డెర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 28 ఏళ్లు. వాతావరణం మారినప్పుడల్లా నా చర్మం కాస్త నిస్తేజంగా అనిపిస్తోంది. నా చర్మం నిగారింపుతో ఉండటానికి తగిన జాగ్రత్తలు చెప్పండి.
- సుష్మిత, నిజామాబాద్
శరీరంలోని అతి పెద్ద అవయవం చర్మమే. ఇది శరీరాన్ని కప్పి ఉంచే రక్షణ కవచం వంటిది. బయటి నుంచి వచ్చే ప్రతి ఒత్తిడిని ముందుగా భరించేది చర్మమే. చర్మం సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటుంది. అది... సాధారణ చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం, కాంబినేషన్ చర్మం పొడిచర్మం సాధారణంగా పొడిబారిపోయి ఉంటుంది. ఇలాంటి చర్మతత్వం కలిగిన వారిలో ముడుతలు త్వరగా వస్తాయి. వీళ్లు తప్పనిసరిగా చర్మంలోని తేమను నిలిపి ఉంచడం కోసం మాయిశ్చరైజర్లను వాడాలి జిడ్డు చర్మం ఉన్నవారి మేను కాస్తంత జిడ్డుగా ఉంటుంది.
వీళ్లలో చర్మరంధ్రాలు కాస్తంత స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఉంటాయి. కొంతమందిలో మొటిమలు రావడం కూడా చాలా సాధారణం కాంబినేషన్ చర్మం ఉన్నవారిలో ముఖంలోని కొన్ని భాగాలు... ముఖ్యంగా బుగ్గల్లోని కొంతభాగం, ముక్కు, గడ్డం వంటివి జిడ్డుగా కనిపిస్తుంటాయి. మిగతా భాగాలు పొడిబారినట్లుగా ఉంటాయి సాధారణ చర్మం కలిగిన వారిలో మరీ జిడ్డుగానూ, మరీ పొడిగానూ లేకుండా చర్మం సాధారణంగా ఉంటుంది.
చర్మ సంరక్షణ కోసం కొన్ని సూచనలు... పొడి చర్మం ఉన్న వారికి చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో కొంచెం సమస్యలు తక్కువేనని చెప్పాలి. అయినప్పటికీ వీళ్లు మాయిశ్చరైజర్లు వాడటం మాత్రం మానకూడదు. ఎస్‌పీఎఫ్ 30 కలిగిన సన్‌స్క్రీన్ వాడటం తప్పనిసరి. జిడ్డు చర్మం కలిగిన వారికి ఎండాలంలో చర్మంపై జిడ్డు పెరిగినట్లుగా ఉంటుంది. చెమటతో సమస్య మరింత ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. వీరు వేడిమి ఉన్న వాతావరణంలో తరచూ ముఖాన్ని నీటితో కడుక్కుంటూ ఉండాలి. మాయిశ్చరైజర్లు, సన్‌స్క్రీన్ తప్పక వాడాలి. పొడి చర్మం ఉన్నవారు క్రీమ్ బేస్‌డ్ మాయిశ్చరైజర్లు వాడాలి ఇక ఏ రకమైన చర్మం ఉన్నవారైనా నీళ్లు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా ఉండే పుచ్చపండ్ల వంటి తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. సమతులమైన ఆహారం తీసుకోవాలి.
- డాక్టర్ స్వప్న ప్రియ
కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
నా చర్మం... నిస్తేజం!
Published Fri, Sep 16 2016 11:11 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
Advertisement
Advertisement