ఎలక్ట్రిసిటి అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో వీధి దీపాలు, కిరసనాయిల్ బుడ్డి(దీపం) వెలుతురులో... చదువుతోబాటు పనులన్ని చక్కబెట్టేవాళ్లం. ఆ తరువాత కొవ్వొత్తి (క్యాండిల్) అందుబాటులోకి వచ్చాక కిరసనాయిల్ దీపాలు పక్కన పెట్టి క్యాండిల్స్ వాడుతున్నాం. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో పనులు చేసుకోవడం మీదే మన దృష్టంతా ఉంటుంది. కానీ ఆ క్యాండిల్ దేనితో తయారు చేశారు? దానివల్ల మనకేమైనా ప్రమాదం ఉందా? అని ఎవరు ఆలోచిస్తారు కష్టమే కాదా! కానీ ఇలా ఆలోచించిన రాజస్థా¯Œ అమ్మాయి తనుశ్రీ జై¯Œ కొవ్వొత్తులు కూడా కాలుష్యకారకాలని, వాటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించి... ఏకంగా ఇకోఫ్రెండ్లీ క్యాండిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. పర్యావరణానికి హాని చేయని క్యాండిల్స్ తయారు చేస్తూ స్థానికంగా ఉన్న 250 మంది మహిళలకు ఉపాధిని కల్పించడం విశేషం.
జైపూర్‌లోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది తనుశ్రీ జై¯Œ . నాన్న ఆర్మీలో పనిచేస్తుండగా, అమ్మ టీచర్. చదువులో చురుకుగా ఉండే తనుశ్రీ 2017లో బీటెక్ కంప్యూటర్స్ పూర్తయ్యాక, ఢిల్లీలోని ఇండియ¯Œ స్కూల్ ఆఫ్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌డీఎమ్)లో మాస్టర్స్ చేసింది. మాస్టర్స్ చేసే సమయంలో ఢిల్లీలోని కాలుష్యభరిత వాతావరణం సరిపడక ఆమెకు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. ప్రారంభంలో పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ సమస్య తీవ్రమవడంతో.. ఆసుపత్రిలో చేరక తప్పలేదు. చికిత్స చేయించుకుని కోలుకుని ఇంటికి వచ్చాక.. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి పీల్చుకోడానికి ప్రయత్నించింది. కానీ అంతా కాలుష్యంతో కూడిన వాతావరణం. దీంతో పర్యావరణంలో ఉన్న కాలుష్య కారకాలను ఎలాగైనా తగ్గించాలనుకుంది. ఈ క్రమంలోనే రసాయనాలతో తయారయ్యే కొవ్వొత్తులు కాలుష్యానికి కారణమతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతిసిద్ధంగా లభించే పదార్థాలతో తయారు చేయాలనుకుంది.
తేనె తుట్టెతో...
క్యాండిల్స్ తయారీ కంపెనీలన్నీ... క్యాండిల్స్‌ను పారఫి¯Œ తో తయారు చేస్తున్నట్లు తెలుసుకుంది. పారఫి¯Œ లో అధికమొత్తంలో కార్బ¯Œ ఉంటుంది. దాంతో క్యాండిల్స్‌ని వెలిగించినప్పుడు, అవి వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తాయి. ఇది జరగకుండా ఉండాలంటే పారఫి¯Œ తో కాకుండా వేరే పదార్థంతో తయారు చేయాలని నిర్ణయించుకుని... 2018లో ‘నుషౌరా’ పేరుతో పారాఫి¯Œ కు బదులు తేనె తుట్టె నుంచి తీసిన మైనంతో క్యాండిల్స్‌ను రూపొందించడం మొదలుపెట్టింది. లక్షన్నర పెట్టుబడి, పదిమంది మహిళలతో.. సహజసిద్ధమైన మైనం, సువాసన భరిత నూనెలు, దూదితో క్యాండిల్స్ తయారు చేయించింది. గుజరాత్ రైతుల నుంచి మైనాన్ని, సేంద్రియ సాగు రైతుల నుంచి ఆయిల్స్‌ను సేకరిస్తోంది. వివిధ రంగులతో చక్కటి సువాసనతో ఉన్న ఈ క్యాండిల్స్‌కు మంచి ఆదరణ లభించడంతో ప్రస్తుతం ఇరవై రకాల కొవ్వొత్తులను అరవై గ్రాముల నుంచి కేజీ పరిమాణంలో తయారు చేస్తోంది. నుషౌరా క్యాండిల్స్‌ను ఇండియాలోనేగాక కెనడా, అమెరికా, జర్మనీ, ఫ్రా¯Œ ్సలకు ఎగుమతి చేస్తోంది.
ఉపాధినిస్తోంది..
క్యాండిల్స్ తయారీలో రాజస్థా¯Œ , మధ్యప్రదేశ్ మహిళలు పాల్గొంటున్నారు. ఈ మహిళలంతా తమ ఇళ్లలో క్యాండిల్స్ రూపొందించి వాటిని తనుశ్రీకి పంపుతారు. క్యాండిల్స్ తయారు చేసిన మహిళలకు పనికి తగ్గ వేతనం ఇస్తోంది. ఈ క్యాండిల్స్ తయారీ ద్వారా ప్రస్తుతం 250 మంది మహిళలకు ఉపాధి దొరుకుతోంది. నుషౌరా క్యాండిల్స్‌ను కొన్నవాళ్లు బంధువులు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వడం.. వారు ఆ క్యాండిల్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీటి గురించి అందరికీ తెలిసి విక్రయాలు బాగా పెరిగాయి.
సవ్యంగా క్యాండిల్స్ విక్రయాలు జరుగుతోన్న సమయంలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. దీంతో విక్రయాలు ఆగిపోయాయి. ఆ సమయంలో మూడు పొరలతో కూడిన మాస్కులు, వివిధ రకాల నిల్వ పచ్చళ్లు, చాక్లెట్లు, సబ్బులు, శానిటైజర్లు, డయపర్‌లు తయారు చేసి విక్రయించేది. ఈ విధంగా మహిళలు ఉపాధిని కోల్పోకుండా చేసింది. పరిస్థితులు ప్రస్తుతం కాస్త కుదుటపడుతుండడంతో మళ్లీ క్యాండిల్స్ తయారీని పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment