బ్యూటిప్స్
రెండు బాదంపప్పులను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మెత్తగా పేస్టు చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ముల్తానిమట్టి, పుచ్చకాయ రసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఫలితాలివి... బాదంపప్పు చర్మానికి మంచి పోషణనిస్తుంది, సహజమైన ఎక్స్‌ఫోలియేట్ ఎలిమెంట్‌గానూ పనిచేసి మృతకణాలను తొలగిస్తుంది ∙పాలు క్లెన్సర్‌గా పని చేస్తాయి ∙ముల్తానిమట్టి చర్మం మీద నిలిచిపోయిన మలినాలను తొలగిస్తుంది.పుచ్చకాయ రసంలో చర్మంలో నీటిశాతాన్ని తగ్గకుండా కాపాడడంతోపాటు తెల్లబరిచే గుణాలు కూడా ఉన్నాయి.
ఈ ప్యాక్ వేయడం వల్ల క్లెన్సింగ్, తేలికపాటి బ్లీచింగ్‌తోపాటు స్క్రబ్ చేసిన ఫలితాలు లభిస్తాయి. ప్రతిదీ నేచురల్ ప్రొడక్ట్ కావడంతో ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు ∙పిగ్మెంటేషన్ (మంగు)తో బాధపడేవాళ్లు ఈ ప్యాక్‌ను తరచుగా అంటే నెలకు రెండు లేదా మూడుసార్లు వాడవచ్చు. ముల్తానిమట్టిని మినహాయించి తయారుచేసుకుంటే రెండు రోజులకొకసారి కూడా వాడవచ్చు. చర్మం మీద ఉన్న నల్లటి మచ్చలు పూర్తిగా మాయమవుతాయి.