లండన్ : సరదాకి ఓ క్రికెటర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో పెద్ద కలకలాన్నే రేపింది. హఠాత్తుగా దాన్ని చూసిన వారంతా అది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోటోనేనంటూ పలువురు ట్రోలింగ్ చేయటం మొదలుపెట్టారు. అయితే కొన్ని క్షణాలు నిశితంగా పరిశీలించిన వారికి అది ఆయన కాదని తెలిసిపోతుంది. అయినప్పటికీ ఆ రెండు ఫోటోలతో ఆడేసుకుంటున్నారు.
ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఈ ఉదయం ఓ ఫోటోను తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇందులో ఉన్న మాజీ క్రికెటర్‌ను కనిపెట్టండంటూ ప్రశ్నించాడు. టవల్‌లో ఉన్న ఓ వ్యక్తి విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫోటో అది. అందులో ఉన్నది ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్ అన్నది ఈజీగా చెప్పేయొచ్చు. కానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో హుస్సేన్‌కు కాస్త దగ్గరి పోలికలు ఉన్నాయంటూ కొందరు ఆ ఫోటో క్షణాల్లో షేర్ చేసేశారు. దీంతో సోషల్ మీడియాలో గందరగోళం మొదలైంది.
కొందరు అది పుతిన్ అంటే.. ఇలాంటి బోల్డ్ పనులు చేసే గట్స్ ఆయనకే ఉన్నాయంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. కావాలంటే కంపేర్ చేసుకోండి అంటూ గతంలో పుతిన్ పుణ్య స్నానం చేసిన సమయంలోని అర్ధనగ్నంగా ఫోటోలను ఆధారాలుగా చూపిస్తున్నారు. చాలా మంది మట్టుకు మాత్రం అది పుతినా లేక హుస్సేనా అన్నది నిర్ధారించుకోవటానికి సమయం పట్టిందని చెప్పటం విశేషం.
Does anyone recognise this former England captain? @WardyShorts @BumbleCricket pic.twitter.com/upIZ7KmIl4
— Jos Buttler (@josbuttler) 26 February 2018
Comments
Please login to add a commentAdd a comment