Tanushree
-
హక్కుల భంగం.. ఇదా మీ తీరు?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! పెద్ద మార్పు ట్యునీషియా నూతన ప్రధానమంత్రిగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, జియాలజిస్ట్ నజ్లా బూడెన్ రమధానే నియమితులయ్యారు. దీనితో అరబ్ ప్రపంచంలో మహిళను ప్రధాన మంత్రిని చేసిన మొదటి దేశంగా ట్యునిషీయా నిలిచింది. – అర్షియా మాలిక్, రచయిత అవసరమైన పోరాటం మూడేళ్ల తర్వాత ఇండియాలోని మీటూ ఉద్యమాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎక్కువగా నిరాశ వైపే మనసు మొగ్గు తోంది. కానీ దాని అన్ని లోపాలతో కలుపుకొని అది విలువైన ఉద్యమం. – నమితా భండారే, జర్నలిస్ట్ ఇదా మీ తీరు? హాథ్రస్ అత్యాచార బాధితురాలిని బలవంతంగా దహనం చేయడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబం సూర్యాస్తమయం లోగా ఖననం కావాలని కోరుకుంది; దహనం కాదు; ఎందుకంటే ఆమె అవివాహిత కాబట్టి. ‘హిందూ విశ్వాసాల’ పట్ల ఎంతో పట్టింపు ఉన్న ఉత్తరప్రదేశ్ అధికార వ్యవస్థ బాధితురాలి కుటుంబ నమ్మకాలను, రాజ్యాంగాన్ని బాహాటంగా తోసిపుచ్చింది. ఇదంతా కూడా ‘చట్టం’ పేరు మీదుగానే జరిగింది. – తనుశ్రీ పాండే, జర్నలిస్ట్ హక్కుల భంగం నమ్మండి, నమ్మకపోండి. గుజరాత్‌లోని మహేసాణా జిల్లాలోకి ప్రవేశించడానికి నన్ను ఆరేళ్లుగా అనుమతించడం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నాకు హామీ ఇచ్చిన నా స్వేచ్ఛా సంచార హక్కు ఏమైనట్టు? – హార్దిక్ పటేల్, కాంగ్రెస్ నాయకుడు టాటా ఎయిర్ ఇంతకుముందు చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. దానికి ఉన్న అన్ని సమస్యలను పక్కన పెడితే, ఎయిర్ ఇండియా బహుశా విమానం లోపలి భోజనం విషయంలోనూ; దురుసైన ప్రయాణీకుల మూకతో తియ్యగా వ్యవహరించే సర్వీసులోనూ అత్యుత్తమం. టాటాల ఆధ్వర్యంలో అది మరింత మెరుగవుతుందని ఆశిస్తాను. – వీర్ దాస్, కమెడియన్ అందుకా సంతోషం? అన్నట్టూ, పెట్రోలు ధరలు వరుసగా రెండు రోజుల పాటు పెరిగాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఏదీ నియం త్రణలో లేదు. అయినా వాళ్ల ఓటర్లు సంతోషంగా ఉన్నారు; ఎందుకంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి. – సంగీతా నంబీ, రచయిత్రి మాట మరిచారా? పాశ్చాత్య దేశాలు తలుచుకుంటే ఇంకా బాగా చేయగలవు. యూరోపియన్ యూనియన్ దేశాలు కేవలం 4.4 కోట్ల డోసుల కరోనా వైరస్ టీకాలను మాత్రమే మిగతా ప్రపంచానికి పంపించాయి. సెప్టెంబర్ 30 నాటి ఒక నివేదిక మేరకు, ఆ దేశాలు పంచుకుంటామని చేసిన 50 కోట్ల డోసుల వాగ్దానంలో ఇది తొమ్మిది శాతం మాత్రమే. – నికోలా స్మిత్, జర్నలిస్ట్ -
తేనెలూరే కొవ్వొత్తులు
ఎలక్ట్రిసిటి అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో వీధి దీపాలు, కిరసనాయిల్ బుడ్డి(దీపం) వెలుతురులో... చదువుతోబాటు పనులన్ని చక్కబెట్టేవాళ్లం. ఆ తరువాత కొవ్వొత్తి (క్యాండిల్) అందుబాటులోకి వచ్చాక కిరసనాయిల్ దీపాలు పక్కన పెట్టి క్యాండిల్స్ వాడుతున్నాం. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో పనులు చేసుకోవడం మీదే మన దృష్టంతా ఉంటుంది. కానీ ఆ క్యాండిల్ దేనితో తయారు చేశారు? దానివల్ల మనకేమైనా ప్రమాదం ఉందా? అని ఎవరు ఆలోచిస్తారు కష్టమే కాదా! కానీ ఇలా ఆలోచించిన రాజస్థా¯Œ అమ్మాయి తనుశ్రీ జై¯Œ కొవ్వొత్తులు కూడా కాలుష్యకారకాలని, వాటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించి... ఏకంగా ఇకోఫ్రెండ్లీ క్యాండిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. పర్యావరణానికి హాని చేయని క్యాండిల్స్ తయారు చేస్తూ స్థానికంగా ఉన్న 250 మంది మహిళలకు ఉపాధిని కల్పించడం విశేషం. జైపూర్‌లోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది తనుశ్రీ జై¯Œ . నాన్న ఆర్మీలో పనిచేస్తుండగా, అమ్మ టీచర్. చదువులో చురుకుగా ఉండే తనుశ్రీ 2017లో బీటెక్ కంప్యూటర్స్ పూర్తయ్యాక, ఢిల్లీలోని ఇండియ¯Œ స్కూల్ ఆఫ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (ఐఎస్డీఎమ్)లో మాస్టర్స్ చేసింది. మాస్టర్స్ చేసే సమయంలో ఢిల్లీలోని కాలుష్యభరిత వాతావరణం సరిపడక ఆమెకు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. ప్రారంభంలో పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ సమస్య తీవ్రమవడంతో.. ఆసుపత్రిలో చేరక తప్పలేదు. చికిత్స చేయించుకుని కోలుకుని ఇంటికి వచ్చాక.. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి పీల్చుకోడానికి ప్రయత్నించింది. కానీ అంతా కాలుష్యంతో కూడిన వాతావరణం. దీంతో పర్యావరణంలో ఉన్న కాలుష్య కారకాలను ఎలాగైనా తగ్గించాలనుకుంది. ఈ క్రమంలోనే రసాయనాలతో తయారయ్యే కొవ్వొత్తులు కాలుష్యానికి కారణమతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతిసిద్ధంగా లభించే పదార్థాలతో తయారు చేయాలనుకుంది. తేనె తుట్టెతో... క్యాండిల్స్ తయారీ కంపెనీలన్నీ... క్యాండిల్స్‌ను పారఫి¯Œ తో తయారు చేస్తున్నట్లు తెలుసుకుంది. పారఫి¯Œ లో అధికమొత్తంలో కార్బ¯Œ ఉంటుంది. దాంతో క్యాండిల్స్‌ని వెలిగించినప్పుడు, అవి వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తాయి. ఇది జరగకుండా ఉండాలంటే పారఫి¯Œ తో కాకుండా వేరే పదార్థంతో తయారు చేయాలని నిర్ణయించుకుని... 2018లో ‘నుషౌరా’ పేరుతో పారాఫి¯Œ కు బదులు తేనె తుట్టె నుంచి తీసిన మైనంతో క్యాండిల్స్‌ను రూపొందించడం మొదలుపెట్టింది. లక్షన్నర పెట్టుబడి, పదిమంది మహిళలతో.. సహజసిద్ధమైన మైనం, సువాసన భరిత నూనెలు, దూదితో క్యాండిల్స్ తయారు చేయించింది. గుజరాత్ రైతుల నుంచి మైనాన్ని, సేంద్రియ సాగు రైతుల నుంచి ఆయిల్స్‌ను సేకరిస్తోంది. వివిధ రంగులతో చక్కటి సువాసనతో ఉన్న ఈ క్యాండిల్స్‌కు మంచి ఆదరణ లభించడంతో ప్రస్తుతం ఇరవై రకాల కొవ్వొత్తులను అరవై గ్రాముల నుంచి కేజీ పరిమాణంలో తయారు చేస్తోంది. నుషౌరా క్యాండిల్స్‌ను ఇండియాలోనేగాక కెనడా, అమెరికా, జర్మనీ, ఫ్రా¯Œ ్సలకు ఎగుమతి చేస్తోంది. ఉపాధినిస్తోంది.. క్యాండిల్స్ తయారీలో రాజస్థా¯Œ , మధ్యప్రదేశ్ మహిళలు పాల్గొంటున్నారు. ఈ మహిళలంతా తమ ఇళ్లలో క్యాండిల్స్ రూపొందించి వాటిని తనుశ్రీకి పంపుతారు. క్యాండిల్స్ తయారు చేసిన మహిళలకు పనికి తగ్గ వేతనం ఇస్తోంది. ఈ క్యాండిల్స్ తయారీ ద్వారా ప్రస్తుతం 250 మంది మహిళలకు ఉపాధి దొరుకుతోంది. నుషౌరా క్యాండిల్స్‌ను కొన్నవాళ్లు బంధువులు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వడం.. వారు ఆ క్యాండిల్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీటి గురించి అందరికీ తెలిసి విక్రయాలు బాగా పెరిగాయి. సవ్యంగా క్యాండిల్స్ విక్రయాలు జరుగుతోన్న సమయంలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. దీంతో విక్రయాలు ఆగిపోయాయి. ఆ సమయంలో మూడు పొరలతో కూడిన మాస్కులు, వివిధ రకాల నిల్వ పచ్చళ్లు, చాక్లెట్లు, సబ్బులు, శానిటైజర్లు, డయపర్లు తయారు చేసి విక్రయించేది. ఈ విధంగా మహిళలు ఉపాధిని కోల్పోకుండా చేసింది. పరిస్థితులు ప్రస్తుతం కాస్త కుదుటపడుతుండడంతో మళ్లీ క్యాండిల్స్ తయారీని పెంచింది. -
#మీటూ: స్పందించిన వర్మ
ముంబై : ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశమైన మీటూ ఉద్యమంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. బాలీవుడ్ నటుడు నానా పటెకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసి ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. నానా పటేకర్ షార్ట్ టెంపర్ వ్యక్తి అని కానీ ఒకరిని వేధించాడంటే మాత్రం తను నమ్మనని యూట్యూబ్‌లో ఓ వీడియో ద్వారా స్పష్టం చేశాడు. వీడియోలో ఇంకా ఏమన్నాడంటే.. ‘సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అన్నవి వాస్తవమే. తనుశ్రీ దత్తా సహా పలువురు నటీమణులు ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై మాట్లాడటం అభినందనీయం. తనుశ్రీ దత్తా-నానాపటేకర్ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో నాకు తెలియదు. నానా పటేకర్‌తో చాలాకాలం కలిసి పనిచేశాను. ఆయన షార్ట్ టెంపర్ వ్యక్తి. కానీ నాకు తెలిసి నానా పటేకర్ వ్యక్తిగతంగా ఒకరిని వేధించే వ్యక్తి కాదు. ముంబైకి వెళ్లిన తొలి రోజుల్లో నేను ఓసారి నానాపటేకర్ కు ఫోన్ చేశాను. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేస్తే మనం వెంటనే హలో అంటాం. కానీ ఆయన మాత్రం చెప్పు (బోల్) అని ప్రారంభించారు. సార్ నా పేరు రామ్ గోపాల్ వర్మ. సినిమా డైరెక్టర్ ను. హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పాను. వెంటనే ఇంటికి వచ్చేయ్ అన్నారు. నేను కథ చెబుతుండగా టీ తాగుతావా?అని ఆయన అడిగారు. తాగుతానని చెగానే కిచెన్ చూపించి ఆయనకు కూడా తీసుకురమ్మన్నారు. నాకు టీ చేయడం రాదని చెప్పగానే, ఇంత వయసు వచ్చింది.. ఇంకా టీ చేయడం రాకపోవడం ఏంటి? అని మీ అమ్మకు ఫోన్ కలుపు అని బెదిరించారు. నా తల్లితోనూ ఫోన్ లో మాట్లాడారు. నానాపటేకర్‌ను అర్థం చేసుకుంటే ఆయన్ని అందరూ గౌరవిస్తారు. తనకు తెలిసి నానాపటేకర్ జీవితంలో ఎన్నడూ లైంగిక వేధింపులకు పాల్పడరు. ఆయన గురించి పూర్తిగా తెలియని వ్యక్తులే నానా ప్రవర్తనను పొరపాటుగా అర్థం చేసుకుని ఉండవచ్చు.’ అని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమకు జరిగిన చేదు అనుభవాలను సైతం పంచుకుంటున్నారు. దీంతో భారత్‌లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. &rel=0 -
అల్లాడిపోయిన చిన్నారి తనుశ్రీ
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి నరకయాతన అనుభవించింది. ఈ ప్రమాదంలో చెన్నైకి చెందిన నటేష్ కుటుంబం తీవ్రంగా గాయపడింది. నటేష్ కుమార్తె తనుశ్రీ ముఖమంతా కాలిపోవడంతో ఆమెకు అనంతపురంలోని క్రాంతి ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్యులు చికిత్స చేసే సమయంలో చిన్నారి ఆర్తనాదాలతో ఆస్పత్రి దద్దరిల్లింది. నటేష్ (36) స్వస్థలం చెన్నై. అతను చెన్నైలోని ధనలక్ష్మి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబం తో కలసి మంత్రాలయం వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో నటేష్‌తో పాటూ అతని భార్య విజిత (33), కుమార్తె తనుశ్రీ (5) తీవ్రంగా గాయపడ్డారు. కానీ, ప్రమాదంలో వీరి కుటుంబసభ్యులు సుధ (60), లీల(62), రామనాథన్ (65) చనిపోయినట్లు బంధువులు తెలిపారు. రెండున్నరేళ్ల చిన్నారి సహా ముగ్గురు.. సాక్షి, బెంగళూరు: డాక్టర్ అస్రా తన రెండున్నరేళ్ల కుమారుడైన మహ్మద్, బంధువు ఇబ్రహీంతో కలసి రాయ్‌చూర్ వెళ్లాల్సి ఉంది. రైలు దుర్ఘటనలో మహ్మద్ చనిపోగా మిగిలిన వారి వివరాలు తెలియడం లేదు. వారు కూడా మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఏసీ బోగీలో ప్రమాదం జరిగిందని తెలియగానే విజయ రామ్మూర్తి (63) అనే మహిళ రైలులో నుంచి బయటకు దూకేసింది. దీంతో ఆమె తలకు, నడుం వద్ద గాయాలయ్యాయి. వైద్యులు ఆమె తలకు కుట్లు వేసి చికిత్స అందించారు. ్చనాన్నా.. వస్తున్నా.. అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నాన్నా.. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నా అని చెప్పిన ఆ కొడుకు ఎంతకీ రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. బెంగళూరులోని జయనగర్‌లో ఉంటున్న అనంతపురానికి చెందిన శ్రీలత (26), శ్రీనివాస్ (28) శుక్రవారం రాత్రి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో సొంత ఊరికి బయలుదేరారు. ఇంతలో ఘోర ప్రమాదం జరిగింది. వారి ఫోన్లు పనిచేయడం లేదు. బతిమాలి మృత్యుశకటంలోకి.. సాక్షి, బెంగళూరు: రాయచూరుకు చెందిన సుభాష్‌రెడ్డి (45) కర్ణాటక స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ డెరైక్టర్. శుక్రవారం బెంగళూరులో ‘ఫెడరేషన్’ సభ్యులతో సమావేశమై నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుప్రయాణమయ్యాడు. ఇందుకోసం టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. దీంతో రైల్వే అధికారిని బతిమాలి బీ1 కోచ్‌లో ఓ బెర్త్‌ను సంపాదించాడు. అదే బీ1 కోచ్‌లో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఇతని ఆచూకీ తెలియడం లేదు. అయ్యయ్యో.. శుభలేఖలు అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో షార్ట సర్క్యూట్ జరిగిన బీ1 బోగీలో అగ్నికీలలు ఎగిసిపడినా అక్కడ ఉన్న శుభలేఖలు చెక్కుచెదరలేదు. అయితే వీటిని పంచేందుకు తీసుకెళుతున్న వారు మరణించారా.. గాయాలతో బయటపడ్డారా ? అన్నది తెలియడం లేదు. బెంగళూరుకు చెందిన శాంతిలాల్, శకుంతలబాయి దంపతుల కుమార్తె స్మితకు, నాందేడ్‌కు చెందిన కన్హేలాల్‌జీ పురోహిత్, మనూదేవి దంపతుల కుమారుడు నిఖిల్‌కి వివాహం జరుగనున్నట్లుగా ఆ శుభలేఖల్లో ఉంది. సెలవులకు వస్తూ.. తాండూరు, న్యూస్‌లైన్: సెలవుల్లో భార్యా పిల్లలతో సరదాగా గడిపేందుకు తాండూర్ వస్తున్న ఓ వ్యక్తిని మృత్యువు కబళించింది. కర్ణాటకకు చెందిన కండోభా కులకర్ణి(32) కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. కులకర్ణి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి ఐదేళ్ల క్రితం తాండూరు మండలం కరన్‌కోట్‌కు చెందిన శ్వేతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఓ కార్యక్రమం కోసం శ్వేత తాండూరు వచ్చారు. సెలవులు రావడంతో భార్యా పిల్లలతో గడిపేందుకు కులకర్ణి తాండూరుకు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. బీ-1 బోగిలోని 17వ బెర్తులో కులకర్ణి కూర్చున్నారు. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు బాత్రూమ్కు వెళ్లి.. మంటలు వ్యాపించడంతో సజీవ దహనమయ్యాడు. మరోవైపు తాండూరు మండలం కరన్‌కోట్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో ఎలక్ట్రికల్ విభాగంలో మెకానిక్‌గా పని చేస్తున్న పాట్నాకు చెందిన ప్రతాప్ వినయ్(43) జాడ కూడా తెలియడం లేదు.