
వివాహ వంటకాల్లో విందులు ఓ రేంజ్‌లో ఉంటాయి. బాగా డబ్బున్న వాళ్లైతే భోజనంలో లెక్కపెట్టలేనన్ని వెరైటీలతో అతిథులను ఆశ్చర్యపరుస్తారు. కానీ ఇలా ఫిట్‌నెస్‌పై కేర్ తీసుకునే విధంగా ఆతిథ్యం ఇవ్వడం గురించి విన్నారా..?. అలాంటి వినూత్న ఆలోచనకు తెరతీశారు పశ్చిమబెంగాల్‌లోని ఓ కుటుంబం. తమ ఇంట జరిగే వివాహ వేడుకలో పాల్గొనే అతిథులంతా అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావించారో ఏమో..! గానీ భలే అద్భుతంగా మెనూ అందించి విందు ఏర్పాటు చేశారు. వచ్చినవారంతా వారెవవ్వా..ఏం ఉంది ఈ మెనూలో వాటి వివరణ అని మెచ్చుకుంటున్నారు.
ప్రస్తతం ప్రజలంతా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా పడితే అలా తినేందుకు ఇష్టపడటం లేదు. ఏది ఎంతవరకు తింటే మంచిదో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఇలాంటి వివాహ వేడుకలో కూడా వారి డైట్‌కి ఇబ్బంది గలగకుండా జాగ్రత్త తీసుకుంటూ తాము అందించే వంటకాల కేలరీలను సవిరంగా మెనూలో అందించారు.
అంతేగాదు ఈ విందులో నచ్చినవన్నీ తినండి..అలాగే అధిక కేలరీలను బర్న్ చేసుకునేందుకు ఈ వేడుకలో ఏర్పాటు చేసే ఎంటర్‌టైన్‌మెంట్, డ్యాన్స్వంటి కార్యక్రమాల్లో పాల్గొనండి చాలు. జీఎస్టీ ఏం ఉండదూ కూడా అంటూ చమత్కారంగా రాశారు.
ఇక్కడ ఆ మెనూలో ఆరోగ్య స్ప్రుహ తోపాటు, ఆహారం వృధాను నివారించేలా విందును ఆస్వాదిద్దాం అని పిలుపునివ్వడం విశేషం. ఇంకో విషయం కూడా జత చేశారు..ఎంజాయ్ చేద్దామనే వచ్చాం కాబట్టి..దాన్ని మిస్ చేసుకోకుండా కంఫర్ట్‌గా ఉండమని మెనూ చివరలో సూచించారు. అందుకు సంబంధించిన విషయాలను రెడ్డిట్ వినియోగదారుడు నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లంత ఇది వివాహ మెనూ కాదు..'కేలరీల మోమో' అంటూ ప్రశంసిస్తున్నారు.
(చదవండి: 65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?)