సౌరవ్ గంగూలీ- విరాట్ కోహ్లి(PC: BCCI)
Sourav Ganguly Comments On Virat Kohli Form: ఫామ్‌లేమితో సతమతమవుతూ విమర్శల పాలవుతున్న టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. కోహ్లి గొప్ప క్రికెటర్ అని, త్వరలోనే అతడు తిరిగి పుంజుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆటలో ఇలాంటి ఆటుపోట్లు సహజమేనని.. తాను కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు దాదా తెలిపాడు.
విమర్శల జల్లు!
అదే విధంగా సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ సైతం ఒకానొక దశలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నవాళ్లే అని పేర్కొన్నాడు. కాగా రన్‌మెషీన్‌గా పేరొందిన విరాట్ కోహ్లి సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు కావస్తోంది.
మరోవైపు టీమిండియాలో చోటు కోసం యువ క్రికెటర్లు దూసుకువస్తున్నారు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో ప్రతిభను నిరూపించుకుని సీనియర్లకు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి ఫామ్‌లేమిపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.
ఆ విషయం కోహ్లికి తెలుసు!
అతడిని పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందని కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు సూచిస్తున్నారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా సునిల్ గావస్కర్ వంటి లెజెండ్స్ సైతం త్వరలోనే పాత కోహ్లిని చూస్తామంటూ అతడికి అండగా నిలిచారు.
తాజాగా ఈ విషయంపై గంగూలీ స్పందిస్తూ.. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు సాధించిన విజయాలు గమనిస్తే ఎంతటి సమర్థత కలిగిన ఆటగాడో అర్థమవుతుంది. తను క్వాలిటీ బ్యాటర్. అయితే, ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.
ఈ సంగతి అతడికి కూడా తెలుసు. నిజానికి తను గొప్ప క్రికెటర్. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడని తనకూ తెలుసు. ఇదే కొనసాగితే తన కెరీర్ ఏమవుతుందో కూడా తెలుసు. అయితే, తను తిరిగి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తున్నాను. విరాట్ కోహ్లికి ఆ సత్తా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న కోహ్లికి తిరిగి ఫామ్‌లోకి రావడం ఏమంత పెద్ద విషయం కాదు’’ అని ఎన్డీటీవీతో పేర్కొన్నాడు.
అవన్నీ పట్టించుకోవద్దు!
అదే విధంగా.. ‘‘కెరీర్‌లో ఇలాంటి ఎత్తుపళ్లాలు సహజం. ప్రతి ఒక్కరికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. సచిన్, రాహుల్.. నా విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు కోహ్లి వంతు!
భవిష్యత్తులో మరికొంత మందికి ఈ పరిస్థితి ఎదురుకావొచ్చు. అలాంటపుడు విమర్శలు పట్టించుకోవద్దు. పొరపాటు ఎక్కడ ఉంది.. దానిని ఎలా సరిదిద్దుకోవాలి? అన్న విషయాలపై దృష్టి సారించాలి. మైదానంలోకి దిగినపుడు ఇవన్నీ పక్కనపెట్టి నీ ఆటను నువ్వు ఆడాలి’’ అని గంగూలీ యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు.
చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్‌కు కోహ్లి దూరం! ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే!
Comments
Please login to add a commentAdd a comment