T20 WC 2022, IND VS ENG, 2nd Semi-Final: Nasser Hussain Asked For Surya Kumar Weakness, Only One Replied - Sakshi
Sakshi News home page

T20 WC 2022 IND VS ENG: సూర్యకుమార్‌ గొప్ప ఆటగాడే, కానీ.. ఆ ఒక్క విషయంలో మాత్రం..!

Published Wed, Nov 10 2021 8:42 AM | Last Updated on Wed, Nov 30 2022 4:23 PM

T20 WC 2022 IND VS ENG: Nasser Hussain Asked For Surya Kumar Weakness, Only One Replied - Sakshi

Cricket News in Telugu: టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 10) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియా హాట్‌ ఫేవరెట్‌ కాగా.. ఇంగ్లండ్‌ అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాస్సర్‌ హుస్సేన్‌.. ఫ్యాన్స్‌కు ఓ క్విజ్‌ పోటీ పెట్టాడు.

ఇటీవలి కాలంలో, ముఖ్యంగా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ బలాలు, బలహీనతలు చెప్పాలని వాట్సాప్‌ ద్వారా అభిమానులను కోరాడు. నాస్సర్‌ హుస్సేన్‌ సంధించిన ఈ ప్రశ్నకు మెజారిటీ అభిమానులు పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయ్యారు. చాలా మంది, ఇంచుమించు 99 శాతం సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ బలాలు మాత్రమే వివరించగా.. కేవలం ఒక్కరు మాత్రమే అతని పలానా విషయంలో బలహీనంగా ఉన్నాడని రిప్లై ఇచ్చాడు.

సూర్యకుమార్‌.. పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌లను సమర్ధవంతంగా ఎదుర్కొనగలడు.. టెక్నిక్‌, భుజబలం, బంతిని బలంగా బాధడం అతని ప్రధాన అస్త్రాలు, స్క్వేర్‌లో అతను షాట్లు బాగా ఆడగలడు, క్రికెట్‌ చరిత్రలోనే సూర్యకుమార్‌ ఆడినట్లు స్కూప్‌ షాట్‌ ఎవ్వరూ ఆడింది లేదు, ఆడలేరంటూ దాదాపుగా అందరూ సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ బలాలను విశ్లేషించారు.

అయితే ఒక్కరు మాత్రం.. సూర్యకుమార్‌ స్లో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడటం గమనించానని, ఇదే అతనికి ఉన్న ఏకైక వీక్‌నెస్‌ కావచ్చని పేర్కొన్నాడు. నాస్సర్‌ హుస్సేన్‌ ఈ క్విజ్‌కు సంబంధించిన వివరాలను సహచరుడు, మాజీ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మైక్‌ ఆథర్టన్‌తో కలిసి విశ్లేషిస్తూ మీడియాకు వెల్లడించాడు.  
 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement