Dermatology Counseling
-
‘ఆస్ట్రిడ్ ’కు అల్లు అరవింద్ అభినందనలు (ఫొటోలు)
-
చర్మ సమస్యలతో బాధపడుతున్న రష్మిక? ఇదిగో ఫ్రూఫ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా మయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. సమంతలాగే ఏదోక ఒక అనారోగ్య సమస్య బాధపుతున్నా హీరోయిన్లు, నటీమణులు కూడా ఉన్నారు. అందులో మమతా మోహన్ దాస్, కల్పికా గణేష్ తదితరులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో రష్మిక కూడా చేరినట్లు కనిపిస్తోంది. రష్మికకు చర్మ వ్యాధి సోకినట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీనికి కారణం ఆమె చేసిన లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్టే. అయితే రష్మికకు తన రోజువారి పనులను డైరీగా రాసుకోవడం అలవాటు ఉన్నట్లు ఉంది. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు! అలాగే తను ఆ రోజు ఏం చేసిందనేది అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అదే విధంగా సోమవారం కూడా తన డే షెడ్యూల్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అందులో రష్మిక ఇలా రాసుకొచ్చింది. ‘‘డియర్ డైరీ.. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్గా గడిచింది. లేవగానే కార్డియో వర్క్ అవుట్ చేశా. ఆ తర్వాత ఆహారం తీసుకున్నా. రేపటి షెడ్యూల్ కోసం బ్యాగ్ సర్దుకున్నా. అయితే ఎప్పటిలాగే నా చూట్టు వాతావారణం, మంచు నన్ను బయటకు వెళ్లకుండ డ్రామాలు చేశాయి. ఇక సర్దడం అయిపోయాక మళ్లీ వర్క్ అవుట్ చేశా. ఆ తర్వాత డిన్నర్ చేశా. ఇక డెర్మట్..(డెర్మటాలజీ) అపాయింట్మెంట్ తీసుకున్నా. ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. కానీ అది క్యాన్సిల్ అయ్యింది. తిరిగి ఇంటికి వచ్చేశా. ఇక గుడ్ నైట్. బాగా పడుకో’’ అంటూ హార్ట్ ఎమోజీలను జత చేసింది. ఇక్కడ పరిశీలిస్తే ఇందులో డెర్మట్ అంటే.. డెర్మటాలజిస్ట్ అని అర్థం అవుతోంది. ఇక ఇది చూసి అంతా రష్మికకు ఏమైందా? అని కంగారు పడుతున్నారు. తనకు ఏదైనా చర్మ వ్యాధి సోకిందా? ఎందుకు డెర్మటాలజీ అపాయింట్మెంట్ తీసుకుందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. కాగా రష్మిక తెలుగులో పుష్ప 2, హిందీలో యానిమల్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్‌తో రష్మిక బిజీగా ఉంది. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. తప్పు చేశానంటూ స్టేజ్‌పై సిరి కన్నీళ్లు! -
Skin Problems: ట్యానింగ్.. అదేపనిగా సూర్యకాంతిలో ఉంటే మాత్రం ఇక అంతే!
మన మనుగడకు ఎండ ఎంతో అవసరం. కానీ అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో మాత్రం చర్మానికి హాని జరుగుతుంది, అలా ఇవి ఎప్పుడూ నివారించలేని ముప్పులా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. పైగా రాబోయేది వేసవి. ఈ సీజన్లో ఎండ తీవ్రత ఎక్కువయ్యేకొద్దీ అల్ట్రావయొలెట్ కిరణాల తాకిడి కూడా క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. వాటితో హాని ఎలా, ఎందుకు కలుగుతుందన్న విషయాలు తెలుసుకుందాం. అల్ట్రావయొలెట్ కిరణాలు సూర్యకాంతి నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. వీటిని సంక్షిప్తంగా యూవీ అంటారు. ఇందులో యూవీఏ, యూవీబీ, యూవీసీ అని మూడు రకాలు ఉంటాయి. సూర్యకాంతి తీవ్రంగా ఉన్నప్పుడు భూమి వాతావరణంలో యూవీఏ, యూవీబీ రెండూ ప్రవేశిస్తాయి. అవి మన చర్మానికి తగిలినప్పుడు కేవలం 5 శాతం మాత్రమే వెనకకు వెళ్తాయి. కొన్ని చెదిరిపోతాయి. చాలా భాగం చర్మంలోకి ఇంకి పోతాయి. చర్మంలోని ‘ఎపిడెర్మిస్’ పొరలో ఉండే డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రిప్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకిపోయేలా చేస్తాయి. తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’ను తాకుతాయి. ఈ క్రమంలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు వస్తుంది. ఆ మార్పు తీవ్రమైనప్పుడు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. దుష్ప్రభావాలివే... మామూలుగానైతే ఇంట్లో ఉన్నవారిపై అల్ట్రావయొలెట్ కిరణాల దుష్ప్రభావం ఉండదనుకుంటాం. బయటితో పోలిస్తే ఇన్‌డోర్‌లో తక్కువే అయినా... వాటి దుష్ప్రభావాలు ఎంతోకొంత ఉండనే ఉంటాయి. ఆకాశంలో మబ్బులు ఉన్నప్పుడు ‘యూవీ’ కిరణాల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. ఇళ్లలోని ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. అన్నట్టు... భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అనుకుంటాం కదా. అది వాస్తవం కాదు. నిజానికి మంచుతో ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ. భూమధ్యరేఖ దగ్గర, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ, వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ వాటి తీవ్రత పెరుగుతుంది. వేర్వేరు ప్రదేశాల్లో అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత... ∙మంచులో ... 85శాతం వరకూ; ∙ఇసుకలో ... 25శాతం; ∙మిలమిల మెరుస్తున్న నీళ్లలో: 5 శాతం... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల మనకు... సన్ బర్న్స్ ∙సన్ ట్యానింగ్, చర్మం మందంగా మారడం, గోళ్లకు నష్టం కావడం, వాస్తవ వయసు కంటే పెద్దగా కనిపించడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. చర్మానికి జరిగే అనర్థాలు సన్‌బర్న్స్ గురించి చెప్పాలంటే... తొలుత అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం కణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ముఖంపై, చేతులపై త్వరగా కనిపిస్తుంది. తెల్లటి చర్మం ఉన్నవారిలో సన్‌బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. మన దేశవాసుల్లో సన్‌బర్న్స్ కాస్త తక్కువే. ట్యానింగ్ విషయానికి వస్తే.. సూర్యకాంతి తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగుమారిపోతుంది. అది కొద్ది నిమిషాల నుంచి కొద్ది గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు తాత్కాలికంగానే ఉంటుంది. కానీ అదేపనిగా సూర్యకాంతిలో ఉండేవారిలో రంగు మారే ప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగుతుంది. అలా మారింది కాస్తా... చాలాకాలం ఉంటుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు సూర్యకాంతికి అదేపనిగా ఎక్స్పోజ్ అయినవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా ఉన్నవారిలో ఈ ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తుంది. చర్మంతో పాటు గోళ్లకు నష్టం జరుగుతుంది. అల్ట్రావయొలెట్ కిరణాలతో గోళ్లకు జరిగే అనర్థాన్ని వైద్యపరిభాషలో దీన్ని ‘ఒనైకోలైసిస్’ అంటారు. అన్నీ నష్టాలేనా? అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల అంతా అనర్థమేననీ, అవి పూర్తిగా ప్రమాదకరమేనని అనుకోడానికీ వీల్లేదు. కొన్ని విషయాలు/రంగాల్లో వాటితోనూ ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకు... ∙విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కాకపోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఇది ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ ఎంతగానో అవసరం. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదలకూ, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికీ, ఇన్సులిన్ ఉత్పత్తికీ కొంతమేరకు అల్ట్రా వయొలెట్ కిరణాలు అవసరం. ∙కొన్ని చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటివాటి చికిత్సలకు. ∙నవజాత శిశువులో : పుట్టుకామెర్లు (జాండీస్) తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తారు. -డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ -
పాపకు ముఖం నిండా మొటిమలు...
మా పాప వయసు 18 ఏళ్లు. గత కొంతకాలంగా ఆమెకు ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి. పాప ముఖం చాలా కళగా ఉంటుంది. అయితే ఈ వయసులో ఇలా మొటిమలు రావడంతో కాస్తంత న్యూనతకు గురవుతోంది. మా అందరికీ అవగాహన కలిగేలా మొటిమల గురించి పూర్తి వివరణ ఇస్తూ, ఆమె విషయంలో మేము ఎలాంటి జాగ్రత్తలు/చికిత్స తీసుకోవాలో తెలియజేయండి.– కె. సురేఖ, సికింద్రాబాద్ మొటిమలు రావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి... 1) జిడ్డుస్వభావంతో కూడిన చర్మం (ఆయిలీ స్కిన్) 2) చర్మంపై ఉండే స్వేద రంధ్రాలు పూడుకుపోవడం 3) చర్మంపైని స్వేద రంధ్రాలలో బ్యాక్టీరియా చేరడం 4) ఇన్ఫ్లమేషన్ (నొప్పి, వాపు, మంట). సాధారణంగా చర్మకణాలు పుట్టే క్రమంలో చర్మంపై ఉండే స్వేదరంధ్రాలు పూడుకుపోతాయి. దాంతో అక్కడ చర్మాన్ని తేమగా ఉంచేందుకు పుట్టే స్రావమైన ‘సీబమ్’ బయటికి రావడానికి మార్గం ఉండదు. ఫలితంగా అక్కడ పేరుకున్న ‘సీబమ్’ బ్యాక్టీరియా పెరుగుదలకు మరింత దోహదపడుతుంది. ఫలితంగా అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇలా మొటిమలు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో యుక్తవయసుకు రాగానే పెరిగే పురుష హార్మోన్లు మొటిమలకు కారణం అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే మొటిమలు ఉన్న మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పాళ్లను పరిశీలిస్తే అవి నార్మల్‌గా ఉండాల్సిన మోతాదులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యుక్తవయసులో ఉన్న ఆడపిల్లల్లో ఈ హార్మోన్ పాళ్లు పెరగడం వల్ల రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, అవాంఛిత రోమాలు రావడం కనిపించవచ్చు. అందుకే దాదాపు 25 ఏళ్లు దాటిన మహిళల్లో మొటిమలు రావడం జరుగుతుంటే వాళ్లలో హార్మోన్ అసమతౌల్యత ఉన్నట్లుగా అనుమానించాలి. పాలిసిస్టిక్ ఓవరీ (అండాశయాల్లో నీటితిత్తులు ఉండటం) అనే కండిషన్లో మహిళల్లో మొటిమలు చాలా ఎక్కువగా వస్తాయి. పైగా ఇవి చికిత్సకు ఒక పట్టాన లొంగవు. అందుకే మొటిమలు ఉన్న పురుషులలో కంటే మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యతకు అవకాశాలు ఎక్కువ అని తెలుస్తుంది. కొన్ని రకాల మందులు వాడటం వంటి అంశాలు కూడా మొటిమలను ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. కొన్నిసార్లు సౌందర్యసాధనాలు (కాస్మటిక్స్) వల్ల కూడా మొటిమలు రావచ్చు. ఇక ఆహారం విషయానికొస్తే కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం, చాక్లెట్లతో మొటిమలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది అందరిలో జరగకపోయినా, మొటిమలు వచ్చే దేహ స్వభావం ఉన్నవారిలో మొటిమలు రావడం, అవి మరింతగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివారు కొవ్వులను, చాక్లెట్లను మినహాయించాలి. మొటిమలు రావడం కూడా ఒక రకం వ్యాధే... చాలామంది తల్లిదండ్రులు మొటిమలను ఒక వ్యాధిగా పరిగణించరు. కానీ చర్మానికి సంబంధించిన ఒక రుగ్మతగానే దీన్ని చూడాలి. సాధారణంగా ముఖం మీద, కొందరిలో ఛాతీ, వీపు మీద కనిపించే ఈ మొటిమలు చాలా తక్కువ తీవ్రత (మైల్డ్) మొదలుకొని తీవ్రమైన (సివియర్) వరకు వేర్వేరు స్థాయుల్లో కనిపిస్తాయి. కొందరిలో చాలా తీవ్రమైన (వెరీ సివియర్) స్థాయి మొటిమల తీవ్రత ఎంతగా ఉంటుందంటే అది కొన్ని జీవ వ్యవస్థలను (సిస్టమ్స్‌ను) కూడా ప్రభావితం చేస్తుంది. మొటిమ తన తొలిదశలో చిన్న బొడిపెలా కనిపిస్తుంది. దీని చివరిభాగం మూసుకుపోయి తెల్లగా కనిపిస్తుంది. ఆ తర్వాతి దలో దీని చివరిభాగం నల్లగా మారి, తెరచుకుని కూడా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇది ఎర్రగా బాగా ఉబ్బిపోయి లేదా వాపుతో కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో చర్మం గట్టిబారి పోయి ఒక పెద్దబొడిపె (నాడ్యూల్) లా అనిపించవచ్చు. ఇలా ముఖమంతా అనేక దశల్లోని మొటిమలు కనిపిస్తూ ఉండవచ్చు. ముఖం మీద ఉన్న గాట్లు వంటి భాగాలు, మచ్చలు (స్కార్స్) ఆధారంగా వీటిని ఐదు గ్రేడ్స్‌గా విభజించి చూస్తారు. కొందరిలో ఇవి నీరునిండినట్లుగా గట్టి పెద్ద బొడిపె మాదిరిగా (నాడ్యులో–సిస్టిక్) పుండ్లలా కనిపిస్తూ జ్వరం, కీళ్లనొప్పులు కూడా కనిపించవచ్చు. కొందరిలో అకస్మాత్తుగా మటుమాయమవుతాయి... కొందరిలో ఇవి తమ కౌమార దశ నుంచి బయటపడగానే (అడల్ట్హుడ్కు రాగానే) అకస్మాత్తుగా మాయమైపోతాయి. లేదా తీవ్రత తగ్గిపోతాయి. అయితే మొటిమల అనంతర దశల్లో వచ్చే మచ్చలు మిగిలిపోవడం వంటి కొన్ని దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని చికిత్స కొనసాగించాలా, అయితే ఎంతకాలం కొనసాగించాలన్నది తెలుసుకోవాలి. కొందరిలో చికిత్స అవసరం చాలామంది పేరెంట్స్ యుక్తవయసులోని తమ పిల్లలకు మొటిమలు వస్తున్నప్పుడు కొంత వయసు తర్వాత అదే తగ్గిపోతుందంటూ చికిత్స ఇప్పించరు. ఇది సరికాదు. తీవ్రమైన మొటిమలు ఉన్నప్పుడు అవి ముఖం మీద గాట్ల వంటి మచ్చలను ఏర్పరుస్తాయి. అవి ఎదిగే వయసులోని పిల్లల్లో తీవ్రమైన న్యూనతను కలిగిస్తాయి. కాబట్టి ఆ వయసు పిల్లల ఎదిగే మానసిక ఆరోగ్య వికాసాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కౌమారంలో ఉన్న పిల్లల నాణ్యమైన జీవితం కోసం, ఆత్మవిశ్వాసం పెంపొందించండం కోసం మొటిమలకు చికిత్స అవసరం. ఈ చికిత్స ఎంతగా జరిగితే మచ్చలను అంతగా రాకుండా చూడవచ్చు. చాలా తక్కువ తీవ్రతతో (మైల్డ్‌గా) ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు, క్లెన్సర్లు అందుబాటులో ఉంటాయి. అయితే మొటిమలు తీవ్రంగా ఉన్న సందర్భాల్లో పూతమందుల (టాపికల్ మెడిసిన్స్)తో పాటు నోటి ద్వారా తీసుకోవాల్సిన మందులు (ఓరల్ మెడిసిన్స్) కూడా వాడాల్సి ఉంటుంది. నివారణకు ఉపయోగపడే క్లెన్సర్స్ ఇవి: ఇప్పుడు మార్కెట్లో మొటిమలను నివారించడానికి చాలా క్లెన్సర్ లభ్యమవుతున్నాయి. వీటిలో శాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, సల్ఫర్ ఉంటాయి. ఇవి సబ్బులు, లిక్విడ్ ఫేస్‌వాష్ ల రూపంలో లభిస్తున్నాయి. వీటిని ఉపయోగిస్తూ, ముల్తానీ మిట్టీ లాంటి వాటితో ఫేస్‌ప్యాక్‌లా వేస్తూ జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలోని జిడ్డుపాళ్లను తగ్గించవచ్చు. ఇది మొటిమలు తగ్గించడానికి ఒక మార్గం. అయితే మొటిమలు తక్కువగా ఉన్నవారు మినహాయించి, ఒకింత ఎక్కువగా ఉన్నవారు ముఖాన్ని శుభ్రపరచుకునేందుకు ఫేషియల్ స్క్రబ్ వాడకపోవడమే మంచిది. పూతమందులతో చికిత్స: మొటిమలు ఉన్న స్థాయిని, తీవ్రతను బట్టి పూత మందుల్లో అనేక రకాలు లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు రెటినాయిడ్స్ అనే పూత మందులు స్వేదరంధ్రాలు పూడుకుపోయిన మొటిమలకు బాగా ఉపయోగపడతాయి. ఇక రెటినాయిడ్స్‌తో పాటు క్లిండమైసిన్, అజిథ్రోమైసిన్, నాడిఫ్లోక్లసిస్ వంటి యాంటీబయాటిక్స్ పూతమందులుగా లభ్యమవుతున్న కాంబినేషన్లు మొటిమలపై మరింత ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అయితే కొన్ని రెటినాయిడ్ కాంబినేషన్ పూత మందుల వల్ల చర్మంపై మంట, చర్మం ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీన్ని తగ్గించడానికి అవి పూసి ఉంచాల్సిన వ్యవధిని తగ్గించడం, వాటర్ బేస్డ్ మాయిష్చరైజర్స్ వాడటం మేలు. ఒకవేళ పూతమందులతో మొటిమలు 6–8 వారాలు గడిచినా తగ్గనప్పుడు పూతమందులతో పాటు నోటిద్వారా తీసుకునే మందులు వాడాలి. నోటి ద్వారా తీసుకునే మందులతో (ఓరల్ థెరపీ): ఒకింత తీవ్రత కలిగిన మొటిమలు మొదలుకొని తీవ్రమైన మొటిమలకు పూతమందులతో పాటు... నోటి ద్వారా తీసుకోవాల్సిన అరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్, మినోసైక్లిన్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి మూడు వారాల పాటు వాడాక కూడా ఫలితం కనిపించకపోతే చికిత్స వ్యవధిని కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు పొడిగించాల్సి ఉంటుంది. ఇక మహిళల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ వంటి హార్మోన్ల అసమతౌల్యత లక్షణాలు కూడా కనిపిస్తే నోటిద్వారా తీసుకునే మందులతో చికిత్స అవసరం. మహిళల్లో మొటిమలతో పాటు హార్మోన్ అసమతౌల్యతలకు సైప్రోస్టెరాన్ ఎసిటేట్ వంటి యాంటీయాండ్రోజెన్ మందులు, గర్భనిరోధక మాత్రలు వాడుతుంటే అందులో కొద్దిపాటి ఈస్ట్రోజెన్‌తో పాటు లో–యాండ్రోజెనిక్ ప్రోజెస్టెరాన్ ఉన్న మందులను కనీసం ఆరు వారాల పాటు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. యాంటీబయాటిక్స్‌తో కూడా ఫలితం లేనప్పుడు ఐసోట్రెటినియాన్ వంటివి మొటిమల చికిత్సలో మంచి ఫలితాలను ఇచ్చే మందులుగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తీవ్రమైన మొటిమల కోసం యాంటీబయాటిక్స్ కూడా ఉపయోగపడనప్పుడు వీటిని 16 వారాలపాటు వాడాలి. మొటిమలకు కారణాలు ఏవైనప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా ఫలితం చూపే మంచి మందులివి. వాటితో పాటు ఇప్పుడు చవగ్గానే లభించే డర్మారోలర్, హైస్ట్రెంత్ ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్‌ను పూసే చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స: ఇక ముఖంపైన మచ్చలు, గాట్లు మిగిలిపోయినవారికి ఒక్కోసారి వాటి తీవ్రతను బట్టి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. అయితే ఇది చాలా అరుదు. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
చుండ్రు సమస్య తగ్గేదెలా?
నా వయసు 24 ఏళ్లు. నాకు చుండ్రు ఎక్కువగా వస్తోంది. అమ్మాయిని కావడంతో తలలో చేయిపెట్టి గీరుకోవడం చాలా ఎంబరాసింగ్‌గా అనిపిస్తోంది. దయచేసి నా సమస్య తీరడానికి ఏమైనా మార్గాలుంటే చెప్పండి. – సుప్రియ, విశాఖపట్నం నిజమే. అమ్మాయిలకు చుండ్రు ఉన్నప్పుడు వాళ్ల సెల్ఫ్–ఎస్టీమ్ కాస్తంత దెబ్బతిని, కొంత కుంగిపోతుంటారు. అయితే కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అవి... ►చుండ్రు ఉన్నవారు తలకు జిడ్డుగా ఉండే నూనెలు రాయకపోవడమే మంచిది. కొందరిలో నూనె రాయకపోతే తలనొప్పి వంటివి వస్తాయనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వారు తలకు నూనె రాయాల్సి వస్తే, కొద్దిసేపటి తర్వాత తప్పనిసరిగా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ నూనె రాసేటప్పుడు కూడా సువాసన నూనెలు కాకుండా శుభ్రమైన కొబ్బరినూనెకే పరిమితం కావడం మంచిది. ►మీరు తల స్నానం చేసేటప్పుడు మాడు అంతా పూర్తిగా శుభ్రపడేలా రుద్దుకుంటూ స్నానం చేయండి. మీకు సరిపడే మంచి షాంపూతో కనీసం వారంలో రెండుసార్లయినా తలస్నానం చేస్తుండాలి. ఇలా రోజు విడిచి రోజూ తలస్నానం చేయాల్సి వచ్చినప్పుడు మైల్డ్ షాంపూలు మాత్రమే ఉపయోగించాలి. ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడటమూ మంచి ప్రయోజనాలిస్తుంది. ►ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాక కూడా చుండ్రు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వారి సూచన మేరకు... యాంటీ ఫంగల్ ఏజెంట్స్, తార్ కాంపౌండ్స్ వంటివి ఉన్న మెడికేటెడ్ షాంపూలు వాడవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... ఈ తరహా షాంపూలు ఉపయోగించేటప్పుడు వీటిని నీళ్లలో పలుచబార్చకూడదు. ఒకసారి తలకు పట్టించాక కనీసం 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడే అవి తమ ప్రభావం చూపగలవు. ఐదు నిమిషాల తర్వాత వాటిని శుభ్రంగా కడిగేయాలి. జుట్టురాలుతున్నా లేదా దురద ఎక్కువగా ఉన్నా ఒక్కోసారి స్టెరాయిడ్ బేస్డ్ లోషన్లు కూడా డాక్టర్లు సూచిస్తారు. అయితే వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. ►చుండ్రుతో పాటు మొటిమలు కూడా ఉంటే... హార్మోన్లలో ఏవైనా మార్పులు వచ్చాయా అనే పరీక్షలు చేయించాలి. ఆ వచ్చే ఫలితాలను బట్టే తర్వాతి చికిత్స కొనసాగాలి. ►జుట్టు పొడవుగా ఉండే మహిళలు తలస్నానం చేశాక వెంటనే దాన్ని ముడుచుకోవడం తగదు. ఎందుకంటే అలాంటి సమయంలో జుట్టులో తేమ చాలాసేపు ఉండి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే వాతావరణానికి అనువుగా ఉంటుంది. పైగా జుట్టు తొందరగా చిక్కులు పడుతుంది. అందుకే జుట్టును ఆరేందుకు ఫ్రీగా వదిలేయాలి. పూర్తిగా తడి ఆరకముందే దువ్వడం సరికాదు. దాదాపు పొడిబారిపోయే సమయంలో దువ్వడం మంచిది. ►విటమిన్–ఏ, జింక్ పాళ్లు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ►చుండ్రు ఒక దీర్ఘకాలిక సమస్య. కేవలం కొద్దిరోజులు షాంపూ వంటివి వాడాక తగ్గిపోవడం అన్నది సాధారణంగా జరగదు. కాబట్టి సమస్య ఉన్నంతకాలం యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతుండటమే మంచిది. లేదా చుండ్రు మళ్లీ తిరగబెట్టినప్పుడు యాంటీడాండ్రఫ్ షాంపూల వాడకం మళ్లీ మొదలుపెట్టాలి. అవి చాలావరకు సురక్షితమే. అయితే దీర్ఘకాలం పాటు వాడుతున్నప్పుడు కొందరిలో అవి తలను పొడిబారేలా చేయవచ్చు. అలాంటప్పుడు కండిషనర్స్ కూడా వాడటం మంచిది. కొన్ని షాంపూల వల్ల జుట్టు రాలుతున్నట్లు గమనిస్తే వెంటనే షాంపూను మార్చి తమకు సరిపడేది వాడాలి. ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలతో చుండ్రును చాలావరకు తేలిగ్గానే అరికట్టవచ్చు. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ షాంపూఎంపిక ఎలా? నా వయసు 22 ఏళ్లు. చాలాకాలంగా షాంపూలు వాడుతున్నా దేనితోనూ సంతృప్తిపడలేకపోతున్నాను. మార్కెట్లో రకరకాల షాంపూలు అందుబాటులో ఉండటంతో పాటు, టీవీల్లో కనిపించే యాడ్స్‌తో ఇంకా అయోమయంలో పడిపోతున్నాను. నాలాంటి ఎంతోమంది అమ్మాయిలకు అది ఉపయుక్తంగా ఉంటుందనిపించేలా మంచి షాంపూను ఎంపికకు ఏమైనా సూచనలివ్వండి. ప్లీజ్! – ఎమ్ లక్ష్మీ సుశ్మిత కొందరివి పలుచటి వెంట్రుకలు, కొందరివి బిరుసుగా ఉంటాయి.. ఇలా సాధారణంగా అందరి వెంట్రుకలూ ఒక్కలా ఉండవు. కాబట్టి అందరి షాంపూ అవసరాలూ ఒకేలా ఉండవని మనం గుర్తుంచుకోడాలి. ఇక మన అవసరాలను బట్టి మార్కెట్లోకి రకరకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు కొంత అయోమయానికి గురికావడం సహజమే. అయితే మన అవసరాలను బట్టి మనం ఎలాంటి షాంపూలను ఎంచుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ కింది సూచనలు పాటించడం చాలావరకు మేలు చేస్తుంది. అందరూ వాడదగ్గవి : ఇందులో శుభ్రపరిచే సామర్థ్యం (క్లెన్సింగ్ ఎబిలిటీ) నార్మల్‌గా ఉంటుంది. నార్మల్ హెయిర్ కోసం వాడాల్సిన ఈ షాంపూలు సాధారణంగా లారిల్ సల్ఫేట్ అనే నురగవచ్చే పదార్థంతో తయారవుతాయి. ఇందులో ఆ రసాయనంతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఉత్పత్తిదారులు రకరకాల సుగంధ ద్రవ్యాలను చేర్చి వాటిని మంచి సువాసన వచ్చేలా రూపొందిస్తారు. ఇవి ఎవరైనా వాడవచ్చు. కాబట్టి మార్కెట్లో ఉన్న రకరకాల బ్రాండ్స్‌ను వాడుతూ... ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో... మీకు ఏది అనువైనదో, సౌకర్యమో అది వాడుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఛాయిస్ షాంపూను మీ సంతృప్తి మేరకు కొనసాగించవచ్చు. జుట్టులో మంచి సువాసనతో పాటు, ఆహ్లాదకరమైన ఫీలింగ్ కోరుకునే వారు ఇలాంటివి వాడుకోవచ్చు. అయితే షాంపూ ఏదైనప్పటిక అది మైల్డ్‌గా ఉండటం అన్నది జుట్టు విషయంలో దాదాపుగా అందరికీ ఆరోగ్యాన్నిచ్చేందుకు డాక్టర్లు ఇచ్చే ఒక మంచి సూచన. పొడి వెంట్రుకలు ఉండేవారికి : వెంట్రుకలు చాలా పొడిబారినట్లుగా ఉంటాయి. ఇలాంటి వారికోసం తయారయ్యే షాంపూల్లో రోమాన్ని శుభ్రపరిచే రసాయనాలు మరీ తీవ్రంగా లేకుండా చూస్తారు. అంటే మైల్డ్ క్లెనింగ్ ఏజెంట్స్‌ను ఉపయోగించి చేస్తారు. దాంతో పాటు వెంట్రుక కండిషనింగ్ కోసం అందులో సిలికోన్ వంటి ఏజెంట్స్, కెటాయినిక్ పాలిమర్స్‌ను కలుపుతారు. వాటిని ఉపయోగించాక ఆ సిలికోన్ పొడి వెంట్రుకల మీద సమంగా విస్తరించి ఒక కోటింగ్‌లా ఏర్పడుతుంది. కాబట్టి పొడి వెంట్రుకలు ఉన్నవారికి సిలికోన్, కెటాయినిక్ పాలిమర్స్ ఇంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉన్నవి మంచి షాంపూలుగా పరిగణించవచ్చు. మీరు పొడి వెంట్రుకలు కలవారేతే... పైన పేర్కొన్న ఇన్‌గ్రేడియెంట్స్ షాంపూలో ఉన్నాయో లేవో చూసి, అలాంటి వాటినే ఎంపిక చేసుకోవచ్చు. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి : తలలోని చర్మరంధ్రాల నుంచి సీబమ్ అనే స్రావం ఎక్కువగా వచ్చిన వారి వెంట్రుకలు సాధారణంగా జిడ్డుగా ఉంటుంటాయి. ఇలాంటి జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి అవసరమైన షాంపూలను మాడుపైన, వెంట్రుకపైన ఉన్న అదనపు సీబమ్‌ను తొలగించేలా రూపొందిస్తారు. ఇందులో క్లెన్సింగ్ ఏజెంట్‌గా లారిల్ సల్ఫేట్‌తో పాటు అదనపు నూనెవంటి స్రావాలను తొలగించడానికి ఉపయోగపడే ‘సల్ఫోసక్సినేట్’ వంటి రసాయనాలతో వీటిని తయారు చేస్తారు. అయితే జిడ్డుజుట్టు ఉన్నవారికి రూపొందించే షాంపూలలో కండిషనింగ్ తక్కువగా ఉండేలా చూస్తారు. కాబట్టి పైన పేర్కొన్న కాంబినేషన్స్ ఉన్నవి జిడ్డు కురుల వారు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే కురులు మరీ జీవం లేనట్టుగా మారిపోతాయి. అప్పుడది పీచులా కనిపించే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఎన్నిసార్లు తలస్నానం చేస్తే, అలా కనిపిస్తుందో ఎవరికివారు పరీక్షించి చూసుకొని, వారంలో అంతకంటే తక్కువసార్లు తలస్నానం చేయడం మంచిది. వారంలో తలస్నానం ఎన్నిసార్లు? జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయవచ్చు. – ఆర్. రమణి, గుంటూరు సాధారణంగా వారానికి ఇన్నిసార్లే తలస్నానం చేయాలంటూ నిర్దిష్టంగా లెక్కేమీ ఉండదు. కొందరికి రోజూ తలస్నానం చేస్తే తప్ప స్నానం చేసినట్టు ఉండదు. ఇలాంటివారికి తమ వ్యక్తిగత సంతృప్తే ప్రధానం కాబట్టి... తమ తమ వ్యక్తిగత అభిరుచి మేర తలస్నానం చేయవచ్చు. అయితే సాధారణంగా వారంలో రెండు సార్లు, మరీ తలలో దురద ఎక్కువగా వచ్చేవారు రోజు విడిచి రోజు... (అది కూడా మైల్డ్ షాంపూతో మాత్రమే) తలస్నానం చేస్తే మంచిది. -
అరబిందో చేతికి సాండోజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అరబిందో చేతికి అమెరికాకు చెందిన సాండోజ్ డెర్మటాలజీ చిక్కింది. నోవార్టిస్ ఏజీ జనరిక్ వ్యాపార విభాగమే ఈ సాండోజ్. డీల్ విలువ 1 బిలియన్ డాలర్ (రూ.7,200 కోట్లు). దీనికి అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అనుమతి ఇవ్వాల్సి ఉందని.. 2019 కి ఈ డీల్ ముగిసే అవకాశముందని అరబిందో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాండోజ్ వ్యాపారం 0.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కొనుగోలులో సాండోజ్‌కు చెందిన ఉత్తర కరోలినాలోని విల్సన్ తయారీ కేంద్రం, న్యూయార్క్‌లోని హిక్స్‌విల్లీ, మెల్విల్లీ తయారీ కేంద్రాలు అరబిందో వశమవుతాయని కంపెనీ ఒక ప్రకటనతో తెలిపింది. దీంతో పాటూ హిక్స్‌విల్లీ, మిల్‌విల్లీ, విల్సన్, ప్రిన్స్టన్, న్యూజెర్సీల్లోని సుమారు 750 మంది ఉద్యోగుల, ఫీల్డ్ రిప్రజెంట్స్ కూడా అరబిందోకు బదిలీ అవుతారు. ప్రస్తుతం సాండోజ్‌కు చెందిన సుమారు 300 ఉత్పత్తులతో పాటూ అభివృద్ధి చేస్తున్న పలు ప్రాజెక్ట్‌లు కూడా అరబిందోకు విక్రయిస్తున్నట్లు సాండోజ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూఎస్‌లో ఎంట్రీ కోసమే.. అమెరికాలో వ్యాపార వృద్ధి, విస్తరణలో భాగంగానే ఈ కొనుగోలు జరిగిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ పత్రికా సమావేశంలో చెప్పారు. దీంతో అమెరికాలో జనరిక్ డెర్మటాలజీ మార్కెట్లో విస్తరణకు, మా ఉత్పత్తుల ప్రవేశానికి తలుపులు తెరిచినట్లయిందని చెప్పారు. ‘‘అత్యంత సమర్థవంతమైన ఉత్పాదన, నిర్వహణ, లాభదాయకమైన మార్కెట్ వంటివి ప్రధాన లక్ష్యంగా చేసుకొనే సాండోజ్‌తో పాటూ గతంలో జరిపిన ఇతర కంపెనీల కొనుగోళ్లు జరిగాయని’’ గోవిందరాజన్ వివరించారు. 2వ అతిపెద్ద కంపెనీగా.. సాండోజ్‌కు జనరిక్ బ్రాండ్ డెర్మటాలజీ విభాగంతో పాటూ అభివృద్ధి కేంద్రం కూడా ఉంది. కొనుగోళ్ల లావాదేవీలతో పరిశీలిస్తే అమెరికాలో డెర్మటాలజీ విభాగంలో అరబిందో 2వ అతిపెద్ద కంపెనీగా అవతరించింది. వాస్తవానికి సాండోజ్ విభాగంలో డెర్మటాలజీ కంటే ఓరల్ సాలిడ్స్ (టాబ్లెట్స్ మరియు క్యాçప్సూల్స్) వ్యాపార విభాగం పెద్దది. కానీ, అరబిందో ప్రధాన లక్ష్యం తక్కువ ధర, నిర్వహణ ద్వారా డెర్మటాలజీ విభాగాన్ని లాభంలోకి తీసుకురావాలనేది. గురువారం బీఎస్ఈలో అరబిందో షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 9.12 శాతం పెరిగి రూ.759.55 వద్ద స్థిరపడింది. -
డర్మటాలజీ కౌన్సెలింగ్
హాస్టల్లో చేరినప్పటి నుంచి వేళ్ల మధ్య కురుపులు నా వయసు 16 ఏళ్లు. ఇటీవలే ఇంటర్మీడియట్ చదవడానికి మా ఊరినుంచి వచ్చి ఇక్కడ టౌన్‌లోని ఒక హాస్టల్లో ఉంటున్నాను. నేను హాస్టల్ చేరాక కొద్దిరోజుల్లోనే నా చేతివేళ్ల మధ్యన కురుపుల్లాగా వస్తున్నాయి. కాస్త దురదగా ఉంటోంది కూడా. ఇదేమైనా అంటువ్యాధా? తగిన పరిష్కారాన్ని సూచించండి. – ఎల్. రవికాంత్, గుంటూరు హాస్టల్లో ఉండే పిల్లల్లో చాలామందికి వచ్చే చాలా సాధారణమైన వ్యాధి ఇది. దీన్ని ‘స్కేబిస్’ అంటారు. మీరు ఊహించినట్లే ఇది చాలా త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కేవలం 20 నిమిషాల పాటు కలిసి ఉన్నా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందంటే, ఇది ఎంతటి తీవ్రమైన అంటువ్యాధో ఊహించవచ్చు. దీనికి చికిత్స కోసం మీరు ఫెక్సోఫినడిన్ 180 ఎంజీ అనే ట్యాబ్లెట్‌ను రోజూ రాత్రివేళ 10 రోజుల పాటు తీసుకోండి. ఇది దురదను తగ్గిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం వేడినీటితో స్నానం చేసి, ఆ టైమ్‌లో వేళ్ల మధ్య స్క్రబ్ (శుభ్రం అయ్యేలా గట్టిగా రాసుకోవడం) చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి పర్మెథ్రిన్ 5% అనే లోషన్‌ను శరీరమంతా రాసుకుని నిద్రపోండి. (ఇలా చేయడం కేవలం ఒక రాత్రి కోసం మాత్రమే). ఉదయం లేవగానే వేళ్లమధ్య స్క్రబ్ చేసుకుంటూ స్నానం చేయండి. ఇదే ప్రక్రియను నెల తర్వాత మళ్లీ రిపీట్ చేయాలి. హాస్టల్లో ఒకరికి ఉన్నా... మొత్తం హాస్టల్లో ఉన్నవారంతా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే నెల తర్వాత ఇదే ట్రీట్మెంట్ మళ్లీ తీసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే మరోమారు డర్మటాలజిస్ట్‌ను సంప్రదిం చండి. చెవిరింగు ఉన్న చోట రాష్... తగ్గేదెలా? నా వయసు 36 ఏళ్లు. నేను చెవి రింగు ధరించే రంధ్రం వద్ద ర్యాష్‌లాగా వచ్చి అక్కడ విపరీతమైన దురద కూడా వస్తోంది. నేను ఆర్టిఫిషియల్ ఆభరణాలు... అంటే రింగులు లేదా దిద్దులు ధరించినప్పుడు ఈ బాధ ఎక్కువవుతోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – డి. సురేఖ, వరంగల్ సాధారణంగా కృత్రిమ ఆభరణాలలో నికెల్ లోహం ఉంటుంది. దీని వల్ల ర్యాషెస్ వస్తాయి. వీటి కారణంగా కాస్త దురద, చెవి రంధ్రం వద్ద ఎర్రబారడం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. మీరు ఈ దశలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అక్కడి గాయం రేగిపోయి, రక్తస్రావం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. చికిత్స : మీ సమస్యకు ఈ కింద సూచించిన విధంగా చికిత్స చేయవచ్చు. అవి... 1. మీరు నికెల్‌తో చేసిన కృత్రిమ ఆభరణాలు, రింగులు, దిద్దులు ధరించకండి. 2. మీరు మొమెటజోన్ ఉన్న ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి కాస్త తక్కువ పాళ్లు కార్టికోస్టెరాయిడ్ కలిసి ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్న చోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాయండి. 3. అప్పటికీ మీకు ఉపశమనం కలగకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. జుట్టు చివరలు చిట్లుతున్నాయి... ఏం చేయాలి? నా వయసు 26 ఏళ్లు. నేను వర్క్‌ప్లేస్‌కు బైక్‌పై వెళ్తుంటాను. నా ఒక మోస్తరు జడ (మీడియమ్ లెంత్ హెయిర్) ఉంది. నేను హెల్మెట్ వాడుతున్నాను. హెల్మెట్‌కు బయట ఉండే జుట్టు దుమ్ముకూ, ఎండకూ ఎక్స్పోజ్ అవుతోంది. నా జుట్టు చివర్లు చిట్లుతున్నాయి. దాంతో జుట్టు అసహ్యంగా కనిపిస్తోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – శిరీష, హైదరాబాద్ మీరు చెప్పినట్లుగా వెంట్రుకల చివర్లు చిట్లడానికి మూడు అంశాలు కలిసి తమ ప్రభావం చూపుతాయి. అవి... దుమ్ము, కాలుష్యం, ఎండ. ఈ అంశాల దుష్ప్రభావం జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. మీ సమస్య తగ్గడానికి కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. ♦ టూవీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలను కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోండి. ♦ రోజు విడిచి రోజు తల స్నానం చేయండి. తలస్నానం చేయడానికి మైల్డ్ షాంపూ మాత్రమే ఉపయోగించండి. ♦ తలస్నానం తర్వాత మీ జుట్టు పూర్తిగా ఆరకముందే ఈ కింద పేర్కొన పదార్థాలు ఉండే ‘హెయిర్ సీరమ్’ రాయండి. అవి... ♦ డైమిథికోన్ ♦ ట్రైజిలోగ్జేన్ ♦ విటమిన్ ఈ ఎసిటేట్ ♦ అహోబా ఆయిల్ ♦ ఆలివ్ ఆయిల్ ♦ ఆల్మండ్ ఆయిల్. పైన పేర్కొన్న సీరమ్ మీ వెంట్రుకలకు దుమ్ము, అల్ట్రావయొలెట్ కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది. దుస్తులు కవర్‌కాని చోట్ల చర్మం డల్‌గా...! నా వయసు 16 ఏళ్లు. నేను సెల్వార్, కమీజ్ లాంటి దుస్తులు ఎక్కువగా ధరిస్తుంటాను. అయితే స్వీల్లెస్ లాంటివి వేసుకునే సమయంలో ఒక సమస్య ఎదురవుతుంది. నా దుస్తులు కప్పి ఉండే ప్రాంతం తెల్లగానూ, మిగతా ప్రాంతం కాస్త వన్నె తక్కువగానూ కనిపిస్తుంది. నా మోచేతి కింది భాగాలు కూడా... దుస్తులు కప్పి ఉండే భాగాల్లాగే నిగనిగలాడుతూ, మెరుస్తూ కనిపించాలంటే ఏం చేయాలో చెప్పండి. – సరిత, విశాఖపట్నం శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు తమ తేమను కోల్పోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... ♦ సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి. ♦ సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. ప్రతి మూడు గంటలకోసారి ఇలా సన్‌స్క్రీన్ రాసుకోవడం చేస్తూ ఉండాలి. ♦ సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా మేనిభాగాలకు కూడా అదే నిగారింపు, మెరుపు వస్తుంది. ♦ గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో మీ చర్మంపై పూసుకోండి. ♦ పై సూచనలు పాటించినా ఇంకా మేనిపై ఆ తేడాలు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి. - డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ ,చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
ఫ్యామిలీ హెల్త్ కౌన్సెలింగ్
డర్మటాలజీ కౌన్సెలింగ్ ఎండ పడే చోట్లా ఫెయిర్‌గా కావాలంటే...? నా వయసు 18 ఏళ్లు. నా ఒంటిలో దుస్తులు కవర్ చేస్తున్న ప్రాంతం తెల్లగానే ఉంది. మిగతాచోట్ల నల్లగా ఉంది. కనిపిస్తుంది. ఈ దుస్తులు కవర్ చేయని చేతులు వంటి భాగాలు కూడా నిగారింపుతో కనిపించడానికి తగిన సూచనలు ఇవ్వండి. – సంజన, హైదరాబాద్ శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు నల్లబడకుండా ఉండటానికి సూచనలు ఇవి... - సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి. - సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల ప్రతి మూడు గంటలకోసారి 50 ఎస్పీఎఫ్ ఉండే సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. - సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా దేహానికీ అదే నిగారింపు వస్తుంది - గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళ మీ చర్మంపై పూసుకోండి. - పై సూచనలు పాటించినా ప్రయోజనం కనిపించకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి. వేలిపై దురద, గీరుకుంటే నలుపు... ఏం చేయాలి? నా కుడి చేతి మధ్యవేలిపై వెంట్రుకలు ఉండే భాగంలో తీవ్రమైన దురద వస్తోంది. దాంతో అక్కడ గీరుకున్న కొద్దీ అక్కడి చర్మం నల్లబారిపోయింది. నాకు తగిన పరిష్కారం చూపండి. – జగదీష్‌ప్రసాద్, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఆ భాగంలో బహుశా మీకు అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చిందేమోనని అనిపిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అక్కడ ఉంగరం ధరించడం లేదా మీరు వాడుతున్న హ్యాండ్ వాష్ కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు కారణాలు కావచ్చు, మీకు దేనివల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి దానికి దూరంగా ఉండటం నివారణ అంశాల్లో ప్రధానమైనది. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ కింది సూచనలు పాటించండి. - ప్రతిరోజూ మీకు దురద వస్తున్న భాగంలో మాయిశ్చరైజింగ్ క్రీమును రోజుకు రెండుసార్లు రాయండి. - మెమటోజోన్ ఫ్యూరోయేట్ లాంటి మాడరేట్ కార్టికోస్టెరాయిడ్ క్రీమ్‌ను ప్రతిరోజూ మీకు దురద వస్తున్న ప్రాంతంలో రాయండి. దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున 3–5 రోజుల పాటు రాయాలి. అప్పటికీ దురద రావడం తగ్గకపోతే ఒకసారి మీ డర్మటాలజిస్ట్‌కు చూపించండి. మొటిమలు విపరీతంగా వస్తున్నాయి... తగ్గేదెలా? నా వయసు 19 ఏళ్లు. నా ముఖం మీద మొటిమలు, మచ్చలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా తగ్గడం లేదు. నేను బెట్నోవేట్ అనే క్రీమ్ వాడుతున్నాను. దాంతోపాటు ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్ కూడా తీసుకుంటున్నాను. అయినా ఎలాంటి మార్పూ రావడం లేదు. దయచేసి మొటిమలు, మచ్చలు తగ్గడానికి నేనేం చేయాలో సూచించండి. – కె. రవి, విశాఖపట్నం మీ వయసు వారిలో ఇలా మొటిమలు రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. ఈ వయసు పిల్లల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ల పాళ్లు పెరగడం వల్ల చర్మంపై మొటిమలు రావడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మీ విషయంలో ఇది స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నే లా అనిపిస్తోంది. మీరు బెట్నోవేట్ క్రీమ్ రాస్తున్నట్లు చెబుతున్నారు. బెట్నోవేట్ అనే క్రీమ్‌లో స్టెరాయిడ్ ఉంటుంది. దీనిలోని స్టెరాయిడ్ వల్ల మొదట్లో కొంచెం ఫలితం కనిపించినట్లు అనిపించినా... ఆ తర్వాత మొండిమొటిమలు (ఒక పట్టాన తగ్గనివి) వస్తాయి. అందుకే మీరు ఈ కింది సూచనలు పాటించండి. - మొదట బెట్నోవేట్ క్రీమ్ వాడటాన్ని ఆపేయండి. - క్లిండామైసిన్ ప్లస్ అడాపలీన్ కాంబినేషన్‌తో తయారైన క్రీమ్‌ను రోజూ రాత్రిపూట మొటిమలపై రాసుకొని పడుకోండి. - అజిథ్రోమైసిన్–500 ఎంజీ క్యాప్సూల్స్‌ను వరసగా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకోండి. ఇలా మూడు వారాలు వేసుకోవాలి. అంటే మొదటివారం సోమ, మంగళ, బుధ వారాలు తీసుకున్నారనుకోండి. దీన్నే రెండో వారం, మూడోవారం కూడా కొనసాగించాలి. ఈ అజిథ్రోమైసిన్ క్యాప్సూల్‌ను ఖాళీ కడుపుతో అంటే భోజనానికి ముందుగానీ... ఒకవేళ భోజనం చేస్తే... రెండు గంటల తర్వాత గానీ వేసుకోవాలి. - మీరు వాడుతున్న ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్‌ను అలాగే కొనసాగించండి. - అప్పటికీ మొటిమలు తగ్గకపోతే కాస్త అడ్వాన్స్డ్ చికిత్సలైన సాల్సిలిక్ యాసిడ్ పీలింగ్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రెండువారాలకు ఒకసారి చొప్పున కనీసం ఆరు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. - ఒకవేళ మీ మొటిమల వల్ల ముఖంపై గుంటలు పడినట్లుగా ఉంటే, వాటిని తొలగించడానికి ఫ్రాక్షనల్ లేజర్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. -డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్ -
తడి దుస్తులు వద్దు
డెర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 34 ఏళ్లు. బైక్‌పై ఆఫీసుకు వస్తున్నాను. ఒక్కోసారి తడిగా ఉన్న అండర్‌వేర్‌నే తొడుక్కొని వస్తున్నాను. నడుము కింద చోట చర్మం మడతలు పడే ప్రదేశాల్లో ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ దురదగా కూడా ఉంటోంది. ఈ సమస్య నన్ను తరచూ వేధిస్తోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - నవీన్‌సుందర్, ఏలూరు మీ లక్షణాలను బట్టి మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినాఫిన్ కాంబినేషన్ ఉన్న క్రీమును 10 రోజులపాటు ఉదయం, సాయంత్రం రాయాలి. ఆ తర్వాత ప్లెయిన్ టర్బినఫిన్ ఉన్న క్రీము మరో పదిరోజుల పాటు ఉదయం, సాయంత్రం రాయాలి. దీంతోపాటు మీరు ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. తడి అండర్‌వేర్‌ను ఎప్పుడూ ధరించవద్దు. - డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్,త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్ -
నా చర్మం... నిస్తేజం!
డెర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. వాతావరణం మారినప్పుడల్లా నా చర్మం కాస్త నిస్తేజంగా అనిపిస్తోంది. నా చర్మం నిగారింపుతో ఉండటానికి తగిన జాగ్రత్తలు చెప్పండి. - సుష్మిత, నిజామాబాద్ శరీరంలోని అతి పెద్ద అవయవం చర్మమే. ఇది శరీరాన్ని కప్పి ఉంచే రక్షణ కవచం వంటిది. బయటి నుంచి వచ్చే ప్రతి ఒత్తిడిని ముందుగా భరించేది చర్మమే. చర్మం సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటుంది. అది... సాధారణ చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం, కాంబినేషన్ చర్మం పొడిచర్మం సాధారణంగా పొడిబారిపోయి ఉంటుంది. ఇలాంటి చర్మతత్వం కలిగిన వారిలో ముడుతలు త్వరగా వస్తాయి. వీళ్లు తప్పనిసరిగా చర్మంలోని తేమను నిలిపి ఉంచడం కోసం మాయిశ్చరైజర్లను వాడాలి జిడ్డు చర్మం ఉన్నవారి మేను కాస్తంత జిడ్డుగా ఉంటుంది. వీళ్లలో చర్మరంధ్రాలు కాస్తంత స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఉంటాయి. కొంతమందిలో మొటిమలు రావడం కూడా చాలా సాధారణం కాంబినేషన్ చర్మం ఉన్నవారిలో ముఖంలోని కొన్ని భాగాలు... ముఖ్యంగా బుగ్గల్లోని కొంతభాగం, ముక్కు, గడ్డం వంటివి జిడ్డుగా కనిపిస్తుంటాయి. మిగతా భాగాలు పొడిబారినట్లుగా ఉంటాయి సాధారణ చర్మం కలిగిన వారిలో మరీ జిడ్డుగానూ, మరీ పొడిగానూ లేకుండా చర్మం సాధారణంగా ఉంటుంది. చర్మ సంరక్షణ కోసం కొన్ని సూచనలు... పొడి చర్మం ఉన్న వారికి చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో కొంచెం సమస్యలు తక్కువేనని చెప్పాలి. అయినప్పటికీ వీళ్లు మాయిశ్చరైజర్లు వాడటం మాత్రం మానకూడదు. ఎస్పీఎఫ్ 30 కలిగిన సన్‌స్క్రీన్ వాడటం తప్పనిసరి. జిడ్డు చర్మం కలిగిన వారికి ఎండాలంలో చర్మంపై జిడ్డు పెరిగినట్లుగా ఉంటుంది. చెమటతో సమస్య మరింత ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. వీరు వేడిమి ఉన్న వాతావరణంలో తరచూ ముఖాన్ని నీటితో కడుక్కుంటూ ఉండాలి. మాయిశ్చరైజర్లు, సన్‌స్క్రీన్ తప్పక వాడాలి. పొడి చర్మం ఉన్నవారు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి ఇక ఏ రకమైన చర్మం ఉన్నవారైనా నీళ్లు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా ఉండే పుచ్చపండ్ల వంటి తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. సమతులమైన ఆహారం తీసుకోవాలి. - డాక్టర్ స్వప్న ప్రియ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
డర్మటాలజీ కౌన్సెలింగ్
నా చర్మం కాస్త డల్‌గా ఉంటోంది. నేను తినే ఆహార పదార్థాల్లో చర్మానికి ఏవైనా కీడు చేసేవి ఉన్నాయేమో అనిపిస్తోంది. మేనికి మేలు చేయని ఆహారాల గురించి వివరిస్తే... వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. దయచేసి చెప్పండి. - సులోచన, హైదరాబాద్ ఈ కింద పేర్కొన్న ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే చర్మానికి అంతగా మేలు జరగదు. పైగా మితిమీరి తీసుకుంటే కీడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. అందుకే ఇవి తీసుకునే సమయంలో విచక్షణతో ఉండాలి. ఈ ఆహారం వివరాలివి... కాఫీ, టీ, శీతలపానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌లలో కెఫిన్ పాళ్లు ఎక్కువ. ఇవి చర్మం నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారి కనిపించేలా చేస్తాయి. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలైన చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు తీసుకోవడం ఇన్ఫ్లమేషన్ అవకాశాలను పెంచుతాయి. తీపి ఎక్కువగా ఉండే ఆహారంవల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్డ్ ఫుడ్‌లలో అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ. అవి చర్మం త్వరగా ముడుతలు పడేందుకు దోహదం చేస్తాయి. నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్లలో ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం మేనికి మంచిది కాదు. డాక్టర్ మేఘనారెడ్డి కె. కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్,హైదరాబాద్ -
డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 22. అయినా నా చర్మం ఎండిపోయినట్లుగా ఉంటోంది. ఆహారంలో మార్పులతో మేను మెరిసేలా చేయడానికి సూచనలు ఇవ్వండి. - సౌమ్య, జనగామ చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి మేను మెరిసేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ఈ పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో వల్ల హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తాయి. నేను కాస్త చాయనలుపుగా ఉంటాను. మార్కెట్లో దొరికే ఫెయిర్‌నెస్ క్రీములు వాడాలనుకుంటున్నాను. అవి వాడేముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? - శ్వేత, హైదరాబాద్ సాధారణంగా తెల్లగా కనిపించడం కోసం ఉపయోగించే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లతో చాలా వరకు ప్రమాదం ఉండదు. కానీ వాటిని వాడే ముందర మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి వాడబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను చర్మంపై ఎక్కడైనా (చేతికి అయితే మంచిది) కొద్దిగా ప్యాచ్‌లాగా రాసి... దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని తెలుసుకున్న తర్వాతే వాడండి ఏదైనా క్రీమ్ ఎంపిక తర్వాత ఇలా టెస్ట్ చేసుకోకపోతే కొన్నిసార్లు కొందరిలో కాంటాక్ట్ డర్మటైటిస్, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఇలా ప్యాచ్‌లా రాసుకొని పరీక్షించడం వల్ల కొన్ని ప్రమాదాలను ముందే నివారించవచ్చని తెలుసుకోండి. - డాక్టర్ మేఘనారెడ్డి కె. కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్,హైదరాబాద్