ప్రతీకాత్మక చిత్రం
భాగ్యనగర్‌కాలనీ: చదువులో త్రీవ ఒత్తిడికి గురై ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైజాగ్‌కు చెందిన విశ్వనాథం కుమార్తె హర్షిత (19) ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నది. హర్షితతో పాటు అనన్య అనే మరో విద్యార్థినికి కాలేజీ హాస్టల్‌లో 206 నెంబర్ రూమ్ కేటాయించారు. ఆదివారం జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉండటంతో అనన్యను తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు. హర్షిత తండ్రి విశ్వనాథం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కళాశాలకు ఫోన్ చేసి కూతురితో మాట్లాడారు. అనంతరం హర్షిత రూమ్‌కి వెళ్లింది.
కొద్దిసేపటి తర్వాత విద్యార్థులందరినీ యూనిట్ పరీక్షకు పిలుస్తున్నారని వార్డెన్ స్వరూప హర్షిత గదికి వెళ్లి పిలువగా గడియ వేసి ఉంది ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో కళాశాలలో పనిచేస్తున్న హరి, దేవదాస్‌ల సహాయంలో తలుపులు పగులగొట్టి తెరిచి చూడగా నల్ల చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరాతీశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment