
‘అబ్బబ్బా! ఎండలు మండిపోతున్నాయి’ అని ఇంట్లో కూర్చొనే అపసోపాలు పడుతుంటారు చాలామంది. అలాంటిది ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడడం సామాన్య విషయం కాదు. కాని సామాన్యులకు తప్పదు. తనను తాను సామాజిక కార్యకర్తగా పరిచయం చేసుకునే లక్నోకు చెందిన ఖుషీ పాండే వీధి వీధి తిరుగుతూ పండ్లు, కూరగాయలు అమ్ముకునేవాళ్లకు, రిక్షా కార్మికులకు కాటన్ టవల్స్ ఇవ్వడంతో పాటు ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది.
‘నో నీడ్ టు వర్రీ ఎబౌట్ ది హీట్’ కాప్షన్‌తో కూడిన ఖుషీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొద్ది సమయంలోనే 5.15 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మీ వీడియో నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసింది. నేను టోపీలు పంచాలనుకున్నాను. ఈ వీడియో చూసిన తరువాత కాటన్ టవల్స్ బెటర్ అనిపించింది. తలతోపాటు మెడను కూడా కవర్ చేస్తాయి’ అని ఒక యూజర్ స్పందించాడు.