Sunil Gavaskar says Without Suryakumar Yadav, India will struggle to get 150
Sakshi News home page

సూర్యకుమార్‌ లేకపోతే టీమిండియా 150 పరుగులు కూడా చేయలేదు..!

Published Tue, Nov 8 2022 12:14 PM | Last Updated on Tue, Nov 8 2022 12:51 PM

T20 WC 2022: With Out Surya Kumar India Cannot Even Score 150 Runs, Says Sunil Gavaskar - Sakshi

T20 WC 2022: టీమిండియా బ్యాటింగ్‌ విభాగాన్ని ఉద్దేశించి దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ లేకపోతే ప్రపం‍చకప్‌లో భారత జట్టు కనీసం 150 పరుగులు చేసేందుకు కూడా కష్టాపడాల్సి వస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే సందర్భంగా లిటిల్‌ మాస్టర్‌ సూర్యకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యకుమార్‌ ఓ నయా స్టార్‌ అని ఆకాశానికెత్తాడు. గ్రౌండ్‌ నలుమూలల్లో అతను ఆడలేని షాట్‌ లేదంటూ కొనియాడాడు. మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అని పిలుపించుకోవడానికి అతను వంద శాతం అర్హుడని కితాబునిచ్చాడు. క్రీజ్‌లో కుదురుకుంటే అతను కొట్టలేని షాట్‌ అంటూ లేదని ప్రశంసించాడు. టెక్నిక్‌తో పాటు భుజబలం అతని ప్రధాన అస్త్రాలని పేర్కొన్నాడు.

క్రికెట్‌ చరిత్రలో కొన్ని షాట్లు ఆడటం సూర్యకుమార్‌కు మాత్రమే సాధ్యపడుతుందని అన్నాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, ఇటీవలి కాలంలో అతనాడిన ఇన్నిం‍గ్స్‌లు చూసిన ఎవరైనా ఇదే విషయాన్ని చెబుతారని తెలిపాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని పిచ్‌లపై సూర్యకుమార్‌ చెలరేగుతున్న విధానం అమోఘమని కొనియాడాడు.

ప్రస్తుతం స్కై భీకరమైన ఫామ్‌లో ఉన్నాడని, అతని ధాటికి ఎంతటి బౌలర్‌ అయినా బలి కావాల్సిందేనని సెమీస్‌కు ముందు ప్రత్యర్ధులను హెచ్చరించాడు. వరల్డ్‌కప్‌లో ఇప్పటికే 3 హాఫ్‌ సెంచరీలు చేసి జోరుమీదున్న సూర్యకుమార్‌ను ఆపడం ప్రత్యర్ధులకు కత్తిమీద సామేనని అన్నాడు. సూర్యకుమార్‌ కారణంగానే టీమిండియా భారీ స్కోర్లు సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. 

కాగా, టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీస్‌లో ఏయే జట్లు తలపడనున్నాయో ఇదివరకే కన్ఫర్మ్‌ అయిన విషయం తెలిసిందే. నవంబర్‌ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌లు.. ఆమరుసటి రోజు (నవంబర్‌ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్‌ 13న ఫైనల్‌ జరుగుతుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement