హార్దిక్ పటేల్, తనుశ్రీ పాండే
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
పెద్ద మార్పు
ట్యునీషియా నూతన ప్రధానమంత్రిగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, జియాలజిస్ట్ నజ్లా బూడెన్ రమధానే నియమితులయ్యారు. దీనితో అరబ్ ప్రపంచంలో మహిళను ప్రధాన మంత్రిని చేసిన మొదటి దేశంగా ట్యునిషీయా నిలిచింది.
– అర్షియా మాలిక్, రచయిత
అవసరమైన పోరాటం
మూడేళ్ల తర్వాత ఇండియాలోని మీటూ ఉద్యమాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎక్కువగా నిరాశ వైపే మనసు మొగ్గు తోంది. కానీ దాని అన్ని లోపాలతో కలుపుకొని అది విలువైన ఉద్యమం.
– నమితా భండారే, జర్నలిస్ట్
ఇదా మీ తీరు?
హాథ్రస్ అత్యాచార బాధితురాలిని బలవంతంగా దహనం చేయడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబం సూర్యాస్తమయం లోగా ఖననం కావాలని కోరుకుంది; దహనం కాదు; ఎందుకంటే ఆమె అవివాహిత కాబట్టి. ‘హిందూ విశ్వాసాల’ పట్ల ఎంతో పట్టింపు ఉన్న ఉత్తరప్రదేశ్ అధికార వ్యవస్థ బాధితురాలి కుటుంబ నమ్మకాలను, రాజ్యాంగాన్ని బాహాటంగా తోసిపుచ్చింది. ఇదంతా కూడా ‘చట్టం’ పేరు మీదుగానే జరిగింది.
– తనుశ్రీ పాండే, జర్నలిస్ట్
హక్కుల భంగం
నమ్మండి, నమ్మకపోండి. గుజరాత్‌లోని మహేసాణా జిల్లాలోకి ప్రవేశించడానికి నన్ను ఆరేళ్లుగా అనుమతించడం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నాకు హామీ ఇచ్చిన నా స్వేచ్ఛా సంచార హక్కు ఏమైనట్టు?
– హార్దిక్ పటేల్, కాంగ్రెస్ నాయకుడు
టాటా ఎయిర్
ఇంతకుముందు చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. దానికి ఉన్న అన్ని సమస్యలను పక్కన పెడితే, ఎయిర్ ఇండియా బహుశా విమానం లోపలి భోజనం విషయంలోనూ; దురుసైన ప్రయాణీకుల మూకతో తియ్యగా వ్యవహరించే సర్వీసులోనూ అత్యుత్తమం. టాటాల ఆధ్వర్యంలో అది మరింత మెరుగవుతుందని ఆశిస్తాను.
– వీర్ దాస్, కమెడియన్
అందుకా సంతోషం?
అన్నట్టూ, పెట్రోలు ధరలు వరుసగా రెండు రోజుల పాటు పెరిగాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఏదీ నియం త్రణలో లేదు. అయినా వాళ్ల ఓటర్లు సంతోషంగా ఉన్నారు; ఎందుకంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి.
– సంగీతా నంబీ, రచయిత్రి
మాట మరిచారా?
పాశ్చాత్య దేశాలు తలుచుకుంటే ఇంకా బాగా చేయగలవు. యూరోపియన్ యూనియన్ దేశాలు కేవలం 4.4 కోట్ల డోసుల కరోనా వైరస్ టీకాలను మాత్రమే మిగతా ప్రపంచానికి పంపించాయి. సెప్టెంబర్ 30 నాటి ఒక నివేదిక మేరకు, ఆ దేశాలు పంచుకుంటామని చేసిన 50 కోట్ల డోసుల వాగ్దానంలో ఇది తొమ్మిది శాతం మాత్రమే.
– నికోలా స్మిత్, జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment