మేని మెరుపునకు మేలైన ఆహారాలు | special food for skin glow | Sakshi
Sakshi News home page

మేని మెరుపునకు మేలైన ఆహారాలు

Published Thu, Jan 19 2017 12:58 AM | Last Updated on Tue, Oct 2 2018 4:34 PM

మేని మెరుపునకు మేలైన ఆహారాలు - Sakshi

మేని మెరుపునకు మేలైన ఆహారాలు

ఫైన్‌ ఫుడ్‌ – షైనింగ్‌ స్కిన్‌
చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు యౌవనంగా కనిపించడానికి ఈ ఆహారం దోహదపడుతుంది. ఆ ఆహార వివరాలు...

ఆహారం:  తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ.
ప్రయోజనం: ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. కాస్త గరుగ్గా ఉండే చర్మాన్ని నునుపుగా చేసేందుకు దోహదపడతాయి.
ఆహారం : ముడిబియ్యం, పొట్టు తీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్‌... వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ.
ప్రయోజనం: శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి.
ఆహారం: విటమిన్‌–బి6 ఎక్కువుండే ఆహారమైన క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్, అవకాడో.
ప్రయోజనం: హార్మోన్లలోని అసమతౌల్యం వల్ల వచ్చే మొటిమలను విటమిన్‌–బి6 నివారిస్తుంది. హార్మోన్‌ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా సహాయపడుతుంది.
తాజా పండ్లు: అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ–ఆక్సిడెంట్స్‌ ఉంటాయి.
ప్రయోజనం: చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌ను తొలగించడానికి యాంటీ–ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. అందుకే చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండాలంటే తాజా పండ్లు తినాలి.

చర్మం గ్లో తగ్గించే పదార్థాలు
ఈ తరహా ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే చర్మానికి అంతగా మేలు జరగదు. మితిమీరి తీసుకుంటే కీడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. అందుకే ఇవి తీసుకునే సమయంలో విచక్షణతో ఉండాలి. ఈ ఆహారం వివరాలివి...
ఆహారం : కాఫీ, టీ, శీతలపానియాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌.
చేటు : వీటిల్లో కెఫిన్‌ పాళ్లు ఎక్కువ. ఇది చర్మంలో నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారి కనిపించేలా చేస్తుంది. నీటిని తొలగిస్తుంది కాబట్టి విషాలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువ.
ఆహారం : చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలైన చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు, స్వీట్స్‌ ఎక్కువగా ఉండే పానియాలు.
చేటు : తీపి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఇన్‌ఫ్లమేషన్‌ అవకాశాలను పెంచుతుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారంతో మొటిమలు వస్తాయి.
ఆహారం: బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్‌డ్‌ ఫుడ్‌.
చేటు : ఇందులో అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ. అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడతలు పడేందుకు దోహదం చేస్తాయి.
ఆహారం : నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్‌ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్‌ నూనె ఉపయోగించిన పదార్థాలు.
చేటు : ఇందులో ట్రాన్స్‌–ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement