ముఖంపై ముడతలు తగ్గాలంటే...
బ్యూటిప్స్
ఒక టేబుల్ స్పూన్ చల్లని పాలల్లో 3–4 చుక్కల నిమ్మరసం కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముడతలు పడ్డ ప్రదేశంలో రాత్రి పడుకునే మందు రాసుకోవాలి. మర్నాడు ఉదయం వేడి నీటితో ముఖాన్ని కడిగి, గరుకుగా ఉన్నటవల్‌తో తుడుచుకోవాలి. మళ్లీ ఆ మిశ్రమాన్ని ముడతలు మీద వ్యతిరేక దిశలో రబ్ చేసి అరగంట పాటు ఉంచి ముఖాన్ని కడగాలి. సబ్బు ఏ మాత్రం ఉపయోగించకూడదు. అర టీ స్పూన్ తేనెకు ఒక టీ స్పూను బియ్యం పొడిని కలిపి ఆ పేస్ట్‌ని చర్మం మీద పడిన గీతలపై రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.
బొప్పాయి పైతొక్కును ముఖంపై రబ్ చేసి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇది చర్మంపై ముడతలు పోగొట్టడంతోపాటు వుంచి టోనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ముడతలపై బాదాం నూనెను కింది నుంచి పై వైపునకు రాసి రాత్రంతా ఉంచుకుని మర్నాడు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతీ 30–40 రోజులకొకసారి చేస్తుంటే ముడతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.