Nasser Hussain
-
రోహిత్, కోహ్లి కాదు.. ప్రపంచంలో అతడే బెస్ట్!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భూగ్రహం మీద ప్రస్తుతం అత్యంత విలువైన క్రికెటర్ ఇతడేనంటూ టీమిండియా స్టార్లలో ఓ ఆటగాడి పేరు చెప్పాడు. డీకే చెప్పిన ఆ ప్లేయర్ రన్‌మెషీన్ విరాట్ కోహ్లినో లేదంటే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మనో కానే కాదు! మరెవరు?.. దినేశ్ కార్తిక్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో బిజీగా ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి ఫినిషర్‌గా తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. ఇక ఇప్పటి వరకు తాజా ఎడిషన్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో డీకే 90 పరుగులు చేశాడు. తదుపరి ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా డీకే మళ్లీ గురువారం బరిలో దిగనున్నాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఇదిలా ఉంటే.. కేవలం ఆటగాడినే కాకుండా కామెంటేటర్‌గానూ దినేశ్ కార్తిక్ రాణిస్తున్న విషయం తెలిసిందే. భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్, మైఖేల్ అథెర్టన్లతో కలిసి డీకే స్కై స్పోర్ట్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నిజం చెప్పాలంటే అతడిలా మూడు ఫార్మాట్లలో ప్రత్యర్థులపై ఆధిపత్యం కనబరుస్తున్న మరొక ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి సత్తా అలాంటిది. కాబట్టి ప్రస్తుతం ఈ భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ అతడు సమర్థవంతంగా ఆడుతున్నాడు. వేరే ఆటగాడికి లేని నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడు. అతడు బరిలో ఉంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే’’ అంటూ డీకే.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పాడు. తన దృష్టిలో ప్రస్తుతం బుమ్రా మాత్రం ఈ ప్రపంచం మొత్తం మీద విలువైన క్రికెటర్ అని పేర్కొన్నాడు. కాగా భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇక గురువారం ముంబై- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా బుమ్రా- డీకే ఎదురుపడే అవకాశం ఉంది. చదవండి: T20 WC: హార్దిక్, రాహుల్‌కు నో ఛాన్స్.. ఆ ముగ్గురూ ఫిక్స్! -
గిల్ సూపర్ టాలెంట్.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు
He’s a super talent: టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ ప్రశంసలు కురిపించాడు. మెన్స్ క్రికెట్లో అతడు దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడని అంచనా వేశాడు. ఈ ఏడాది గిల్ అత్యుత్తమంగా రాణించాడంటూ అతడిని ‘‘సూపర్ టాలెంట్’’గా అభివర్ణించాడు. అత్యధిక పరుగుల వీరుడు కాగా అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2023లో మొత్తంగా 29 వన్డేలు ఆడిన 24 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. సగటు 63.36తో 1584 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్.. 149 బంతుల్లోనే 208 పరుగులు రాబట్టి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అంతేకాదు.. టీ20, టెస్టు ఫార్మాట్లోనూ ఒక్కో శతకం బాది సత్తా చాటాడు. అద్భుత నైపుణ్యాలు... తనకు తానే సాటి ఈ నేపథ్యంలో రాబోయే తరం క్రికెట్ సూపర్స్టార్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ నాసిర్ హుసేన్.. శుబ్‌మన్ గిల్ పేరును ప్రస్తావించాడు. ‘‘మెన్స్ క్రికెట్ నెక్ట్స్ సూపర్‌స్టార్ ఎవరంటే నేను శుబ్‌మన్ గిల్ పేరు చెబుతాను. 2023లో అతడు అత్యుత్తమంగా ఆడాడు. మరో ఎండ్ నుంచి తనకు సహకారం అందించే రోహిత్ శర్మ వంటి సీనియర్ల నుంచి అతడు చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు. గిల్ అద్భుత నైపుణ్యాలు కలిగిన ఆటగాడు. టీమిండియా తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన ప్రదర్శనలు ఇవ్వగలడు. 2024లోనూ అతడి ఫామ్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని నాసిర్ హుసేన్ శుబ్‌మన్ గిల్‌ను కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. రచిన్ రవీంద్ర జోరు కొనసాగాలి ఇక ఈ ఏడాది గిల్‌తో పాటు న్యూజిలాండ్ యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కూడా తనను బాగా ఆకట్టుకున్నాడని నాసిర్ హుసేన్ తెలిపాడు. అతడి జోరు వచ్చే సంవత్సరం కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు. కాగా రచిన్ రవీంద్ర వన్డే వరల్డ్‌కప్-2023లో ఏకంగా మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే. పది ఇన్నింగ్స్‌లో కలిపి 578 పరుగులు రాబట్టాడు రచిన్. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరిని ఎంపిక చేయకుండా పెద్ద తప్పు చేశారు: భజ్జీ View this post on Instagram A post shared by ICC (@icc) -
క్యాచ్ విడిచిపెట్టారు.. స్టంపింగ్ మిస్ చేశారు! చెత్త ఫీల్డింగ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రోజు ఇంగ్లండ్ పైచేయి సాధించినప్పటికీ.. రెండో రోజు ఆస్ట్రేలియా కూడా ధీటుగా బదులుస్తోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 393/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి సెషన్లోనే వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా(126 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఖ్వాజా వీరోచిత సెంచరీ సాధించాడు. దీంతో ఆసీస్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. చెత్త ఫీల్డింగ్.. ఇక ఇది ఇలా ఉండగా.. రెండో రోజు చివరి సెషన్లో పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ విమర్శలు వర్షం కురిపించాడు. ఆఖరి సెషనల్లో ఇంగ్లండ్ ఫీల్డర్లు బద్దకంగా కన్పించారు అని నాజర్ హుస్సేన్ విమర్శించాడు. కాగా ఆఖరి సెషన్లో ఖ్వాజా క్యాచ్‌ను విడిచిపెట్టగా.. క్యారీ స్టంపౌట్ రూపంలో అవకాశం ఇచ్చారు. అదే విధంగా రెండో రోజు ఆఖరిలో బ్రాడ్ బౌలింగ్‌లో ఖ్వాజా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నోబాల్ కావడంతో మరోసారి ఖ్వాజా బతికిపోయాడు. "ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పిన్‌గా అద్భుతంగా అనుకూలిస్తోంది. ఇంగ్లీష్ స్పిన్నర్ మోయిన్ అలీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ చివరి సెషన్లో ఇంగ్లండ్ ఫీల్డర్లు అంత యాక్టివ్‌గా కనిపించలేదు. ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టడమే కాకుండా స్టంపౌట్ ఛాన్స్‌ను కూడా మిస్ చేశారు. నో బాల్ వికెట్ కూడా ఇంగ్లండ్‌కు చాలా ఖరీదుగా మారనుంది" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హుస్సేన్ పేర్కొన్నాడు. చదవండి: Ashes 2023: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్ -
'టీమిండియాకు నా సలహా ఇదే.. బాబర్ ఆజంను చూసి నేర్చుకోండి'
10 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే టీమిండియా కల నెరవేరలేదు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరభావాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా కాస్త పర్వాలేదనిపించినప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం తీవ్ర నిరశాపరిచింది. అజింక్య రహానే, శార్ధూల్, జడేజా మినహా మిగితా ఎవరూ పెద్దగా రాణించలేక పోయారు. ఇక భారత జట్టు ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీమిండియా టాప్-ఆర్డర్ బ్యాటర్లు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ల నుంచి కొన్ని సూచనలు తీసుకోవాలని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల ఆటతీరు నన్ను తీవ్ర నిరాశపరిచింది. భారత టాప్-ఆర్డర్ బ్యాటర్లు పేసర్లను ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ల చూసి నేర్చుకోవాలి. వాళ్లు ఇటువంటి పిచ్ల్పై బంతి మూవ్ అవుతున్నప్పుడు చాలా లేట్‌గా ఆడుతారు. ఈ సలహా నేను ఇచ్చినందుకు భారత అభిమానులు నన్ను ట్రోలు చేస్తారు అని నాకు తెలుసు" అంటూ నాజర్ స్కై స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు. చదవండి: WTC Final: టాస్ ఓడిపోవడమే మంచిదైంది.. అతడు నా ఫేవరేట్ ప్లేయర్: కమ్మిన్స్ -
శుభమన్ గిల్, రవీంద్ర జడేజా వద్దు ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
-
డబ్ల్యూటీసీ ఫైనల్.. రవీంద్ర జడేజాకు నో ఛాన్స్! కారణమిదే..
WTC Final 2023- Ind Vs Aus: ‘‘రోహిత్ శర్మ టాపార్డర్ బ్యాటర్. నా జట్టుకు సారథి కూడా అతడే! రోహిత్ కెప్టెన్సీ అంటే నాకెంతో ఇష్టం. ఇక రోహిత్‌కు జోడీగా.. నాకు శుబ్‌మన్ రూపంలో మంచి ఆప్షన్ ఉంది. అయితే, తనకు నా జట్టులో ఇప్పుడే చోటివ్వడం కాస్త తొందరపాటు చర్య అవుతుంది. కాబట్టి నేను నా కంబైన్డ్ జట్టులో మరో ఓపెనర్‌గా ఉస్మాన్ ఖవాజాను ఎంచుకున్నా. ఇక మూడు, నాలుగు, ఐదో స్థానాలకు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లిలను ఎంపిక చేసుకుంటా. ఒకవేళ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఇండియా లేదంటే ఉపఖండంలో జరిగితే ఆరో స్థానంలో రవీంద్ర జడేజాకు చోటిచ్చేవాడినేమో! కానీ ఇంగ్లండ్‌లో ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. కాబట్టి సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌కే నా మొదటి ప్రాధాన్యం. నా జట్టులో అతడే ఆల్‌రౌండర్. ఇక స్పిన్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌కు ఎనిమిదో స్థానంలో చోటిస్తాను. లోయర్ ఆర్డర్లో అతడు చక్కగా బ్యాటింగ్ చేయగలడు. ఇక తొమ్మిదో ఆటగాడిగా ప్యాట్ కమిన్స్, పదో స్థానంలో మిచెల్ స్టార్క్, పదకొండో ఆటగాడిగా మహ్మద్ షమీకి నా జట్టులో చోటు కల్పిస్తా. జస్ప్రీత్ బుమ్రా లేడు కాబట్టి నేను షమీ వైపే మొగ్గు చూపుతా’’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ అన్నాడు. జడ్డూకు చోటు లేదు ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్-2023కి ముహూర్తం ఖారారైన విషయం తెలిసిందే. జూన్ 7-11 వరకు ఈ మెగా టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్ భారత్- ఆసీస్ ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ లెవన్‌ను ఎంపిక చేసుకున్నాడు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో అద్భుతంగా రాణించిన టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మాత్రం చోటివ్వలేదు. మ్యాచ్ ఇంగ్లండ్‌లో కాబట్టి.. జడ్డూకు బదులు మరో స్పిన్ ఆల్‌రౌండర్ అశ్విన్ వైపే మొగ్గుచూపాడు. కాగా భారత్‌లో జరిగిన బీజీటీ-2023లో స్పిన్నర్లు అశ్విన్, జడేజా కలిపి 47 వికెట్లు కూల్చగా.. ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్, యువ సంచలనం టాడ్ మర్ఫీ ఒక్కొక్కరు 36 వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ ఆడిన జడేజా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఇక బీజీటీలో అశ్విన్‌తో కలిసి జడ్డూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న విషయం విదితమే. డబ్ల్యూటీసీ ఫైనల్-2023కి నాసిర్ హుసేన్ ఎంచుకున్న కంబైన్డ్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మహ్మద్ షమీ. చదవండి: ఆసీస్ అంటే పూనకాలే! వాళ్ల దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే: ఆస్ట్రేలియా దిగ్గజం ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
T20 WC: ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా భయం భయంగా.. మరీ పిరికిగా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
T20 World Cup 2022: గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది టీమిండియా. ఇక ఐసీసీ మెగా ఈవెంట్లో ఘోర పరాభవం తర్వాత విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ పగ్గాలు వదిలేయగా.. రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే స్వదేశంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్‌గా వరుస సిరీస్‌లు గెలిచిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్, వెస్టిండీస్‌లో కూడా సత్తా చాటాడు. అయితే, ఇటీవల ముగిసిన ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో మాత్రం పేలవ ప్రదర్శనతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది రోహిత్ సేన. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమి కారణంగా భారీ మూల్యమే చెల్లించింది. ఇక ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆత్మవిశ్వాసం కొరవడటంతోనే.. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ టీమిండియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు బెరుగ్గా.. భయపడుతూ ఆడుతుందని అందుకే విజయవంతం కాలేకపోతుందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇండియా స్వదేశంలో, విదేశాల్లో అన్ని జట్లను ఓడిస్తోంది. పిరికిగా.. బెరుగ్గా.. బెంచ్ కూడా బలంగా ఉంది. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లను రొటేట్ చేయడం సహా విశ్రాంతినిస్తూ సిరీస్‌లు ఆడిస్తోంది యాజమాన్యం. అయితే, ఒకటి మాత్రం నిజం.. ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు భయపడుతూ ఆడుతోంది. పిరికిగా వ్యవహరిస్తోంది. గతేడాది ప్రపంచకప్‌లో ముఖ్యంగా పవర్‌ప్లేలో వాళ్ల ఆట చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది’’ అని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు లేకపోవడం పెద్దలోటు ఇక ఈసారి వరల్డ్‌కప్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్ల సేవలను భారత్ కోల్పోతుందన్న నాసిర్ హుసేన్.. ‘‘సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడి రాకతో టీమిండియా బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. అయితే, జడేజా, బుమ్రా వంటి గొప్ప క్రికెటర్లు జట్టుకు దూరం కావడం పెద్ద లోటు. ఏదేమైనా ద్వైపాక్షిక సిరీస్‌లలో దూకుడుగా ఆడినట్లే.. ప్రపంచకప్‌లోనూ అదే ఆలోచనాధోరణితో ముందుకు సాగితే టీమిండియాకు ఫలితం ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లను రోహిత్ సేన కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: Jasprit Bumrah Replacement: బుమ్రా స్థానంలో షమీ కాదు.. అతడే బెటర్.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం IND Vs PAK: 'భారత్ బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్ లేకుండానే ఆడేవారు' -
'ఇలాగే కొనసాగితే.. ఆటగాళ్లకు పిచ్చెక్కడం ఖాయం'
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ ఐసీసీ చేపట్టనున్న ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్-ఎఫ్టీపీ(2020-23)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎఫ్టీపీ పేరుతో ఐసీసీ ప్లాన్ చేసిన బిజీ షెడ్యూల్ పెద్ద జోక్‌లా ఉందని.. ఇది ఇలాగే కొనసాగితే ఆటగాళ్లకు పిచ్చెక్కి ఒక్కొక్కరుగా దూరమవుతారంటూ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ అనూహ్య రిటైర్మెంట్ కూడా ఇదే సూచిస్తుందని తెలిపాడు. స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో నాసర్ హుస్సేన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''31 ఏళ్లకే వన్డేల నుంచి తప్పుకొని బెన్ స్టోక్స్ పెద్ద షాక్ ఇచ్చాడు. మరో మూడు, నాలుగేళ్లు అన్ని ఫార్మాట్స్‌లో ఆడే సత్తా స్టోక్స్‌కు ఉన్నప్పటికి ఒత్తిడి మూలంగా వన్డేలకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. మూడు ఫార్మాట్లలో ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల తాను అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని స్వయంగా స్టోక్స్ చెప్పుకొచ్చాడు. మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన స్టోక్స్ వన్డే కెరీర్ ఇలా అర్థంతరంగా ముగుస్తుందని నేను ఊహించలేదు. దీనికి ప్రధాన కారణం ఐసీసీ. అర్థం పర్థం లేని ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాలతో ఐసీసీ ఆటగాళ్లను మానసిక ప్రశాంతత కరువవ్వడానికి పరోక్షంగా సహాయపడినట్లవుతుంది. సిరీస్‌కు- సిరీస్‌కు గ్యాప్ లేకుండా బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లపై ఒత్తిడి పడడం ఖాయమని.. త్వరలోనే చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడి తట్టుకోలేక వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎఫ్టీపీ లాంటి కార్యక్రమాలతో వన్డే ఫార్మాట్లో భవిష్యత్తులో మరిన్ని సమస్యలు రానున్నాయి. వాటి పరిణామాలు ఎదుర్కొనేందుకు ఐసీసీ సిద్ధంగా ఉండాలి'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ రెండు నెలల విండోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ ఎఫ్టీపీ(ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్) పేరుతో కొత్త షెడ్యూల్‌ను డిజైన్ చేసింది. ఎఫ్టీపీలో భాగంగా రానున్న కాలంలో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన క్యాలెండర్‌ను ఇప్పటికే రూపొందించింది. దీంతో అన్ని జట్లు బిజీ షెడ్యూల్లో గడపనున్నాయి. సిరీస్ ముగిసిన తర్వాత సరదాగా గడిపే సమయం కూడా లేకుండా క్రికెట్ సిరీస్‌లతో బిజీ కానున్నాయి. చదవండి: Ben Stokes: వన్డే క్రికెట్‌కు స్టోక్స్ గుడ్‌బై.. కారణాలు ఇవేనా..? Graeme Smith: కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ -
IND Vs ENG: కామెంటరీ ప్యానెల్ ఇదే.. మరో క్రికెట్ జట్టును తలపిస్తుందిగా!
క్రికెట్ ఆటలో మైదానంలో రెండు జట్ల ఆటగాళ్లు.. అంపైర్లు.. బంతి.. బ్యాట్ ఉంటే (వెలుతురు కూడా ఉండాలనుకోండి) మ్యాచ్‌కు ఏ ఆటంకం ఉండదు. మ్యాచ్ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు లైవ్‌లో ఆస్వాధిస్తారు. మ్యాచ్‌కు వెళ్లలేని అభిమానులు కూడా ఉంటారుగా. మరి వారి కోసం టీవీల్లో పలు స్పోర్ట్స్ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. అయితే లైవ్‌లో మ్యాచ్ చూసే ప్రేక్షకులకు.. ఇంట్లో టీవీలో చూసే ప్రేక్షకుల మధ్య ఒక చిన్న అంతరం ఉంటుంది. ఆ అంతరం ఏంటో ఈపాటికే మీకు అర్థమయి ఉంటుంది.. అదే క్రికెట్ కామెంటరీ . మన చిన్నప్పడు అంటే టీవీలు రాకముందు.. రేడియోలు ఉన్న కాలంలో చాలా మంది అభిమానులు స్కోర్‌తో పాటు క్రికెట్ కామెంటరీ వింటూ ఉండేవారు. అలా క్రికెట్‌తో పాటు కామెంటరీకి కూడా సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. టీవీల్లో కామెంటరీని వింటూనే మ్యాచ్‌లో బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లను ఎంజాయ్ చేస్తుంటాం. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. జూలై, ఆగస్టు నెలల్లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. మరి ఈ మ్యాచ్‌లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్న స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం కూడా తమ కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. మొత్తం 13 మందితో కూడిన ఈ ప్యానెల్లో హిందీ, ఇంగ్లీష్ కామెంటేటర్లు ఉన్నారు. ఇంగ్లీష్‌లో కామెంటరీ చేయనున్నవాళ్లు: హర్షా బోగ్లే, నాసర్ హుస్సేన్, సంజయ్ మంజ్రేకర్, గ్రేమ్ స్వాన్, డేవిడ్ గ్రోవర్, మైకెల్ ఆర్థర్ టన్ హిందీలో కామెంటరీ చేయనున్నవాళ్లు: వివేక్ రజ్దన్, వీరేంద్ర సెహ్వాగ్, అజయ్ జడేజా, సాబా కరీమ్, మహ్మద్ కైఫ్, ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ ఈ 13 మందిలో హర్షా బోగ్లేను మినహాయిస్తే మిగతా 12 మంది ఏదో ఒక దశలో క్రికెట్ ఆడినవారే. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కామెంటరీ ప్యానల్‌ను సరదాగా ట్రోల్ చేశారు. ''ఇంగ్లండ్, ఇండియాల జట్ల కంటే ఈ కామెంటరీ ప్యానెల్ పటిష్టంగా కనిపిస్తోంది.. 12 మంది ఆటగాళ్లు ఉన్నారు.. అందులో బ్యాటర్స్, బౌలర్స్ ఉండడంతో మరో క్రికెట్ జట్టును తలపిస్తోంది. వీళ్లకు కూడా ఒక మ్యాచ్ నిర్వహించండి'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఏకైక టెస్టుకు అంతా సిద్ధమయింది. ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్న ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ .. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్, ఎడ్జ్‌బాస్టన్ జులై 7న తొలి టీ20, సౌతాంప్టన్ జులై 9న రెండో టీ20, బర్మింగ్‌హామ్ జులై 10న మూడో టీ20, నాటింగ్‌హామ్ జులై 12న తొలి వన్డే, లండన్ జులై 14న రెండో వన్డే, లండన్ జులై 17న మూడో వన్డే, మాంచెస్టర్ చదవండి: Cheteshwar Pujara: 'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి' టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే ఇది! అతడు లేడు కాబట్టి... రోహిత్‌పై మరింత భారం! -
తెగ బాధపడిపోతున్నాడు.. ఎవరీ క్రికెటర్?
ఒక ఫోటో మీ ముందు ఉంచి అందులో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పమంటే.. తెలిసిన వ్యక్తి అయితే టక్కున చెప్పేస్తారు. కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి మొహం స్పష్టంగా కనిపించకపోయినా.. మొహానికి చేతులు అడ్డుపెట్టినా చెప్పడం కాస్త కష్టతరమే. తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని అంతా కోల్పోయినట్లుగా తెగ ఎమోషనల్ అవుతున్న ఒక క్రికెటర్ కనిపిస్తున్నాడు కదా. ఆ క్రికెటర్ పేరేంటో చెప్పండి. అయితే ఫోటోలో ఉన్న క్రికెటర్ బాధపడుతున్నాడని భావిస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఫోటోలో ఉన్న వ్యక్తి విజయం సాధించామన్న ఆనందంలో.. అలా డ్రెస్సింగ్‌రూమ్‌లో ఒంటరిగా కూర్చొని తన సంతోషాన్ని కనిపించకుండా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్. ఫోటో వెనుక కథ తెలియాలంటే 22 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. 2000 సంవత్సరంలో ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. నిర్ణయాత్మకమైన మూడో టెస్టు కరాచీ స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఇంజమామ్ ఉల్ హక్(142), మహ్మద్ యూసఫ్(117) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ 388 పరుగులకు ఆలౌట్ అయింది. మైకెల్ ఆర్థర్టన్ 125 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ నాసర్ హుస్సేన్ 51 పరుగులు చేశాడు. దీంతో పాక్‌కు 17 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పాక్ అనూహ్యంగా 158 పరుగులకే కుప్పకూలడంతో ఇంగ్లండ్ ముందు 176 పరుగుల టార్గెట్ ఖరారు అయింది. తొలి రెండు టెస్టులు డ్రా కావడంతో మూడో టెస్టులో కచ్చితంగా ఫలితం రానుంది. అలా ఇంగ్లండ్ ఎన్న ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని విజయాన్ని సాధించింది. గ్రహమ్ థోర్ప్ 64 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నంత సేపు పెద్ద హైడ్రామా నడిచింది. అప్పటి పాక్ కెప్టెన్ మొయిన్ ఖాన్ బ్యాడ్ లైట్ అంటూ అంపైర్లకు పదేపదే అప్పీల్ చేశాడు. అయితే అంపైర్లు మాత్రం మొయిన్ అభ్యర్థనను ఏ మాత్రం పట్టించుకోకుండా మ్యాచ్‌ను కంటిన్యూ చేశారు. అలా ఇంగ్లండ్ మూడో టెస్టులో గెలడంతో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు కరాచీ అంతర్జాతీయ స్టేడియంలో పాక్‌కు దిగ్విజయమైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో అప్పటివరకు పాక్‌కు ఓటమనేదే లేదు. పాక్ 34 మ్యాచ్‌ల విజయాల జైత్రయాత్రకు ఇంగ్లండ్ ఒక రకంగా చెక్ పెట్టింది. కెప్టెన్‌గా సిరీస్ గెలవడంతో నాసర్ హుస్సేన్ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. అందుకే డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చాకా ఒక్కడే కూర్చొని అంత ఎమోషనల్ అయ్యాడు. ఈ ఫోటో అప్పట్లోనే బాగా వైరల్ అయింది. ఇది అసలు విషయం. చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్ To date, this picture is the most viewed on the feed ... Nasser Hussain may look dejected but he is just emotional after steering England to a dramatic series victory in the Stygian gloom at Karachi in 2000. It was Pakistan's first loss at the ground pic.twitter.com/BNW3stgmQJ — Historic Cricket Pictures (@PictureSporting) October 9, 2021 -
సూర్యకుమార్ గొప్ప ఆటగాడే, కానీ.. ఆ ఒక్క విషయంలో వీక్‌గా ఉన్నాడు..!
Cricket News in Telugu: టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఇవాళ (నవంబర్ 10) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియా హాట్ ఫేవరెట్ కాగా.. ఇంగ్లండ్ అండర్ డాగ్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాస్సర్ హుస్సేన్.. ఫ్యాన్స్‌కు ఓ క్విజ్ పోటీ పెట్టాడు. ఇటీవలి కాలంలో, ముఖ్యంగా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ బలాలు, బలహీనతలు చెప్పాలని వాట్సాప్ ద్వారా అభిమానులను కోరాడు. నాస్సర్ హుస్సేన్ సంధించిన ఈ ప్రశ్నకు మెజారిటీ అభిమానులు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. చాలా మంది, ఇంచుమించు 99 శాతం సూర్యకుమార్ బ్యాటింగ్ బలాలు మాత్రమే వివరించగా.. కేవలం ఒక్కరు మాత్రమే అతని పలానా విషయంలో బలహీనంగా ఉన్నాడని రిప్లై ఇచ్చాడు. సూర్యకుమార్.. పేస్, స్పిన్ బౌలింగ్‌లను సమర్ధవంతంగా ఎదుర్కొనగలడు.. టెక్నిక్, భుజబలం, బంతిని బలంగా బాధడం అతని ప్రధాన అస్త్రాలు, స్క్వేర్‌లో అతను షాట్లు బాగా ఆడగలడు, క్రికెట్ చరిత్రలోనే సూర్యకుమార్ ఆడినట్లు స్కూప్ షాట్ ఎవ్వరూ ఆడింది లేదు, ఆడలేరంటూ దాదాపుగా అందరూ సూర్యకుమార్ బ్యాటింగ్ బలాలను విశ్లేషించారు. అయితే ఒక్కరు మాత్రం.. సూర్యకుమార్ స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడటం గమనించానని, ఇదే అతనికి ఉన్న ఏకైక వీక్నెస్ కావచ్చని పేర్కొన్నాడు. నాస్సర్ హుస్సేన్ ఈ క్విజ్‌కు సంబంధించిన వివరాలను సహచరుడు, మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ ఆథర్టన్‌తో కలిసి విశ్లేషిస్తూ మీడియాకు వెల్లడించాడు. -
ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడండి.. టీమిండియా దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుంది
లండన్: విజయోత్సాహంలో ఉన్న ఇంగ్లండ్ జట్టును ప్రముఖ వ్యాఖ్యాత, ఆ దేశ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అలర్ట్ చేశాడు. 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటై ఆ తర్వాత ఊహించని రీతిలో చెలరేగి, సిరీస్ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియాను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడకపోతే.. కోహ్లి సేన దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుందని, దీంతో సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఘోర పరాజయాల అనంతరం ఎలా పుంజుకోవాలో టీమిండియాకు బాగా తెలుసని, దీనికి చరిత్రే సాక్షమని తెలిపాడు. ఇక లార్డ్స్ టెస్ట్‌లో చిరస్మరణీ విజయాన్నందుకున్న టీమిండియా.. లీడ్స్ టెస్ట్‌లో 78 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమైంది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా కీలకమైన నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: ఆండర్సన్‌కు ఇదే ఆఖరి సిరీస్.. ఐదో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్..? -
రూట్ ఒక్కడు ఆడితే సరిపోదు.. ఇలా అయితే కష్టం
లార్డ్స్: టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్టుగానే రెండో టెస్టులో జో రూట్ మినహా మిగతా వారెవరు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమిపై ఆ జట్టు మాజీ ఆటగాడు నాసిర్ హుస్సేన్ స్పందించాడు. ''లార్డ్స్‌లో ఇంగ్లండ్ ఆటతీరు బాగానే అనిపించినప్పటికి కెప్టెన్ రూట్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇంగ్లండ్ టాపార్డర్‌లో బలహీనంగా తయారైంది. ఓపెనర్లు సిబ్లీ, బర్న్స్, హసీబ్ హమీద్‌లు తమ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్నారు. రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనరిద్దరు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. అంతేగాక వన్‌డౌన్‌లో ఆడుతున్న హమీద్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మిడిలార్డర్లో బెయిర్ స్టో ఫామ్‌లో ఉన్నట్లే కనిపించినా.. జాస్ బట్లర్, మొయిన్ అలీలు నిరాశపరిచారు. ఇదిలాగే కొనసాగితే రానున్న టెస్టుల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నప్పటికి గాయాలు జట్టును వేధిస్తున్నాయి. రెండో టెస్టులో బౌలింగ్‌తో ఆకట్టుకున్న మార్క్‌వుడ్ గాయం బారీన పడినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌కు ఇప్పుడు బ్యాకప్ ఆటగాళ్ల అవసరం చాలా ఉంది. ఇక రెండో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీ... బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టిన టీమిండియా మంచి విజయాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో షమీ, బుమ్రాలు చూపిన తెగువ మ్యాచ్ విజయానికి బాటల పరిచింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. Thought that Rory Burns dismissal looked familiar… #ENGvIND pic.twitter.com/NUc0OAUQLn — James Pavey (@jamespavey_) August 16, 2021 -
'అక్కడ ప్రాణాలు పోతున్నాయి.. రద్దు చేయడం మంచిదే'
లండన్: బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు కరోనా సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే లీగ్ రద్దు అనేది తాత్కాలికమే అని.. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఐపీఎల్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్‌ను రద్దు చేయడం సరైనదని.. వారికి వేరే ఆప్షన్ లేదంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. హుస్సేన్ మాట్లాడుతూ..'' భారత్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ఆటగాళ్లను బయోబబుల్ సెక్యూర్‌లో ఉంచి లీగ్ నిర్వహించారు. అత్యంత సురక్షితంగా చెప్పుకొనే బయోబబుల్‌కు కరోనా సెగ తగిలింది. ఈ సమయంలో లీగ్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు తాత్కాలిక రద్దు మాత్రమే అని.. పరిస్థితి చక్కబడిన తర్వాత ఐపీఎల్‌ను జరిపి తీరుతామని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. నా దృష్టిలో మాత్రం ఈ సీజన్‌ను పూర్తిగా రద్దు చేయడమే ఉత్తమం. ఇప్పటికే పటిష్టమైన బయోబబూల్‌ను దాటి ఆటగాళ్లను చేరినా కరోనా భవిష్యత్తులో ఐపీఎల్ నిర్వహించినా అక్కడికి రాదని ఎవరు మాత్రం చెప్పగలరు. అంతేగాక ఐపీఎల్ మళ్లీ నిర్వహించినా విదేశీ ఆటగాళ్లు వస్తారనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు భారత్‌లో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వారి కళ్లతో చూశారు. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక.. ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి భయానక పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో లీగ్‌లో పాల్గొనేందుకు ఎలా వస్తారు. అయినా ఐపీఎల్ 14వ సీజన్‌ను ఇండియాలో నిర్వహించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తప్పు. సరిగ్గా ఆరు నెలల క్రితం యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్ 13వ సీజన్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా సీజన్‌ను అక్కడే నిర్వహించి ఉంటే బాగుండేది. పరిస్థితి దారుణంగా మారిన తర్వాత ఐపీఎల్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'మీ అభిమానానికి థ్యాంక్స్.. జడేజా అని పిలిస్తే చాలు' ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్ -
'రొటేషన్ పాలసీ మా కొంపముంచింది'
అహ్మదాబాద్: టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1 తేడాతో ఓడిపోవడం వెనుక రొటేషన్ పాలసీ ముఖ్య కారణమని ఆ జట్టు మాజీ ఆటగాడు నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. రొటేషన్ పాలసీ అనేది తప్పుడు నిర్ణయమని.. అది ఎప్పుడు కలిసి రాదని.. ఆ విధానాన్ని తప్పుబడుతున్నట్లు నాసిర్ విమర్శించాడు. ‘‘ఆటగాళ్ల రొటేషన్ విధానం అనే నిర్ణయం సరైనది కావొచ్చు.. కానీ భారత్‌తో సిరీస్‌లో అలా చేయడాన్ని సమర్థించలేను. ఆటగాళ్లను రొటేట్ చేయడం అన్ని సమయాల్లో కలిసిరాదు. టీమిండియా పర్యటనకు ముందు లంక పర్యటనలో రొటేషన్ పాలసీ కలిసి వచ్చింది.. అదే టీమిండియాతో సిరీస్‌కు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. రెండో టెస్టు తర్వాత మొయిన్ అలీ స్వదేశానికి వెళ్లిపోయాడు. వాస్తవానికి అలీని మిగిలిన టెస్టుల్లో ఆడించాలని ఈసీబీ భావించింది. కానీ రొటేషన్ పాలసీ ఉండడంతో ఆటగాళ్లు తమ సొంత నిర్ణయాలపై ఆధారపడుతున్నారు. జానీ బెయిర్ స్టో విషయంలోనూ ఇలాగే జరిగింది. లంకతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బెయిర్ స్టో టీమిండియా సిరీస్ వచ్చేసరికి మాత్రం విఫలమయ్యాడు. మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉన్న అతను చివరి రెండు టెస్టుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే రొటేషన్ పాలసీ ఈసారి మా కొంపముంచింది. ఇంకో విషయం ఏంటంటే.. ఐపీఎల్ సీజన్‌కు కూడా ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా ఈసీబీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఐపీఎల్ 2020 ముగిసి ఆర్నెళ్లు కాకుండానే మరో సీజన్ రెడీ అయితుంది. ఐపీఎల్లో పాల్గొంటే.. ఫార్మాట్ వేరైనా.. టెస్టు క్రికెట్ ఆడేందుకు కాస్త స్కోప్ ఉంటుంది. '' అని వివరించాడు. ఇక ఇంగ్లండ్, టీమిండియాల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ శుక్రవారం(మార్చి 12న) జరగనుంది. చదవండి: టీమిండియాతో సిరీస్.. ఐదు కేజీలు బరువు తగ్గా టీమిండియా సిరీస్ గెలవగానే మాట మార్చేశాడు -
‘అతనేమీ వార్న్ కాదు.. కుంబ్లే అనుకోండి’
సౌతాంప్టన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా రాణించాలంటే ప్రస్తుతం పాకిస్తాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో స్పిన్నర్ యాసిర్ షాను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని నేర్చుకోవాలని ఇంగ్లిష్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సూచించాడు. పాక్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆఖరి టెస్టులో యాసిర్ షా బౌలింగ్ ఆడటానికి భయపడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లను ఉద్దేశించి హుస్సేన్ మాట్లాడాడు. అసలు యాసిర్ షా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎటువంటి భయాందోళనలు వద్దని, మానసికంగా దృఢంగా ఉంటే అతని బౌలింగ్‌ను ఆడటం కష్టం కాదన్నాడు. అదే సమయంలో లెగ్ బ్రేక్ బౌలర్ యాసిర్ షాను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌లా ట్రీట్ చేయవద్దని చురకలంటించాడు. (చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్‌పై క్లారిటీ ఇచ్చిన దాదా) యాసిర్ షా ఒక సాధారణ స్పిన్నర్ మాత్రమేనని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే తరహా బౌలర్‌గా యాసిర్ షాను భావించాలన్నాడు. ఇక్కడ తానేమీ కుంబ్లేను తక్కువ చేయడం లేదన్నాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిబ్లే, ఓలీ పోప్లు యాసిర్ షాకు ఔట్ కావడంపై నాసిర్ హుస్సేన్ స్పందించాడు. సిబ్లే ఎల్బీగా పెవిలియన్ చేరగా, ఓలీ పోప్లు బౌల్డ్ అయ్యాడు. ఈ ఇద్దరూ బ్యాక్‌ఫుట్ ఆడుతూ వికెట్లు సమర్పించుకోవడంతో హుస్సేన్ కాస్త సెటైరిక్‌గా మాట్లాడాడు. దానిలో భాగంగానే వార్న్, కుంబ్లే ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘ యాసిర్ షాను మరో వార్న్ అనుకోకండి. అతనొక సాధారణ లెగ్ స్పిన్నర్. కుంబ్లే తరహా బౌలర్ అనుకోండి. నేను ఇక్కడ కుంబ్లేను కించపరచడం లేదు. కేవలం విషయం చెబుతున్నా. వార్న్ ఏ వికెట్‌పైనైనా తొలి రోజు నుంచే టెస్టుల్లో ఆధిపత్యం చెలాయిస్తాడు. కుంబ్లే అలా కాదు. క్రమంగా వికెట్‌పై పట్టు సాధిస్తాడు. దాంతోనే వార్న్-కుంబ్లేల పోలిక తెచ్చా’ అని హుస్సేన్ పేర్కొన్నాడు. ఈ మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటివరకూ యాసిర్ షా 11 వికెట్లు సాధించాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు. ఆపై బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్) సెంచరీ సాధించాడు. అలాగే టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని దాటి అరుదైన జాబితాలో చేరిపోయాడు.(చదవండి: ‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’) -
‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’
లండన్: సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టిన గ్రేటెస్ట్ కెప్టెన్లలో ఒకడు. ప్రధానంగా టీమిండియాకు దూకుడు నేర్పిన కెప్టెన్ అంటే బాగుంటుంది. యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి వారి నమ్మకాన్ని చూరగొన్న కెప్టెన్. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ల వంటి స్టార్లు వెలుగులోకి రావడానికి గంగూలీనే కారణం. అయితే భారత క్రికెట్ జట్టులో ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా ఎదిగిన గంగూలీని ప్రత్యర్థి జట్ల కెప్టెన్ల అసహ్యించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆట పరంగా కాకపోయినా టాస్ పరంగా గంగూలీ అవతలి జట్టు కెప్టెన్‌కు విసుగుతెప్పించేవాడు. (నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?) టాస్ వేయడానికి గంగూలీ రావాల్సిన సమయంలో రాకుండా చాలా ఆలస్యంగా వచ్చేవాడని ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా తెలపగా, దానికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సమర్ధించాడు. ‘ అవును.. గంగూలీకి టాస్కు చాలా ఆలస్యంగా వచ్చేవాడు. ప్రతీ సింగిల్ మ్యాచ్‌లోనూ గంగూలీ టాస్ వేయడానికి ఆలస్యంగానే వచ్చేవాడు. మమ్మల్ని నిరీక్షించేలా చేసేవాడు. ఇది నాకు గంగూలీపై అసహ్యాన్ని పుట్టించేది. కానీ నేను దశాబ్ద కాలంగా గంగూలీతో కామెంటరీ విభాగాన్నితరచు పంచుకుంటున్నాను. చాలా మంచి మనిషి గంగూలీ. చాలా కామ్ గోయింగ్. ఒక లవ్లీ పర్సన్. క్రికెటర్లు ఎవరైనా ఇలానే ఉంటారామో. మనం వారితో ఆడుతున్నప్పుడు ఇష్ట పడం. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిస్తే వారిలో మంచి కోణం కనబడుతుంది. వారు మంచి మనుషుల్లో కనబడతారు. గంగూలీ విషయంలో కూడా నాకు జరిగింది అదే’ అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో గంగూలీతో జ్ఞాపకాలను నాసిర్ హుస్సేన్ పంచుకున్నాడు.(విరాట్ కోహ్లికి సరికొత్త తలపోటు) ఐసీసీ నిర్వహిస్తున్న క్రికెట్ ఇన్సైడ్ అవుట్ తాజా ఎపిసోడ్లో సచిన్ గురించి హుస్సేన్ ప్రస్తావించాడు. టీమిండియాతో మ్యాచ్‌లకు ముందు తాము ఎప్పుడూ సచిన్‌ను ఎలా ఔట్ చేయాలి అనే దానిపైనే ఎక్కువ చర్చిస్తూ ఉండేవాళ్లమన్నాడు. అయితే ఎన్ని మీటింగ్‌ల్లో ఇలా సచిన్ ఔట్ గురించి చర్చించామో గుర్తులేదన్నాడు. ఇక అద్భుతమైన టెక్నిక్ సచిన్ సొంతమని హుస్సేన్ ప్రశంసించాడు. -
‘కెప్టెన్సీ పంచుకోవడం కోహ్లికి నచ్చదు’
హైదరాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసిర్ హుస్సెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అనేక జట్లు మూడు ఫార్మట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలనే ఫార్ములా పాటిస్తున్నాయని పేర్కొన్న హుస్సెన్ ఆ ఫార్ములా భారత్‌కు వర్తించదని అన్నారు. ఎందుకుంటే ప్రస్తుత సారథి కోహ్లికి కెప్టెన్సీ పంచుకోవడం ఇష్టముండదని అభిప్రాయపడ్డాడు. కోహ్లి చాలా గంభీరమైన వ్యక్తి అని, తన బాధ్యతలను మరొకరితో పంచుకునేందుకు ఇష్టపడడని తెలిపాడు. అయితే ఇంగ్లండ్ విషయంలో ఇలా కుదరదని, మూడు ఫార్మట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉంటారని గుర్తుచేశాడు. ఇక ఫార్మట్కొక కోచ్ ఉండాలనే కొత్త ప్రతిపాదనను నాసిర్ హుస్సెన్ తెరపైకి తీసుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ కోచ్ ట్రెవర్ బెయిలీస్ పరిమిత ఓవర్ల క్రికెట్లో విజయవంతం అయ్యాడని కానీ టెస్టు క్రికెట్లో అంతగా సక్సెస్ కాలేదని అభిప్రాయపడ్డాడు. బెయిలీస్ శిక్షణలో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ విజయం సాధించిందని కానీ టెస్టుల్లో ఘోరంగా విఫలమైందన్నాడు. ఈ కారణంగానే మూడు ఫార్మట్లకు వేర్వేరు కోచ్‌లు ఉంటే బాగుంటుందని హుస్సెన్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్ని ఫార్మట్లలో అత్యుత్తమ కోచింగ్ ఇస్తున్నాడని, అతడి శిక్షణలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని నాసిర్ హుస్సెన్ ప్రశంసించాడు. చదవండి: ‘అర్జున’కు బుమ్రా, ధావన్! ‘భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతం’ -
ధోనిని బలవంతపెట్టొద్దు
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ జాతీయ జట్టుకు ఆడతాడా, అసలు ఆడే అవకాశం ఉందా ఎవరికీ తెలియదు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత అతను మళ్లీ బరిలోకి దిగలేదు. ఈసారి ఐపీఎల్లో బాగా ఆడితే టి20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని వినిపించినా.... లీగ్ జరగడం సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో ధోని ఇక రిటైర్ అయినట్లేనని, అధికారిక ప్రకటనే మిగిలిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ స్పందించాడు. ధోనిలాంటి అరుదైన క్రికెటర్లను బలవంతంగా రిటైర్మెంట్ వైపు తోస్తే అది జట్టుకు మేలు చేయదని అతను వ్యాఖ్యానించాడు. ‘ఒక్కసారి ధోని రిటైర్ అయితే అతడిని మళ్లీ వెనక్కి పిలిపించలేం. క్రికెట్ ప్రపంచమంతా కీర్తించే దిగ్గజాలు కొందరే ఉంటారు. అలాంటివారు తరానికొక్కరే కనిపిస్తారు. ధోని కూడా అలాంటి ఆటగాడే. కాబట్టి అతడిని రిటైర్మెంట్ ప్రకటించమని బలవంత పెట్టవద్దు. తన మానసిక పరిస్థితి ఏమిటో ధోనికి మాత్రమే తెలుసు. సెలక్టర్లు ఎంపిక చేస్తే ఎలా తమ బాధ్యత నెరవేర్చాలో ఆటగాళ్లకు తెలుసు. అయితే ప్రస్తుత జట్టులో చోటు దక్కించుకునే సత్తా ధోనికి ఉందా అనేది ఎవరైనా చూస్తారు. నా దృష్టిలో మాత్రం భారత జట్టుకు మరికొంతకాలం సేవలు అందించగల సామర్థ్యం ఇంకా ధోనిలో ఉంది’ అని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. అయితే ప్రపంచకప్‌లో ఒకటి, రెండు మ్యాచ్‌లలో ధోని తన సహజశైలిలో ఆడలేకపోయాడనే విషయం మాత్రం వాస్తవమని ఇంగ్లండ్ మాజీ సారథి అంగీకరించాడు. ‘లక్ష్య ఛేదనలో ఒకట్రెండుసార్లు అతను లెక్క తప్పినట్లు అనిపించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతను ఏదో కారణం చేత చివరి వరకు కూడా నెమ్మదిగానే ఆడే ప్రయత్నం చేయడం నాకు గుర్తుంది. అయితే ఓవరాల్‌గా ధోని గొప్ప ఆటగాడు. కాబట్టి అతని రిటైర్మెంట్ను కోరుకునేవారు ఆలోచించి వ్యాఖ్య చేస్తే బాగుంటుంది’ అని నాసిర్ హుస్సేన్ సూచించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 38 ఏళ్ల ధోని ఇప్పటివరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2014లో టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని వన్డే, టి20 ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. -
తరానికి ఒకసారే ఇలాంటి దిగ్గజాలు వస్తారు..
లండన్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి మద్దతుగా నిలిచాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. ధోని రిటైర్మెంట్కు సంబంధించి పదే పదే వ్యాఖ్యలు చేయడం అంత మంచిది కాదని సూచించాడు. ఇలా వ్యాఖ్యలు చేసి అతని ఆలోచనలను రిటైర్మెంట్ దిశగా నడిపించాలని అనుకుంటున్నారా అని హుస్సేన్ ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితం ధోని రిటైర్మెంట్ అంశానికి సంబంధించి టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా ధోని రీఎంట్రీ ఆధారపడుతుందనే సంకేతాలిచ్చాడు. (ధోని కాదు..మరి ఊతప్ప ఫేవరెట్ కెప్టెన్ ఎవరు?) ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన హుస్సేన్.. ధోని రిటైర్మెంట్ అనే అంశమే మాట్లాడకపోవడం మంచిదన్నాడు. ధోనికి అతని సత్తా ఏమిటో తెలుసని, ఎవరు కూడా వీడ్కోలు విషయం చెప్పనవసరం లేదన్నాడు. ఒకవేళ పదే పదే ధోని రిటైర్మెంట్పై చర్చ పెడితే మాత్రం అది కచ్చితంగా అతన్ని ఆ ఆలోచన దిశగా నడిపించినట్లేనన్నాడు. ధోని లాంటి క్రికెటర్లు తరానికి ఒకసారి మాత్రమే వస్తారనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఏమైనా ఊహించని ఒత్తిడి వల్ల ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని మళ్లీ తీసుకురాగలరా అంటూ నిలదీశాడు. ధోనిలో ఇంకా చాలా టాలెంట్ ఉందనే విషయం తెలుసుకోవాలన్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై వైఫల్యంతో ధోని ఆటను నిర్దారించలేమన్నాడు. ధోనిని బలవంతంగా రిటైర్మెంటు దిశగా నడిపించే వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హుస్సేన్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో తన రీఎంట్రీ ఘనంగా ఉండాలని ఆశించిన ధోనికి నిరాశే ఎదురైంది. తన ఐపీఎల్ ప్రాక్టీస్‌ను నెలముందుగానే మొదలు పెట్టేసినా ఆ లీగ్ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా మార్చి 29వ తేదీ ఆరంభం కావాల్సిన ఐపీఎల్.. ఏప్రిల్ 15వ తేదీ వరకూ వాయిదా పడింది. ఇప్పటికీ కరోనా నివారణంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో వాయిదా పడిన సమయానికి ఐపీఎల్ నిర్వహణ అనేది అసాధ్యం. అన్ని అనుకూలిస్తే పూర్తిస్థాయి ఐపీఎల్ నిర్వహణయకు రెండు-మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. -
‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’
సాక్షి, హైదరాబాద్ : కరోనో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను టీమిండియా సారథి విరాట్ కోహ్లి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. లాక్డౌన్ కంటే ముందే తన సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో తన ప్రత్యేక ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఈ ప్రేమపక్షులు ఇప్పడు ఇంట్లోనే ఆనందంగా గడుపుతున్నారు. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు. ఇక ఈ లాక్డౌన్ సమయంలో ఇంగ్లండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌తో కోహ్లికి మరింత బాండింగ్ ఏర్పడింది. తరుచూ ఇన్స్టాగ్రామ్ వీడియో కాలింగ్‌లో సరదాగా సంభాషించుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు ముచ్చటించుకుంటూ.. ఇష్టమైన క్రికెట్ కామెంటేటర్(వ్యాఖ్యాత) ఎవరని టీమిండియా సారథిని కేపీ ఆడిగాడు. అయితే సమాధానం ఇవ్వడానికి కోహ్లి చాలా సమయమే తీసుకున్నాడు. ఇదే క్రమంలో దీనికి ఆన్సర్ చాలా జాగ్రత్తగా ఇవ్వమని లేకుంటే ఇబ్బందుల్లో పడతావని హెచ్చరించాడు. ఈ గ్యాప్‌లో ఆలోచించిన కోహ్లి తనకు ఇష్టమైన వ్యాఖ్యాత ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ అని పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యానం ఎందుకో నాకు బాగా నచ్చుతుందని, వివాదాల జోలికి వెళ్లకుండా చాలా సరదాగా మాట్లాడతాడని తెలిపాడు. చాలా తెలివిగా సమాధానం చెప్పావని కేపీ ప్రశంసించాడు. అదేవిధంగా లియన్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలలో రొనాల్డో తనకు ఎంతో ఇష్టమని మరో ప్రశ్నకు సమాధానంగా కోహ్లి పేర్కొన్నాడు. చదవండి: డివిలియర్స్‌ను స్లెడ్జింగ్ చేయలేదు! లాక్డౌన్: ‘ఖైదీననే భావన కలుగుతోంది’ -
పాక్ ఫ్యాన్స్.. మీ మద్దతు ఎవరికి?
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది. అయితే ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ నాలుగింట మాత్రమే విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో ఉంది. మంగళవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి చెందడంతో ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌లు ఆ జట్టుకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో భారత్‌తో జరుగనున్న మ్యాచ్ ఇంగ్లండ్ విజయం సాధించి సెమీస్ రేసులోకి రావాలని భావిస్తోంది. దీనిలో భాగంగా పాకిస్తాన్ ఫ్యాన్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్ ఒక ప్రశ్నకు సంధించాడు. ‘ ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య మ్యాచ్‌లో మీ మద్దతు ఎవరికి’ అని ట్వీటర్ వేదికగా ప్రశ్నించాడు. దీనికి పాక్ అభిమానుల నుంచి పెద్దగా సమాధానం రాకపోయినా, నాసీర్ హుస్సేన్ చేసిన ట్వీట్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. ‘ ఇంతకీ నీ సపోర్ట్ ఎవరికి నాస్’ అంటూ ప్రశ్నించాడు. దీనికి నాసీర్ హుస్పేన్ స్పందిస్తూ.. ‘ తప్పకుండా ఇంగ్లండ్‌కే.. నువ్వు ఎలాగైతే ఇంగ్లండ్‌కు మద్దతిస్తావో అలానే. దక్షిణాఫ్రికాతో రగ్బీ జరిగే సందర్భాల్లో నువ్వు ఇంగ్లండ్‌కు ఎలాగైతే మద్దతు ఇస్తావో నేను కూడా అంతే’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక్కడ నాసీర్ హుస్సేన్ భారత్‌లో పుట్టి ఇంగ్లండ్‌లో స్థిర పడిన విషయాన్ని పీటర్సన్ పరోక్షంగా ప్రస్తావించాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్‌కు హుస్సేన్ తనదైన రీతిలో రిప్లై ఇవ్వడం గమనార్హం. Question to all Pakistan fans .. England vs INDIA .. Sunday .. who you supporting ? 😉 — Nasser Hussain (@nassercricket) 26 June 2019 England of course Kev .. same as you when England play South Africa at rugby 😉 — Nasser Hussain (@nassercricket) 26 June 2019 -
‘భారత క్రికెట్ జట్టుతోనే ప్రమాదం’
లండన్: మరికొద్ది రోజుల్లో వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఏ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయననే విషయంపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు తమతమ దేశాలను అభిమాన జట్లుగా చెప్పుకొంటున్నప్పటికీ పలువురు విదేశీ క్రికెట్ దిగ్గజాలు మాత్రం భారత క్రికెట్ జట్టే బలమైన జట్టనే పేర్కొంటున్నారు. ఈ జాబితాలో తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ నాసీర్ హుస్సేన్ కూడా చేరిపోయారు. ఈసారి వరల్డ్‌కప్‌లో భారత జట్టుతోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ‘ఈసారి ప్రపంచకప్‌లో అన్ని జట్లకు ప్రధాన ప్రత్యర్థి భారత్. ఆ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. అందుకే ఆ జట్టును చూసి అన్ని జట్లూ భయపడుతున్నాయి. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పాటు అత్యుత్తమ ఫినిషర్ ధోనrనికూడా జట్టులో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్ విషయంలో నంబర్ వన్ బుమ్రా, భువనేశ్వర్‌కుమార్ ఉండటం అదనపు బలం. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌నైనా తిప్పలు పెట్టే సత్తా బుమ్రాకు ఉంది. భువనేశ్వర్ కూడా అంతే. బ్యాటింగ్ విషయంలో శిఖర్ ధావన్, రోహిత్‌శర్మ కలిసి పవర్‌ప్లేలో పరుగులు పిండుకుంటున్నారు. ఛేదనలో భారత్ మంచి రికార్డు కలిగి ఉంది. కప్పు గెలవాలంటే ప్రతి జట్టు భారత్‌ను దాటాల్సిన అవసరం ఉంది’ అని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. మే 30వ తేదీ నుంచి వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
ఇంగ్లండ్Vs భారత్ కాదు.. మెన్ Vs బాయ్స్
లండన్ : లార్డ్స్ టెస్టులో టీమిండియా ఆటగాళ్ల ఆట చిన్నపిల్లలను తలిపించిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్ ఎగతాళి చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమ చూపించలేకపోయారని, మెన్Vs బాయ్స్ అన్నట్లు సాగిందని విమర్శించాడు. ఈ దిగ్గజ క్రికెటర్ ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘ఇక్కడి పిచ్ పరిస్థితుల్లో ఇంగ్లండ్ అద్భుతమని తెలిసిందే. కానీ ప్రపంచ నెం1 అయినా భారత్ ఎలా ఆడుతుందోనని అందరూ దృష్టిసారించారు. కానీ ఆజట్టు ఘోరంగా విఫలమైంది. ప్రపంచనెం1 అంటే ఓ తుపాకీలాంటి జట్టు. సిరీస్ హోరాహోరిగా సాగుతుందనుకుంటే మెన్Vs బాయ్స్ అన్నట్లు సాగింది. వారు అపసవ్య దిశలో పయనిస్తున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో రాణించిన కోహ్లి లార్డ్స్‌లో విఫలమయ్యాడు. వెన్నునొప్పితో అతను బాధపడినట్లు కనిపించింది. ఇక అశ్విన్ పోరాటం ఆకట్టుకుంది. కానీ మిగతా బ్యాట్స్‌మన్ వారి వైఫల్యాన్ని కొనసాగించారు. మూడో టెస్ట్ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ కూడా భారత్‌కు ప్రతికూలమే. వారు కష్టపడితే డ్రా మాత్రమే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లండ్ పేసర్స్ జేమ్స్ అండర్సన్, బ్రాడ్‌లకు మంచి రికార్డు ఉంది. కనుక ఈ మ్యాచ్ భారత్‌కు అంత సులువు కాదు. 2016 భారత్‌లో జరిగిన సిరీస్ 4-0 వైట్‌వాష్‌ను ఇంగ్లండ్ 5-0తో తిరిగివ్వనుంది. ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం ఆకలితో ఉంది. వారు విశ్రాంతి తీసుకోరు. ఇంకా ఇంకా బాగా ఆడాలని ప్రయత్నిస్తారు’ అని నాసీర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. (చదవండి: కోహ్లి ‘టాప్’ చేజారె... ) ఇక ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 159 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో చివర వరకు పోరాడి 31 పరుగులతో ఓటమి చెందింది. దీంతో ఇంగ్లండ్ 5 టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. చదవండి: గెలిపించేదెవరు..? -
టవల్లో దగ్గరి పోలికలు ఉండటంతో...
లండన్ : సరదాకి ఓ క్రికెటర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో పెద్ద కలకలాన్నే రేపింది. హఠాత్తుగా దాన్ని చూసిన వారంతా అది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోటోనేనంటూ పలువురు ట్రోలింగ్ చేయటం మొదలుపెట్టారు. అయితే కొన్ని క్షణాలు నిశితంగా పరిశీలించిన వారికి అది ఆయన కాదని తెలిసిపోతుంది. అయినప్పటికీ ఆ రెండు ఫోటోలతో ఆడేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఈ ఉదయం ఓ ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇందులో ఉన్న మాజీ క్రికెటర్‌ను కనిపెట్టండంటూ ప్రశ్నించాడు. టవల్లో ఉన్న ఓ వ్యక్తి విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫోటో అది. అందులో ఉన్నది ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్ అన్నది ఈజీగా చెప్పేయొచ్చు. కానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో హుస్సేన్‌కు కాస్త దగ్గరి పోలికలు ఉన్నాయంటూ కొందరు ఆ ఫోటో క్షణాల్లో షేర్ చేసేశారు. దీంతో సోషల్ మీడియాలో గందరగోళం మొదలైంది. కొందరు అది పుతిన్ అంటే.. ఇలాంటి బోల్డ్ పనులు చేసే గట్స్ ఆయనకే ఉన్నాయంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. కావాలంటే కంపేర్ చేసుకోండి అంటూ గతంలో పుతిన్ పుణ్య స్నానం చేసిన సమయంలోని అర్ధనగ్నంగా ఫోటోలను ఆధారాలుగా చూపిస్తున్నారు. చాలా మంది మట్టుకు మాత్రం అది పుతినా లేక హుస్సేనా అన్నది నిర్ధారించుకోవటానికి సమయం పట్టిందని చెప్పటం విశేషం. Does anyone recognise this former England captain? @WardyShorts @BumbleCricket pic.twitter.com/upIZ7KmIl4 — Jos Buttler (@josbuttler) 26 February 2018