సౌరవ్ గంగూలీ(ఫైల్‌ఫొటో)
లండన్: సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టిన గ్రేటెస్ట్ కెప్టెన్లలో ఒకడు. ప్రధానంగా టీమిండియాకు దూకుడు నేర్పిన కెప్టెన్ అంటే బాగుంటుంది. యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి వారి నమ్మకాన్ని చూరగొన్న కెప్టెన్. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌ల వంటి స్టార్లు వెలుగులోకి రావడానికి గంగూలీనే కారణం. అయితే భారత క్రికెట్ జట్టులో ఒక సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఎదిగిన గంగూలీని ప్రత్యర్థి జట్ల కెప్టెన్ల అసహ్యించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆట పరంగా కాకపోయినా టాస్ పరంగా గంగూలీ అవతలి జట్టు కెప్టెన్‌కు విసుగుతెప్పించేవాడు. (నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?)
టాస్ వేయడానికి గంగూలీ రావాల్సిన సమయంలో రాకుండా చాలా ఆలస్యంగా వచ్చేవాడని ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా తెలపగా, దానికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సమర్ధించాడు. ‘ అవును.. గంగూలీకి టాస్‌కు చాలా ఆలస్యంగా వచ్చేవాడు. ప్రతీ సింగిల్ మ్యాచ్‌లోనూ గంగూలీ టాస్ వేయడానికి ఆలస్యంగానే వచ్చేవాడు. మమ్మల్ని నిరీక్షించేలా చేసేవాడు. ఇది నాకు గంగూలీపై అసహ్యాన్ని పుట్టించేది. కానీ నేను దశాబ్ద కాలంగా గంగూలీతో కామెంటరీ విభాగాన్నితరచు పంచుకుంటున్నాను. చాలా మంచి మనిషి గంగూలీ. చాలా కామ్ గోయింగ్. ఒక లవ్లీ పర్సన్. క్రికెటర్లు ఎవరైనా ఇలానే ఉంటారామో. మనం వారితో ఆడుతున్నప్పుడు ఇష్ట పడం. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిస్తే వారిలో మంచి కోణం కనబడుతుంది. వారు మంచి మనుషుల్లో కనబడతారు. గంగూలీ విషయంలో కూడా నాకు జరిగింది అదే’ అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో గంగూలీతో జ్ఞాపకాలను నాసిర్ హుస్సేన్ పంచుకున్నాడు.(విరాట్ కోహ్లికి సరికొత్త తలపోటు)
ఐసీసీ నిర్వహిస్తున్న క్రికెట్ ఇన్‌సైడ్ అవుట్ తాజా ఎపిసోడ్‌లో సచిన్ గురించి హుస్సేన్ ప్రస్తావించాడు. టీమిండియాతో మ్యాచ్‌లకు ముందు తాము ఎప్పుడూ సచిన్‌ను ఎలా ఔట్ చేయాలి అనే దానిపైనే ఎక్కువ చర్చిస్తూ ఉండేవాళ్లమన్నాడు. అయితే ఎన్ని మీటింగ్‌ల్లో ఇలా సచిన్ ఔట్ గురించి చర్చించామో గుర్తులేదన్నాడు. ఇక అద్భుతమైన టెక్నిక్ సచిన్ సొంతమని హుస్సేన్ ప్రశంసించాడు.
Comments
Please login to add a commentAdd a comment