అబ్బాయిలు నాన్న షర్ట్ వేసుకుని ‘లేని మీసాలను’ మెలి తిప్పటం, అమ్మాయిలు అమ్మ చీర కట్టుకుని ‘మోయలేని పెద్దరికాన్ని’ అభినయించటం... ప్రతి ఇంట్లోనూ ఉండేదే. ఎదుగుతున్న పిల్లలకు అవి సరదాలు. పెద్దలకు తమ టీనేజ్‌ని గుర్తుకు తెచ్చే మురిపాలు.
పెద్దయ్యాక బాయ్స్ నాన్న ప్యాంటూ షర్టు వేసుకోవటం కనిపించదు కానీ, గర్ల్స్ అమ్మ చీరను కట్టుకుని ఏ ఫంక్షన్‌లోనో బంధు మిత్రులకు సాక్షాత్కరిస్తుంటారు. వధువులు కూడా కొందరు అపురూపంగా దాచి ఉంచిన అమ్మ పెళ్లి నాటి చీరను ధరించి, పీటల మీద కూర్చుంటారు. అదొక సెంటిమెంట్ కూతుళ్లకు.
కానీ నివేషి కాస్త డిఫరెంట్‌గా ఉంది! బహుశా.. నాన్నంటే అఫెక్షన్, అమ్మంటే క్రమశిక్షణలా ఉంది ఈ అమ్మాయికి. తనేం చేసిందో చూడండి! పెళ్లినాటి నాన్న సూట్‌ను బయటికి తీయించి, చిన్న చిన్న మార్పులు చేసి తను తొడుక్కుంది. భారీ బ్రౌన్ టూపీస్ పెళ్లి సూట్‌లో ఉన్న నాన్న ఫొటోను, ఆ సూట్‌ను వేసుకున్న తన ఫొటోను కలిపి ఆ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ‘‘అమ్మాయిలు తమ తల్లి పెళ్లి చీరను కట్టుకుంటారు.
నేను మా నాన్న పెళ్లి సూట్‌ను వేసుకున్నాను’’ అని ఆ క్లిప్‌కు క్యాప్షన్ పెట్టింది. ఇకనేం, లైకుల మీద లైకులు. నివేషి డిజిటల్ క్రియేటర్. తండ్రి సూట్‌ను తనకు సరిపడేలా మార్చటంలోని ఆమె సృజనాత్మక నైపుణ్యాన్ని చూసి, ‘‘మీ కోసమే మీ నాన్న తన పెళ్లి సూట్‌ను ఎంపిక చేసుకున్నట్లు న్నారు..’’ అని ఒక నెటిజెన్ ప్రశంసించారు. మరొకరు.. ‘‘మీరు మీ నాన్నను గర్వపడేలా చేశారు’’ అని కామెంట్ పెట్టారు. చలువ కళ్లద్దాలు ధరించి, సూటులో రెండు చేతులు పెట్టుకుని ఠీవిగా నడిచి వెళుతున్న నివేషి రెట్రో స్టెయిల్ ఎవర్నీ చూపు తిప్పుకోనివ్వటం లేదు!
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment