ఉరుకులు, పరుగుల జీవితంలో ఒత్తిడి చాలా కామన్ అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఒత్తిడి చాలారకాలుగా మన అందర్నీ వేధిస్తూ ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడిమానసిక సమస్యలే కాదు, శారీరకంగానూ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
చర్మ సమస్యలు, త్వరగావృద్ధాప్యం
శరీరం ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పికి మానసికంగా కుంగుబాటుతోపాటు అనేక చర్మ సమస్యలకు దారి తీస్తుంది. సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ హార్మోన్ విడుదల ఎక్కువ అవుతుంది. ఇది చర్మ సున్నితత్వం రియాక్టివిటీని పెంచుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇప్పటికే తామర ఉన్నవారిలో అది మరింత ముదరవచ్చు. అలాగే గాయాలను సహజంగా నయం చేసే చర్మ సామర్థ్యానికి ఒత్తిడి ఆటంకం కలిగిస్తుంది.
చర్మంలోని కొల్లాజెన్, సాగే ఫైబర్‌ను ప్రభావితం చేస్తోంది చర్మంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది దీంతో చాలా తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇంకా మొటిమలు, దద్దుర్లు రావడం, జట్టు సన్నబడటం, రాలిపోవడం లాంటి ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
హార్మోన్లపై ప్రభావం: ఎక్కువగా స్ట్రెస్‌కు గురైనపుడు డొపమైన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. ఇవి మిగిలిన హార్మోన్స్‌పై ప్రభావం చూపుతాయని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవచ్చు. బీపీ పెరగడం లాంఇ సమస్యలు ఎదుర్కొంటారు.
గుండె పోటు ముప్పు : తీవ్రమైన ఒత్తిడితో హృదయ స్పందనల్లో తేడాలొస్తాయి. ఒక్కోసారి గుండెపోటుకు ప్రమాదం ఉంది. బీపీ పెరిగి పక్షవాతంముప్పు పొంచివుంటుంది. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేని వారిలో హెమరైజ్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది.
జీర్ణ సమస్యలు: ఒత్తిడి ఎక్కువైతే కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి మందగించడం, అతిగా తినడం, వికారం లాంటివి కన్పిస్తాయి. కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. జీవక్రియల వేగం మందగిస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తి తగ్గుతుంది.
సైలెంట్ కిల్లర్... ఏం చేయాలి?
సైలెంట్ కిల్లర్ లాంటి ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి పరిష్కరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గుర్తించి చికిత్స తీసుకుంటే మాత్రం చాలా సులువుగా దీన్నుంచి బయటపడవచ్చు. స్ట్రెస్‌మేనేజ్‌మెంట్ తగినంత నిద్రపోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టడం చాలా కీలకం. రిలాక్సేషన్ టెక్నిక్స్ , యోగా, ధ్యానం లాంటి సాధన. రెగ్యులర్ వ్యాయామం ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది.
7-9 గంటల నాణ్యమైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు, కూరగాయలు , తృణధాన్యాలతో సమతుల్య ఆహారం తీసుకోవాలి. తగినంత నీటిని తీసుకోవాలి. కెఫిన్ , ఆల్కహాల్‌కి దూరంగా ఉండటంతోపాటు, ఒత్తిడి కలిగించే పనులు, ఎక్కువ శ్రమకు దూరంగా ఉండాలి. స్నేహితులు, ఆత్మీయులు,కుటుంబ సభ్యుల మంచి సంబంధాలకు ప్రయత్నించాలి. ఇక ఒత్తిడి భరించలేని స్థాయికి చేరిందని పిస్తే థెరపిస్ట్ లేదా కౌన్సెలర్, లేదా నిపుణుడైన వైద్యుని సలహా తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment