పాండే, అపరాజిత్ డబుల్ సెంచరీలు | Pandey, Aparajith slam double-hundreds | Sakshi
Sakshi News home page

పాండే, అపరాజిత్ డబుల్ సెంచరీలు

Published Sat, Oct 5 2013 1:30 AM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM

Pandey, Aparajith slam double-hundreds

చెన్నై: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సౌత్‌జోన్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. వెస్ట్‌జోన్‌తో చెపాక్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి సౌత్ జట్టు 152 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసింది.
 
  తమిళనాడు క్రికెటర్ బాబా అపరాజిత్ (351 బంతుల్లో 212; 17 ఫోర్లు, 1 సిక్సర్), కర్ణాటక ఆటగాడు మనీష్ పాండే (303 బంతుల్లో 213; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీలతో కదంతొక్కారు. ఈ ఇద్దరి సంచలన బ్యాటింగ్‌తో సౌత్ జోన్ భారీ స్కోరు సాధించింది. రంగరాజన్ (26), కెప్టెన్ వినయ్ కుమార్ (19) క్రీజులో ఉన్నారు. వెస్ట్ బౌలర్లలో ముర్తజా వోహ్రా (2/36) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement