूर मिलेगा... अब तो अधिकारिक रूप से ... mask की जगह गमछा के इस्तेमाल पर मंज़ूरी मिल गयी है... यानि UP में mask की हाय तौबा भीड़ से थोड़ी राहत divert होगी गमछे की दुकानों पर... जब भी दुकान खुलेगी... लेक़िन एक बात और बता दे नैना के बनारस से बँगाल के #Safarnama में ... #GamchhaSaree भी आती है बँगाल में...😂 तो ज़नाब इतना समझ लें... हमारे बनारसी अंदाज़ को दूसरा प्रदेश क्या दूसरा देश भी अपनाता है...(बांग्लादेश saree) * Disclaimer :- इन परिस्थितियों में सिर्फ़ मुँह बनाकर रहने से बेहतर है सचेत सहज और सकुशल रहे #GamchhaChallenge #NainaBanarasi #Safarnama A post shared by नैना बनारसी (@naina_banarasi) on Apr 11, 2020 at 9:12am PDT View this post on Instagram #gamchhachallenge A post shared by Sandeep Modi (@modi7672) on Apr 12, 2020 at 4:38am PDT View this post on Instagram #gamchhachallenge A post shared by MJ MANISH JHA (@mjmanishj) on Apr 11, 2020 at 8:24am PDT View this post on Instagram #gamchhachallenge #maskindia #qurantine #qurantinelife #stayhome #2020 #instadaily #instagram A post shared by shweta singh (@shweta1238) on Apr 15, 2020 at 7:35am PDT -
కోబీ బ్రయాంట్ టవల్‌కు రూ. 24 లక్షలు
లాస్ ఏంజెలిస్: అమెరికా విఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్, దివంగత కోబీ బ్రయాంట్ మరణానంతరం కూడా తన అభిమానులకు తానెంతటి ఆరాధ్యమో ప్రపంచానికి చాటుతున్నాడు. నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ (ఎన్బీఏ) నుంచి రిటైర్ అవుతూ... తన వీడ్కోలు ప్రసంగంలో భుజాలపై వేసుకున్న టవల్‌ను ఒక వేలం పాటలో ఉంచగా... అది 33,077 అమెరికన్ డాలర్లు (రూ.24.89 లక్షలు) పలికి కోబీ క్రేజ్‌ను మరోసారి తెలియజేసింది. ఈ వేలం పాటలో కోబీ అభిమాని ఒకరు ఈ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడు. తన 20 ఏళ్ల ఎన్బీఏ కెరీర్ మొత్తం లాస్ ఏంజెలిస్ లేకర్స్‌కే ప్రాతినిధ్యం వహించిన కోబీ... ఈ ఏడాది జనవరి 26న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. -
అయ్యో! కొండచిలువకు ఎంత కష్టం..
సిడ్నీ : సాధారణంగా కొండచిలువలు ఎలుకలు, ఇతర జంతువులను మింగేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే ఇక్కడ మాత్రం ఒక కొండచిలువ బీచ్ టవల్‌ను మింగి నానా అవస్థలు పడింది. అయితే దానికి ఎలాంటి హానీ కలగకుండా వైద్యులు కష్టపడి కొండచిలువ నోటి నుంచి టవల్‌ను బయటికి తీశారు. వివరాలు. ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి మోంటీ అనే కొండచిలువను పెంచుకుంటున్నాడు. ఒకరోజు దానిని సరదాగా బీచ్‌కు తీసుకెళ్లాడు. ఈలోగా కొండచిలువకు ఆకలయిందో ఏమో కానీ పక్కనే ఉన్న టవల్‌ను అమాంతం మింగేసింది. అయితే స్నాక్స్ పెడదామని భావించిన యజమానికి కొండ చిలువ నానా అవస్థలు పడుతూ కనిపించింది. దానికి ఏమైందోనని కంగారుపడిన యజమాని సిడ్నీలోని సాష్(స్మాల్ ఎనిమల్ స్పెషలిస్ట్) అనే వెటర్నరీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. పరీక్షలు చేసిన వెటర్నరీ వైద్యులు దాని కడుపులో ఒక బారీ పదార్థం ఉందని గుర్తించారు. ఎలాగోలా కష్టపడి చివరకు విజయవంతంగా కొండచిలువ కడుపులో నుంచి టవల్‌ను బయటికి తీశారు. 'మోంటీ సురక్షితంగా ఉండడం నాకు ఆనందం కలిగించింది. అది అంత పెద్ద టవల్‌ను మింగేయడంతో కంగారుపడ్డాను. కానీ వైద్యులు చాకచక్యంగా దాని కడుపులో నుంచి టవల్‌ను బయటికి తీశారు. డాక్టర్లకు నా కృతజ్ఞతలు' అంటూ యజమాని పేర్కొన్నాడు. కాగా ఈ వీడియోనూ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేయడంతో పాటు ప్లాస్టిక్ వంటి పదార్థాలు మూగ జీవాలకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందో చూడండి అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. This is what plastic & other waste is doing to other species. Vets here pulling AN ENTIRE BEACH TOWEL out of a python in Australia. Imagine what we are doing. Video Not for faint hearted person. pic.twitter.com/vDgPm6CgAe — Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 28, 2020 -
తుడుచుకోగానే ప్రాణం లేచి వస్తుంది
చిన్నప్పుడు అమ్మమ్మ తలంటి పోసి తాతయ్య టవల్‌ను తలకు చుట్టిన జ్ఞాపకం ఎప్పటికీ చెరిగిపోదు. తెల్లగా, మెత్తగా, తేలిగ్గా ఉండే టవల్‌ను తలకు కప్పి,జుట్టు కింద వరకు చుట్టి మెలితిప్పగానే తలలోని నీటిని పీల్చుకుని టవల్ ముద్దయిపోయేది, జుట్టును క్షణాల్లో పొడిబార్చేది. తల తుడుచుకుని తీగ మీద ఆరేయగానే నిమిషాల్లో ఆరిపోయేది. వాడడం సులభం,ఉతకడం సులభం, ప్రయాణాల్లో పెట్టెలో తక్కువ జాగాలో ఇమిడిపోయేది కూడా. ‘‘ఇప్పుడలాంటివి కనిపించడం లేదు. పలుచగా ఉంటే తేమ పీల్చవు, తేమను పీల్చే క్లాత్ కోసం చూస్తే తలకు చుట్టుకుంటే మెడ మోయలేనంత బరువు, మెడ నొప్పి వచ్చేస్తోంది..’’ ఈ మాటలు ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఇంట్లో వినిపించే ఉంటాయి. అయితే ఇందు మెనన్ విని ఊరుకోకుండా.. కేరళలో ఆ టవళ్లను నేసే నేత కారుల దగ్గరకు వెళ్లారు. వారి జీవితాలను గ్రంథస్థం చేయడం కోసమే ఆమె ఈ పని చేశారు. అయితే అక్కడి నేత మగ్గాలను, మార్కెట్ లేని చేనేత వస్త్రాల మీదనే బతుకు వెళ్లదీయాల్సిన వందల కుటుంబాలను చూసిన తర్వాత ఆమెలోని పరిశోధకురాలు నిద్రలేచింది. కూతురు చిత్రతో కలిసి ‘కారా వీవర్స్’ పేరుతో కేరళ చేనేతలకు ఒక బ్రాండ్‌ను సృష్టించగలిగారు ఇందు మెనన్. ఇందు మెనన్, కూతురు చిత్ర మన తువ్వాలే వారి థోర్‌థు అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో పరిశోధకురాలు అయిన ఇందు మెనన్ ఇటీవల ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత సొంతూరులో స్థిరపడడానికి కేరళకు వెళ్లిపోయారు. ఆ తరవాత ఆమె ‘ఉమెన్ వీవర్స్’ గురించి పుస్తకం రాస్తున్న మిత్రురాలికి సహాయంగా, సహ రచయితగా ఎర్నాకుళంలోని చేనేత కుటుంబాలను స్వయంగా కలిశారు. ఆ టవల్‌ను మలయాళంలో ‘థోర్‌థు’ అంటారు. థోర్‌థు మన తువ్వాలే. ‘‘కేరళ థోర్‌థు తయారీలో దాగిన కళ చేనేత మహిళలతో మాట్లాడినప్పుడే తెలిసింది. ఇంత సౌకర్యవంతమైన క్లాత్‌ను తయారు చేసే ప్రక్రియ ఆగిపోకూడదనిపించింది’’ అన్నారు ఇందు మెనన్. ‘‘అదే క్లాత్‌ని ఇప్పటి అవసరాలకు తగినట్లు మార్చుకుంటే మంచి ఫ్యాబ్రిక్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు. మా అమ్మాయి చిత్ర గ్రాఫిక్ డిజైనర్. నా ప్రాజెక్ట్‌లో సహాయం చేయడానికి ఒప్పుకుంది. చిత్ర ఇచ్చిన స్టయిలిష్ డిజైన్లను చేనేత మహిళలు చక్కగా ఆకళింపు చేసుకుని నేశారు. ఇప్పుడు స్టార్ హోటళ్లకు టేబుల్ నాప్కిన్స్ నుంచి స్విమ్మింగ్ పూల్ టవల్స్ వరకు సప్లయ్ చేస్తున్నాం. అమెరికా, యూరప్‌లలో బీచ్ టవల్‌గా కూడా కేరళ థోర్థులనే వాడుతున్నారిప్పుడు. ముఖ్యంగా చంటిపిల్లలకు పక్కకు వేయడానికి, కప్పడానికి చిన్న చిన్న దుప్పట్లు ఇదే మెటీరియల్‌తో చేస్తున్నాం. వీటితోపాటు కేరళ సంప్రదాయ ముండు (ధోవతి)తో కుర్తా కుట్టడం అనే ప్రయోగం కూడా సక్సెస్ అయింది. మూడేళ్ల కిందట బెర్లిన్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద మోడల్స్ కేరళలో మహిళా నేతకారులు నేసిన వస్త్రాలను ప్రదర్శించారు. మేము చొరవతో చేసిన ఒక ప్రయత్నం విజయవంతమైంది. ఇప్పుడు ఈ పనిలో ఐదు వందల చేనేత కుటుంబాలు, ఎనభై మంది టైలర్లు, నాలుగు వందల మంది ఇతర సపోర్టింగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నారు’’ అని సంతోషంగా చెప్పారు ఇందు మెనన్.– మంజీర -
‘అమ్మ’కు అవమానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం సాక్షిగా అమ్మకు అవమానం జరిగింది. అట్టహాసంగా చేయాల్సిన జయలలిత విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి అమ్మను అవమానాలపాలు చేశారని పార్టీ అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా దుమ్మెత్తి పోశారు. అన్నాడీఎంకేను స్థాపించింది ఎంజీ రామచంద్రన్. ఎంజీఆర్ మరణం తరువాత పార్టీ పగ్గాలను జయలలిత చేపట్టారు. అయితే ఎంజీఆర్ కంటే జయలలిత అంటేనే పార్టీ శ్రేణులు హడలిపోయేవారు. కూర్చుంటే ఏమో, నిలబడితో ఏమో అన్నట్లుగా భయపడుతూ వినయ విధేయతలు ప్రదర్శించేవారు. జయ కన్నుమూసిన తరువాత శశికళ పట్ల అదే స్థాయిలో పాదనమస్కారాలు, క్రమశిక్షణ పాటించేవారు. అమ్మ మరణంపాలైంది, చిన్నమ్మ జైలు పాలైంది. దీంతో అన్నాడీఎంకేలో అందరికీ ఆకాశమంత స్వేచ్ఛ లభించింది. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఒకప్పుడు ఎంజీ రామచంద్రన్ విగ్రహం మాత్రమే ఉండేది. జయ మరణంతో ఆమె విగ్రహాన్ని కూడా పెట్టాలని భావించారు. ఈ ఏడాది ఫిబ్రవరి24వ తేదీన జయ 70వ జన్మదినం సందర్భంగా పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి ఆమె విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అయితే ఆ విగ్రహంలో జయ ముఖకవళికలు ఏమాత్రం గోచరించక పోవడంతో తీవ్ర విమర్శల పాలైంది. విమర్శలు వెల్లువెత్తడంతో సదరు విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహం పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో కొత్త విగ్రహానికి ఆర్డర్ ఇచ్చారు. జయ రూపురేఖలతో చూడముచ్చటగా తయారైన ఈ విగ్రహాన్ని గతనెల 23వ తేదీన పార్టీ ప్రధాన కార్యాలయానికి చేర్చారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఎంజీఆర్ విగ్రహం పక్కన అమర్చి ప్రారంభోత్సవ తేదీ కోసం అందరూ ఎదురుచూశారు. ఎట్టకేలకూ బుధవారం అమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. మీడియా వారందరికీ ఆహ్వానాలు కూడా పంపారు. బుధవారం ఉదయం అందరూ అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకోగా పరిసరాల్లో ఎక్కడా బ్యానర్లు, ఫ్లెక్సీల హడావుడి కనిపించలేదు. పార్టీ వారికి కనీస సమాచారం లేదని తెలిసింది. అంతేగాక విగ్రహంలోని జయలలిత ముఖంపై ఓ చిన్నపాటి తెల్లటి తుండుగుడ్డ (టవల్) ఆరేసినట్లుగా కప్పి ఉండడంతో విస్తుపోయారు. కొద్దిసేపటికి ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అక్కడికి చేరుకుని జయ విగ్రహం కిందివైపు అమర్చిన అమ్మ ఫొటోపై పూలుజల్లి అంజలిఘటించి వెళ్లిపోయారు. ఆ తరువాత ఎవరో వచ్చి అమ్మ ముఖంపై కప్పి ఉంచిన తుండుగుడ్డను తొలగించారు. జయలలిత విగ్రహావిష్కరణ ఇలాగేనా చేసేది గుసగుసలాడుకున్నారు. జయ జీవించి ఉండగా వణికిపోయే పార్టీ శ్రేణుల్లో ఎంతటి నిర్లక్ష్యం తాండవిస్తోందని ముక్కున వేలేసుకున్నారు. అయితే అప్పటికే విగ్రహంపై తుండుగుడ్డ ఫొటో వాట్సాప్‌లో వైరలైంది. తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. దీంతో మంత్రి జయకుమార్ హడావుడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొదటి విగ్రహాన్ని ఎంతో సంప్రదాయబద్ధంగా ఆవిష్కరించామని, అయితే ఆ విగ్రహంపై విమర్శలు రావడంతో దాని స్థానంలో కొత్త విగ్రహాన్ని బుధవారం ప్రతిష్టించామన్నారు. అందుకే విగ్రహావిష్కరణను భారీ ఎత్తున నిర్వహించలేదని ఆయన సమర్థించుకున్నారు. -
టవల్లో దగ్గరి పోలికలు ఉండటంతో...
లండన్ : సరదాకి ఓ క్రికెటర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో పెద్ద కలకలాన్నే రేపింది. హఠాత్తుగా దాన్ని చూసిన వారంతా అది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోటోనేనంటూ పలువురు ట్రోలింగ్ చేయటం మొదలుపెట్టారు. అయితే కొన్ని క్షణాలు నిశితంగా పరిశీలించిన వారికి అది ఆయన కాదని తెలిసిపోతుంది. అయినప్పటికీ ఆ రెండు ఫోటోలతో ఆడేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఈ ఉదయం ఓ ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇందులో ఉన్న మాజీ క్రికెటర్‌ను కనిపెట్టండంటూ ప్రశ్నించాడు. టవల్లో ఉన్న ఓ వ్యక్తి విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫోటో అది. అందులో ఉన్నది ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్ అన్నది ఈజీగా చెప్పేయొచ్చు. కానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో హుస్సేన్‌కు కాస్త దగ్గరి పోలికలు ఉన్నాయంటూ కొందరు ఆ ఫోటో క్షణాల్లో షేర్ చేసేశారు. దీంతో సోషల్ మీడియాలో గందరగోళం మొదలైంది. కొందరు అది పుతిన్ అంటే.. ఇలాంటి బోల్డ్ పనులు చేసే గట్స్ ఆయనకే ఉన్నాయంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. కావాలంటే కంపేర్ చేసుకోండి అంటూ గతంలో పుతిన్ పుణ్య స్నానం చేసిన సమయంలోని అర్ధనగ్నంగా ఫోటోలను ఆధారాలుగా చూపిస్తున్నారు. చాలా మంది మట్టుకు మాత్రం అది పుతినా లేక హుస్సేనా అన్నది నిర్ధారించుకోవటానికి సమయం పట్టిందని చెప్పటం విశేషం. Does anyone recognise this former England captain? @WardyShorts @BumbleCricket pic.twitter.com/upIZ7KmIl4 — Jos Buttler (@josbuttler) 26 February 2018 -
చిన్నోడి టవల్‌ను పెద్దాయన ‘కొట్టేశాడు’
వింబుల్డన్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత విజయానందంలో ఉన్న ఆటగాళ్లు తమకు సంబంధించిన ఒక వస్తువును సాధారణంగా ప్రేక్షకుల్లోకి విసరడం తరచుగా జరుగుతుంటుంది. అభిమానులు కూడా దానిని అంతే అపురూపంగా దాచుకోవడం సహజం. అమెరికాకు చెందిన జాక్ సాక్ తొలి రౌండ్లో క్రిస్టియన్ గారిన్ను ఓడించాడు. అనంతరం అతను తన చెయిర్ వద్దకు వస్తున్న సమయంలో ఒక చిన్నారి తన టవల్‌ను ఇవ్వాల్సిందిగా కోరాడు. దాంతో సాక్ వెంటనే స్పందిస్తూ టవల్‌ను ఆ అబ్బాయి వైపు విసిరేశాడు. దానికి ఆ కుర్రాడికంటే ముందు వరుసలో కూర్చొన్న ఒక ‘పెద్దాయన’ అతనికి అందకుండా దానిని బలవంతంగా లాగేసుకున్నాడు. దీన్ని సాక్ కూడా ముందుగా గుర్తించలేదు. అయితే ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టికి ఈ ఘటన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఆ ముసలాడిని పరుష పదజాలంతో తిట్టి పోశారు. ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే తల్లి జూడీ అయితే అతనికి సిగ్గు లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అనంతరం జాక్ సాక్ ఆ అబ్బాయి ఎవరో గుర్తించి వివరాలు ఇవ్వండి, మరో టవల్ ఇస్తానంటూ ప్రకటించాడు. సోషల్ మీడియా ప్రచారంతో ఒకరోజు తర్వాత ఆ కుర్రాడిని గుర్తించారు. అయితే అతను స్వస్థలం ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడని తెలిసింది. -
ముఖంపై ముడతలు తగ్గాలంటే...
బ్యూటిప్స్ ఒక టేబుల్ స్పూన్ చల్లని పాలల్లో 3–4 చుక్కల నిమ్మరసం కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముడతలు పడ్డ ప్రదేశంలో రాత్రి పడుకునే మందు రాసుకోవాలి. మర్నాడు ఉదయం వేడి నీటితో ముఖాన్ని కడిగి, గరుకుగా ఉన్నటవల్తో తుడుచుకోవాలి. మళ్లీ ఆ మిశ్రమాన్ని ముడతలు మీద వ్యతిరేక దిశలో రబ్ చేసి అరగంట పాటు ఉంచి ముఖాన్ని కడగాలి. సబ్బు ఏ మాత్రం ఉపయోగించకూడదు. అర టీ స్పూన్ తేనెకు ఒక టీ స్పూను బియ్యం పొడిని కలిపి ఆ పేస్ట్‌ని చర్మం మీద పడిన గీతలపై రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. బొప్పాయి పైతొక్కును ముఖంపై రబ్ చేసి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇది చర్మంపై ముడతలు పోగొట్టడంతోపాటు వుంచి టోనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ముడతలపై బాదాం నూనెను కింది నుంచి పై వైపునకు రాసి రాత్రంతా ఉంచుకుని మర్నాడు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతీ 30–40 రోజులకొకసారి చేస్తుంటే ముడతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. -
భార్యను కడతేర్చిన భర్త
కాకినాడ రూరల్ : వివాహేతర బంధానికి అడ్డొస్తుందన్న నెపంతో భార్యను కడతేర్చాడు భర్త. కాకినాడ విద్యుత్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటనలో కిలిం నూకరత్నం దేవి( 27) బలైంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రతాప్‌నగర్‌కు చెందిన పచ్చిపాల సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నూకరత్నందేవి విజయవాడ గవర్నర్‌పేటలో సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. రమణయ్యపేటకు చెందిన కిలిమ్ శ్రీనివాసరావు కాకినాడ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాదిన్నర బాబు ఉన్నాడు. విద్యుత్‌నగర్‌లోని నాన్సిస్ట్రీట్‌లో ఉన్న ఓ అపార్టమెంట్లో శ్రీనివాసరావు, నూకరత్నందేవి ఉంటున్నారు. ఉద్యోగరీత్యా నూకరత్నందేవి వారానికి ఒకసారే కాకినాడకు వచ్చేది. దీనిని ఆసరాగా తీసుకున్న శ్రీనివాసరావు మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన నూకరత్నం దేవి అప్పుడప్పుడూ భర్తను నిలదీసేది. ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లొచ్చాక వీరిమధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో శ్రీనివాసరావు తన భార్యను కొట్టి, తువాలును ఆమె మెడకు బిగించి చంపేశాడు. అనంతరం ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న నూకరత్నందేవి తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేసి, ‘మీ అమ్మాయికి దెబ్బ తగిలింది, ఆస్పత్రిలో చేర్చాం’ అని చెప్పాడు. తండ్రి, బంధువులు ఆస్పత్రికి వెళ్లగా, నూకరత్నందేవి చనిపోయి ఉంది. గొంతు నుమిలినట్టు ఉండడం, అపార్టమెంట్లో తువాలు చుట్టి ఉండడంతో.. ఆమెను హతమార్చారని నిర్ధారణకు వచ్చిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మురళీకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగని రైతులు అత్మహత్యలు