Pandey
-
Khushi Pandey: మండే ఎండలు కాస్త జాగ్రత్త
‘అబ్బబ్బా! ఎండలు మండిపోతున్నాయి’ అని ఇంట్లో కూర్చొనే అపసోపాలు పడుతుంటారు చాలామంది. అలాంటిది ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడడం సామాన్య విషయం కాదు. కాని సామాన్యులకు తప్పదు. తనను తాను సామాజిక కార్యకర్తగా పరిచయం చేసుకునే లక్నోకు చెందిన ఖుషీ పాండే వీధి వీధి తిరుగుతూ పండ్లు, కూరగాయలు అమ్ముకునేవాళ్లకు, రిక్షా కార్మికులకు కాటన్ టవల్స్ ఇవ్వడంతో పాటు ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది. ‘నో నీడ్ టు వర్రీ ఎబౌట్ ది హీట్’ కాప్షన్‌తో కూడిన ఖుషీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొద్ది సమయంలోనే 5.15 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మీ వీడియో నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నేను టోపీలు పంచాలనుకున్నాను. ఈ వీడియో చూసిన తరువాత కాటన్ టవల్స్ బెటర్ అనిపించింది. తలతోపాటు మెడను కూడా కవర్ చేస్తాయి’ అని ఒక యూజర్ స్పందించాడు. -
పరివర్తన దశలో కశ్మీర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం పెరుగుతోందని 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు. లోయలో ఉగ్రవాదం ఇదివరకటి ఆకర్షణ కోల్పోయిందనీ, ప్రస్తుతం పరిస్థితులు పరివర్తన దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. కశ్మీర్ యువత, ముఖ్యంగా 20–25 ఏళ్ల వారు హింసతో సాధించేదేమీ లేదన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. దీంతో, తాము చేస్తున్నది తప్పో, ఒప్పో తెలియని 16–19 ఏళ్ల టీనేజర్లను ఉగ్రవాదం ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కొత్త రిక్రూట్మెంట్లు 2021లో మూడో వంతుకు అంటే, 142కు తగ్గి పోయాయని చెప్పారు. అక్రమ చొరబాట్లు తగ్గాయి. స్థానికుల సహకారంతో నిఘా వ్యవస్థ బలోపేతమైంది. ఫలితంగా గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 330 మంది ఉగ్రవాదులు హతం కావడమో, లొంగిపోవడమో జరిగిందన్నారు. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని డీపీ పాండే విశ్లేషించారు. లోయలో మిగతా ఉగ్రవాదులకు కూడా సహకారం అందకుండా పోయే రోజు త్వరలోనే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2021లో 151 మంది స్థానికులు, 20 మంది పాకిస్తానీయులు కలిపి మొత్తం 171 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 10 మంది పాకిస్తానీయులతో కలిపి 45 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు గణాంకాలను వెల్లడించారు. గత ఏడాది 87 మంది ఉగ్రవాదులు, లొంగిపోవడమో, పట్టుబడటమో జరగ్గా ఈ ఏడాది 27 మంది పట్టుబడ్డారని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు. -
హక్కుల భంగం.. ఇదా మీ తీరు?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! పెద్ద మార్పు ట్యునీషియా నూతన ప్రధానమంత్రిగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, జియాలజిస్ట్ నజ్లా బూడెన్ రమధానే నియమితులయ్యారు. దీనితో అరబ్ ప్రపంచంలో మహిళను ప్రధాన మంత్రిని చేసిన మొదటి దేశంగా ట్యునిషీయా నిలిచింది. – అర్షియా మాలిక్, రచయిత అవసరమైన పోరాటం మూడేళ్ల తర్వాత ఇండియాలోని మీటూ ఉద్యమాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎక్కువగా నిరాశ వైపే మనసు మొగ్గు తోంది. కానీ దాని అన్ని లోపాలతో కలుపుకొని అది విలువైన ఉద్యమం. – నమితా భండారే, జర్నలిస్ట్ ఇదా మీ తీరు? హాథ్రస్ అత్యాచార బాధితురాలిని బలవంతంగా దహనం చేయడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబం సూర్యాస్తమయం లోగా ఖననం కావాలని కోరుకుంది; దహనం కాదు; ఎందుకంటే ఆమె అవివాహిత కాబట్టి. ‘హిందూ విశ్వాసాల’ పట్ల ఎంతో పట్టింపు ఉన్న ఉత్తరప్రదేశ్ అధికార వ్యవస్థ బాధితురాలి కుటుంబ నమ్మకాలను, రాజ్యాంగాన్ని బాహాటంగా తోసిపుచ్చింది. ఇదంతా కూడా ‘చట్టం’ పేరు మీదుగానే జరిగింది. – తనుశ్రీ పాండే, జర్నలిస్ట్ హక్కుల భంగం నమ్మండి, నమ్మకపోండి. గుజరాత్‌లోని మహేసాణా జిల్లాలోకి ప్రవేశించడానికి నన్ను ఆరేళ్లుగా అనుమతించడం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నాకు హామీ ఇచ్చిన నా స్వేచ్ఛా సంచార హక్కు ఏమైనట్టు? – హార్దిక్ పటేల్, కాంగ్రెస్ నాయకుడు టాటా ఎయిర్ ఇంతకుముందు చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. దానికి ఉన్న అన్ని సమస్యలను పక్కన పెడితే, ఎయిర్ ఇండియా బహుశా విమానం లోపలి భోజనం విషయంలోనూ; దురుసైన ప్రయాణీకుల మూకతో తియ్యగా వ్యవహరించే సర్వీసులోనూ అత్యుత్తమం. టాటాల ఆధ్వర్యంలో అది మరింత మెరుగవుతుందని ఆశిస్తాను. – వీర్ దాస్, కమెడియన్ అందుకా సంతోషం? అన్నట్టూ, పెట్రోలు ధరలు వరుసగా రెండు రోజుల పాటు పెరిగాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఏదీ నియం త్రణలో లేదు. అయినా వాళ్ల ఓటర్లు సంతోషంగా ఉన్నారు; ఎందుకంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి. – సంగీతా నంబీ, రచయిత్రి మాట మరిచారా? పాశ్చాత్య దేశాలు తలుచుకుంటే ఇంకా బాగా చేయగలవు. యూరోపియన్ యూనియన్ దేశాలు కేవలం 4.4 కోట్ల డోసుల కరోనా వైరస్ టీకాలను మాత్రమే మిగతా ప్రపంచానికి పంపించాయి. సెప్టెంబర్ 30 నాటి ఒక నివేదిక మేరకు, ఆ దేశాలు పంచుకుంటామని చేసిన 50 కోట్ల డోసుల వాగ్దానంలో ఇది తొమ్మిది శాతం మాత్రమే. – నికోలా స్మిత్, జర్నలిస్ట్ -
చంద్రబాబూ ..రాజధానికి భూములెవరిచ్చారు
-
బతికొచ్చింది
హైదరాబాద్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్.. ఇంటర్నేషనల్ అరైవల్స్. గుంపులు గుంపులుగా జనం.. ట్రాలీలు ట్రాలీలుగా లగేజ్‌తో బయటకు వస్తున్నారు. వాళ్లలో ఓ నడివయసు స్త్రీ కూడా ఉంది. ఆకుపచ్చ రంగు సల్వార్ కమీజ్‌తో బేలగా ట్రాలీని తోసుకుంటూ వచ్చింది. ఆ మొహంలో అలసట కనిపిస్తోంది. ఇంతలో ఆమెను చేరుకోవాల్సిన వాళ్లు చేరుకున్నారు. అక్కున చేర్చుకున్నారు. నీళ్ల సీసా అందివ్వగానే ఒక్క గుక్కన ఆ నీళ్లను తాగేసింది. ఆ ఒక్క గుక్కతో.. గొంతు దప్పికే కాదు, సొంతగడ్డను చేరాలనే పద్మ ఏడేళ్ల దాహమూ తీరినట్టయింది. ‘‘టిఫిన్ ఏం తింటారు?’’ అంటే.. ‘‘మనసు, కడుపు నిండినట్టయింది. ఏమొద్దు’’ అంది కళ్లనిండా నీళ్లతో. ‘‘కాస్త ఎంగిలి పడండి’’ అని బలవంతం చేస్తే.. ‘‘ఏడేళ్ల నుంచి ఇడ్లీ తినలేదు. అది ఇప్పించండి’’ అంది మొహమాటంగా. ఎప్పుడో.. బిడ్డకు ఏడేళ్ల వయసున్నప్పుడు బతుకుతెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లింది పద్మ. దాదాపు ఏడేళ్లు ‘చెర’లో ఉంది. బిడ్డను గుండెకు హత్తుకొని తనివి తీరా ఏడ్వాలి. అదే ఇప్పుడు ఆమె తొందర. నాలుగు రాళ్ల కోసం ఎడారికి బల్ల పద్మ పాండే స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం, బల్లపేట. ఒక్కతే కూతురు. పెయింటర్ అయిన శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఓ కూతురు పుట్టింది. శ్రీనివాస్‌కు ఊళ్లో పెద్దగా పనిలేదు. ‘దుబాయ్‌లో పని ఉంది. రూపాయల్లో కంటే దీరమ్స్‌లో బాగా సంపాదించొచ్చు’ అని బల్లపేటలో అప్పటికే గల్ఫ్‌లో ఉంటున్నవాళ్లు చెప్పారు. అతడికి ఆశ కలిగింది. దుబాయ్ వెళ్లాడు. అలాగే పద్మ. అంతకుముందే ఆ ఊరి నుంచి డొమెస్టిక్ వర్కర్స్‌గా (పనిమనుషులుగా) ఎడారిబాట పట్టిన వాళ్లు అక్కడ సంపాదన బాగా ఉంటుందని ఆమెకు చెప్పారు. భూమి కొనుక్కుందాం.. ఇల్లు కట్టుకుందాం.. బిడ్డను బాగా చదివిద్దాం.. అనుకున్నారు పద్మ, శ్రీనివాస్‌లు. భార్యను బెహ్రెయిన్ వెళ్లమని చెప్పాడు భర్త. వెళ్లి రెండేళ్లు ఉండి వచ్చింది. కొంచెం సంపాదించుకుంది. ఓ ఆర్నెల్లకు దుబాయ్‌కి అవకాశం వస్తే దుబాయ్‌కీ వెళ్లింది. కాని బెహ్రెయిన్లా లేదు.. అక్కడ తను ఉంటున్న షేక్ ఇంట్లో పరిస్థితి. హింసపెట్టేవాళ్లు. ఉండలేక ఇండియా వచ్చేసింది. మళ్లీ ఆర్నెల్లకి కువైట్‌కు వెళ్లే చాన్స్ దొరికింది. వెళ్లింది. వేధింపులు సాధింపులే జీతం! కువైట్‌లో ఓ బాబా (షేక్) ఇంట్లో పనిమనిషిగా కొలువు. బాబా చాలా మంచివాడు. ఏడాదిన్నర పాటు జీతం బాగానే ఇచ్చాడు. బాగా చూసుకునేవాడు కూడా. కాని కాలం అలా సాగలేదు. బాబా చనిపోయాడు. పద్మ పరిస్థితి తలకిందులైంది. నిజానికి ఆమెకు రెండేళ్లే ఆ ఇంట్లో వర్క్ పర్మిట్ వీసా ఉంది. బాబా చనిపోయేనాటికి రెండేళ్లు పూర్తికావొచ్చాయి. ఆమెను తిరిగి ఇండియాకు పంపించేయాలి. అయితే బాబా భార్య అలా చేయలేదు. పద్మను పంపించకపోగా ఆమెను వేధించడం మొదలుపెట్టింది. జీతం ఇవ్వడం మానేసింది. రోజుకు ఒక్కపూటే తిండి. ఇండియా నుంచి తనవాళ్లు ఫోన్ చేసినా.. తనకు ఫోన్ చేయాలనిపించినా ఫోన్ ఇచ్చేది కాదు. యజమాను రాలు ఇంకో పెళ్లి చేసుకుంది. ఆమె పెట్టే టార్చర్‌కు కొత్తగా వచ్చిన షేక్, యజమానురాలి కొడుకూ తోడయ్యారు. కొట్టేవాళ్లు. తిట్టేవాళ్లు. ఇంట్లోంచి బయటకు వెళ్లనీయకుండా కాపలా కాసేవారు. కూరలు కోసే చాకును వేడి చేసి ఒంటి మీద వాతలు పెట్టేవాళ్లు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అయిదేళ్లు గడిపింది. కూతురుని, భర్తను, తన తల్లిదండ్రులు, అత్తమామలను తలచుకుంటూ ఏడ్చేది. పద్మ మీద బెంగతో వాళ్ల నాన్న మంచం పట్టి కన్నుమూశాడు. ఈ విషయమూ ఆమెకు తెలియదు. తాళం చెవి బతికించింది! ఓ రోజు బట్టలు ఆరేసి వచ్చిన పద్మకు టీపాయ్ మీద బయటి గుమ్మం తాళంచెవి పడేసి తన గదిలోకి వెళ్తున్న యజమానురాలి కూతురు కనిపించింది. ఆ అమ్మాయి గది తలుపేసుకోగానే.. చివికిపోయిన నాలుగు జతల దుస్తులను తన బ్యాగ్‌లో కుక్కేసుకొని ఆ తాళంచెవితో గుమ్మం తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. అప్పటికే ఒంటినిండా గాయాలతో, నీరసంగా ఉంది. ఏ దారో తెలియదు. ఎక్కడికి చేరుకోవాలో అంతకన్నా తెలియదు. పరిగెత్తి పరిగెత్తి అలసి సొమ్మసిల్లిపోయింది ఒకచోట. దారినపోయే వాళ్లు తట్టిలేపి పలకరించారు. అక్కడికి వచ్చిన ఓ కువైట్ మహిళ ఆమె గురించి తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులకు తన వివరాలు.. యజమాని వేధింపులు అన్నీ చెప్పింది. వాళ్లు కంప్లయింట్ రాసుకున్నారు. తన వాళ్ల నంబర్ ఇచ్చింది. మాట్లాడారు. పద్మను చికిత్స కోసం హాస్పిటల్‌కు పంపారు. ఆ తర్వాత అక్కడున్న ప్రవాసీ భారతీయ సామాజిక కార్యకర్తల సహాయమూ పద్మకు అందింది. వాళ్లందరి సహకారంతోనే చివరికి ఇలా ఇండియాకు వచ్చింది. తన వాళ్లను కలుసుకుంది. దూరపు ఎడారి ఎండమావులతో భ్రమింప చేస్తుంది. కాసుల పంట పండుతుందని ఆశ పుట్టిస్తుంది. వెళితే ఒయాసిస్సు జాడా కూడా కనపడనివ్వక దాహంతో గొంతు పిడుచకట్టుకు పోయేలా తిప్పుతుంది. ఉన్న సొమ్ము ఏజెంట్ చేతిలో పెట్టి సొమ్మసిల్లి ఇల్లు చేరుతారు. కొండంత పేరుకుపోయిన అప్పుల భయంతో మళ్లీ పాత భ్రమతో ఇంకో ఎడారి దేశం పయనం అవుతారు. ఇది నిరంతర ప్రక్రియ. గల్ఫ్ గల్లా గలగలలు వలస బాట పొమ్మని పోరుతుంటాయి. మంచిదే. కానీ ఆచితూచి.. మంచిచెడులు ఆలోచించి.. అన్నీ తెలుసుకుని వెళితేనే లాభమూ.. క్షేమమూ! మళ్లీ ఇక ఏ దేశానికీ పోను! నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నా మీద బెంగతో మానాన్న చనిపోయాడు. చివరిచూపు కాదు కదా, చివరి మాట మాట్లాడే భాగ్యానిక్కూడా నేను నోచుకోలేదు. ఏడేళ్లు బందిఖానాలో ఉన్నా. నా పని నచ్చకపోతే నన్ను పంపించేయండి అని మొత్తుకున్నా. అయినా పంపలేదు. జీతం ఇవ్వలేదు. నా వాళ్లకు దూరమయ్యా. ఆరోగ్యం పాడైంది. ఇక ఎప్పుడూ ఏ దేశానికీ వెళ్లను. నా కూతురు, అమ్మ, మా అత్తమామలు, నా భర్త.. ఇదే నాలోకం. వాళ్లను చూసుకుంటూ ఉంటా. పనిమనుషులుగా గల్ఫ్‌కి వెళ్లేవాళ్లు ముందే ఆ చట్టాలు, ఆ పద్ధతులు, ఆ భాష పట్ల అవగాహన కల్పించుకోవాలి. అన్నీ తెలుసుకునే వెళ్లాలి. – బల్ల పద్మ పాండే – సరస్వతి ర -
పాండే, అపరాజిత్ డబుల్ సెంచరీలు
చెన్నై: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సౌత్‌జోన్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. వెస్ట్‌జోన్‌తో చెపాక్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి సౌత్ జట్టు 152 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసింది. తమిళనాడు క్రికెటర్ బాబా అపరాజిత్ (351 బంతుల్లో 212; 17 ఫోర్లు, 1 సిక్సర్), కర్ణాటక ఆటగాడు మనీష్ పాండే (303 బంతుల్లో 213; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీలతో కదంతొక్కారు. ఈ ఇద్దరి సంచలన బ్యాటింగ్‌తో సౌత్ జోన్ భారీ స్కోరు సాధించింది. రంగరాజన్ (26), కెప్టెన్ వినయ్ కుమార్ (19) క్రీజులో ఉన్నారు. వెస్ట్ బౌలర్లలో ముర్తజా వోహ్రా (2/36) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు.