డర్మటాలజీ కౌన్సెలింగ్ | Dermatology Counseling | Sakshi
Sakshi News home page

డర్మటాలజీ కౌన్సెలింగ్

Published Sun, May 10 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

Dermatology Counseling

నా వయసు 22. అయినా నా చర్మం ఎండిపోయినట్లుగా ఉంటోంది. ఆహారంలో మార్పులతో మేను మెరిసేలా చేయడానికి సూచనలు ఇవ్వండి.  - సౌమ్య, జనగామ
చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి మేను మెరిసేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ.

ఈ పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్, అవకాడో వల్ల  హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తాయి.  

నేను కాస్త చాయనలుపుగా ఉంటాను. మార్కెట్‌లో దొరికే ఫెయిర్‌నెస్ క్రీములు వాడాలనుకుంటున్నాను. అవి వాడేముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?  
- శ్వేత, హైదరాబాద్

సాధారణంగా తెల్లగా కనిపించడం కోసం ఉపయోగించే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లతో చాలా వరకు ప్రమాదం ఉండదు. కానీ వాటిని వాడే ముందర మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి  వాడబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను చర్మంపై ఎక్కడైనా (చేతికి అయితే మంచిది) కొద్దిగా ప్యాచ్‌లాగా రాసి... దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని తెలుసుకున్న తర్వాతే వాడండి  ఏదైనా క్రీమ్ ఎంపిక తర్వాత ఇలా టెస్ట్ చేసుకోకపోతే కొన్నిసార్లు కొందరిలో కాంటాక్ట్ డర్మటైటిస్, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఇలా ప్యాచ్‌లా రాసుకొని పరీక్షించడం వల్ల కొన్ని ప్రమాదాలను ముందే నివారించవచ్చని తెలుసుకోండి.

- డాక్టర్ మేఘనారెడ్డి కె. కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్‌డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్,హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement